తాళ్లరేవు :
రెండు రోజుల పాటు స్థానిక నామన వెంకాయమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జేఏసీ చైర్మ¯ŒS బూరిగ ఆశీర్వాదం తదితరులు హాజరయ్యారు. సీపీఎస్ పోరాటంలో పాల్గొంటామని, సీసీఈకి వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడతానని సూర్యారావు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఏపీలో లక్షా 20 వేల సభ్యత్వాలుండగా, 15 వేల సభ్యత్వాలతో సంఘ జిల్లా శాఖ అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా జి.ప్రభాకరవర్మ, అధ్యక్షునిగా డీవీ రాఘవులు, ప్రధాన కార్యదర్శిగా టి.కామేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎ¯ŒS.అరుణకుమారి, జె.అప్పారావు, కోశాధికారిగా కేవీ ప్రసాద్‌బాబుతో పాటు మరో 19 మంది కార్యదర్శులను ఎన్నుకున్నారు.