సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హంగ్ వస్తుందంటూ బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి. నేతలు వివేకంతో ఆలోచించాలి’’ అని బీఎల్ సంతోష్ హితవు పలికారు.
కాగా, నిన్న(గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో కూడా బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని సంతోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
చదవండి: ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో సీఎం పోస్టుపై కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment