Nitish Kuma
-
ShameOnNitish: మహిళల వస్త్రధారణ వ్యాఖ్యలపై దుమారం
పాట్నా: మహిళల వస్త్రధారణపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాను అధికారం చేపట్టిన 20ఏళ్ల తర్వాత రాష్ట్రంలోని మహిళల వస్త్రధారణ మెరుగుపడిందంటూ వ్యాఖ్యానించారాయన. దీనిపై అన్నివైపుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నితీష్ సర్కార్ ప్రస్తుతం రాష్ట్రమంతటా ‘ప్రగతి యాత్ర’ ( Pragati Yatra)ను నిర్వహిస్తుంది. బెగుసరాయ్ జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నితీష్ కుమార్ మహిళల వస్త్రధారణపై కామెంట్లు చేశారు. అయితే.. ఆ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత,మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. సీఎం నితీష్ కుమార్ ఫ్యాషన్ డిజైనర్ కాదని, ఆ మాటలు ఆయన వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అయితే, సీఎం నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో "ShameOnNitish" వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ‘అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బాగా మాట్లాడతారు. చక్కని దుస్తులు ధరిస్తారు. వారు ఇంతకు ముందు ఇంత మంచి బట్టలు ధరించడం మనం చూశామా?అని ప్రశ్నిస్తూనే.. ‘ఇంతకు ముందు బీహార్ కుమార్తెలు మంచి దుస్తులు ధరించలేదని కాదు. వారు తమను తాము ఆత్మగౌరవం, స్వావలంబనతో కప్పుకున్నారు’ అంటూ సీఎం నితిష్ వ్యాఖ్యల్ని ఖండించారు. సీఎంగారు.. మీరు మహిళల కోసం ఫ్యాషన్ డిజైనర్‌గా మారడానికి ప్రయత్నించవద్దు. మీ ఆలోచనలు వికృతంగా ఉన్నాయి. మీ ప్రకటన రాష్ట్ర మహిళల్ని అవమానించేలా ఉన్నాయని’ ధ్వజమెత్తారు. पहले बिहार की बेटियां कपड़े ही नहीं, स्वाभिमान, स्वावलंबन और सम्मान भी पहनती थीं नीतीश कुमार जी।‘स्त्री परिधान वैज्ञानिक' मत बनिए’! आप 𝐂𝐌 है 𝐖𝐨𝐦𝐞𝐧 𝐅𝐚𝐬𝐡𝐢𝐨𝐧 𝐃𝐞𝐬𝐢𝐠𝐧𝐞𝐫 नहीं। 'स्त्री परिधान विशेषज्ञ' बनकर अपनी घटिया सोच का प्रदर्शन बंद कीजिए। ये बयान नहीं,… pic.twitter.com/9DPrOqbTjS— Tejashwi Yadav (@yadavtejashwi) January 18, 2025 -
‘ఆ అందమైన మొహం ఇప్పుడు ఎక్కడ’
పట్నా : బిహార్ ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద విమర్శల వర్షం కురిపించారు. నా మొహం చూసి జనాలు ఓట్లు వేస్తారని ప్రగల్భాలు పలికిన వ్యక్తి.. నేడు మొహం చాటేశాడు ఎందుకు అని నితీశ్ కుమార్‌ని ప్రశ్నించారు తేజస్వీ. సీఎం నితీశ్ కుమార్ నియోజకవర్గమైనా నలందలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ యాదవ్. ఈ క్రమంలో ఆయన సీనియర్ రిపోర్టర్ ప్రణయ్ రాయ్‌తో ముచ్చటించారు. నలంద ప్రజలకు నితీశ్ కుమార్ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయిందన్నారు. రిజర్వేషన్ల విషయంలో నితీశ్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని పేర్కొన్నారు తేజస్వీ. అంతేకాక గతంలో ‘జనాలు నా మొహం చూసి ఓటు వేస్తారని చెప్పిన వ్యక్తి.. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడిని చూపించి ఓట్లు వేయమని కోరుతున్నారు. భారత ఆర్మీని, ఒకప్పుడు తాను ఎంతగానో ద్వేషించిన మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు ఎందుకు. ఇప్పుడు ఆయన అందమైన మొహం ఎక్కడ’ అని తేజస్వీ ప్రశ్నించారు. ఉగ్రవాదుల మీద దాడుల చేయడం మాత్రమే నిజమైన దేశ భక్తి అనిపించుకోదన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి.. వారిని ఆర్థికంగా బలంగా తయారు చేయడం కూడా దేశభక్తే అన్నారు. పేదరికం తొలగించడం.. యువతకు ఉపాధి కల్పించడం వంటి అంశాలన్ని కూడా దేశభక్తి కిందకే వస్తాయన్నారు తేజస్వీ. -
నాతోపాటూ...రాష్ట్రాన్నీ అవమానించారు
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక బహిరంగ లేఖను బుధవారం ట్విట్టర్లో సంధించారు. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంటరైన నితీష్ కుమార్ తన ట్విట్టర్లో ఈ లేఖను పోస్ట్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా అవమానించారని ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ తన డీఎన్ఎ గురించి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే బీహార్ ప్రజలు ఆయనను క్షమించరని లేఖలో పేర్కొన్నారు. మోదీ మాటలు తమలో చాలామందికి బాధ కలిగించాయని నితీష్ కుమార్ పేర్కొన్నారు. తాను బీహార్ బిడ్డననీ, బీహార్ ప్రజల డీఎన్ఎ తన డిఎన్ఎ ఒకటేనని స్పష్టం చేశారు. తన డీఎన్ఎ గురించి వ్యాఖ్యానించి బీహార్ ప్రజలను కూడా అవమానించారని మండిపడ్డారు. తమ పార్టీని బీహార్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. గత నెలలో బీహార్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ సీఎం నితీష్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన (నితీష్్) జితేన్ రామ మాంఝీ లాంటి మహాదళితుణ్ని అవమానించడంద్వారా, నన్ను కూడా అగౌరవపర్చారని మోదీ వ్యాఖ్యానించారు. బహు శా ఆయన డిఎన్ఎలోనే ఏదో లోపముంది... భారతదేశంలోని ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి ఉందని విమర్శించిన సంగతి తెలిసిందే. Sharing my Open Letter to @NarendraModi about his comment on my DNA http://t.co/x1qypoZEus pic.twitter.com/dFekhbpLjI — Nitish Kumar (@NitishKumar) August 5, 2015