నlల్లగొండ టూటౌన్ : తెలంగాణలో జోనల్ వ్యవస్థను కొనసాగించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్‌లో జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న విద్యా సంస్థల్లోనే ఉపాధ్యాయులను కొనసాగించాలని కోరా రు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సరళ, ఎడ్ల సైదులు, లక్‌పతినాయక్, పి.వెంకటేశం, యాదయ్య, బి.అరుణ, సోంబాబు, రామలింగయ్య పాల్గొన్నారు.