నకిలీ నోట్లు: దేశవ్యాప్త సోదాలు | intelligence checks over fake currency | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లు: దేశవ్యాప్త సోదాలు

Published Mon, Mar 20 2017 3:21 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

దేశంలోకి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు వచ్చాయన్న సమాచారం మేరకు కస్టమ్స్‌, రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు అన్ని పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు.

చెన్నై: దేశంలోకి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు వచ్చాయన్న సమాచారం మేరకు కస్టమ్స్‌, రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు అన్ని పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. రెండు రోజులుగా తాము అన్ని పోర్టుల్లోకి వచ్చిన కంటెయినర్లను సోదా చేస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. శ్రీలంక, పాకిస్తాన్‌ దేశాల నుంచి వచ్చిన నౌకల ద్వారా వచ్చిన కంటెయినర్లను మాత్రమే చూస్తున్నారా అన్న విలేకరుల ప్రశ‍్నకు ఆ అధికారి నేరుగా సమాధానం చెప్పలేదు. గత రెండు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయని బదులిచ్చారు. నకిలీ రూ. 2000 నోట్లను ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిపిన సోదాల్లో పెద్ద మొత్తంలో బయటపడిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు సోదాలు చేపట్టినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement