విద్యుత్ దీపాలతో ముస్తాబైన వర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శర్భానంద్ సోనోవాల్
సబ్బవరం(పెందుర్తి): సముద్రతీర అధ్యయనాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలని కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్ ఆకాంక్షించారు. మండలంలోని వంగలిలో గల ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాన్ని గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. సుమారు 110 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయం చెన్నై నుంచి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి మూడు వైపుల సముద్రం ఉండడంతో సముద్రతీర అధ్యయనాలకు ఓడరేవుల అభివృద్ధికి, నౌకా నిర్మాణాలకు, డిజైన్లకు ఎంతో భవిష్యత్ ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని దేశం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించాలని తెలియజేశారు. చెన్నై నుంచి ఐఎంయూ ఉపకులపతి మాలిని పి.శంకర్, ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే రమేష్ అరవింద్ పాల్గొనగా.. విశాఖ కలెక్టరేట్‌లోని నిక్ నుంచి వర్సిటీ డైరెక్టర్ కేశవదేవ్, వీవీ శివకుమార్, ఆకెళ్ల వెంకటరమణ మూర్తి, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షైజీ, డాక్టర్ పట్నాయక్, డాక్టర్ వి.రవిచంద్రన్, సీతాకుమారి, డాక్టర్ శిరీషా, ఈపీఎస్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment