పాట్నా: ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ హాజరయ్యారు. పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు ఆర్జేడీ కార్యకర్తలు భారీగా గుమిగూడారు.
ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ ఇంట‍్లోనూ ఈడీ దాడులు జరిపింది. నిన్న లాలూని 9 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో తమ ఆరోపణలు నిజమేనని స్పష్టం చేసింది. అక్రమంగా రైల్వే ఉద్యోగాలు ఇచ్చి లంచాలు తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ భార్య రబ్రి దేవి గోశాలలో పనిచేసే వ్యక్తి పేరుపై మొదట రైల్వే ఉద్యోగుల నుంచి లంచాలు పుచ్చుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ఆస్తుల్ని లాలూ కూతురు హేమా యాదవ్‌కు బదిలీ చేశారని వెల్లడైంది. ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ కంపెనీలకు నిధుల్ని బదిలీ చేశారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆయా కంపెనీల షేర్లు లాలూ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు. అమిత్ కత్యాల్ అనే వ్యక్తి లాలూ ప్రసాద్ యాదవ్ కోసం ఈ కంపెనీలను నిర్వహించాడని ఈడీ దర్యాప్తులో బయటపడింది.
ఇదీ చదవండి: Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ సీఎం ఎక్కడ? 18 గంటలుగా మాయం?
Comments
Please login to add a commentAdd a comment