maritime
-
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
Global maritime india summit 2023: సముద్ర వాణిజ్య ఆర్బిట్రేషన్ కేంద్రంగా భారత్!
ముంబై: సముద్ర వాణిజ్య అంశాలు, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం భారత్‌లో ఏర్పడాలన్న ఆకాంక్షను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యాలు, న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. దేశ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఫైనాన్సింగ్, బీమా, మధ్యవర్తిత్వం, మరిన్ని విభిన్న సౌలభ్యాల సృష్టి అవసరమని కూడా అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సరఫరాలు, సరఫరాల భద్రతలో అంతరాయాలు, సరఫరాల చైన్ విచి్ఛన్నం వంటి పలు సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో జరిగిన ఈ సదస్సుకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ‘మారిటైమ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఆర్బిట్రేషన్’ అన్న అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... సెషన్లో ప్రసంగించారు. ► లండన్ లేదా సింగపూర్ లేదా దుబాయ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బ్రిట్రేషన్) కేంద్రాలలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, వారంతా అక్కడి సీనియర్ న్యాయవాదులకు సహాయం చేస్తున్నారు తప్ప, ఒక కేసును స్వయంగా చేపట్టి, పరిష్కరించడంలేదు. ఈ ధోరణి మారాలి. ► మన మధ్యవర్తిత్వ ప్రక్రియలు, చట్టాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం అవసరం. తద్వారా అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మనం ఈ దిశలో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ► భారత్ మధ్యవర్తిత్వంలో తన బలాన్ని మెరుగుపరచుకుంటోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలు– ఒత్తిళ్లను తగ్గించుకునే దిశలో దేశం పూర్తి స్థాయి భారత్–ఆధారిత రక్షణ, నష్టపరిహార (పీఅండ్ఐ) సంస్థను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇది షిప్పింగ్ కార్యకలాపాల లో మరింత వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది. తీరప్రాంత, లోతట్టు జలాల్లో పనిచేసే నౌక లకు తగిన రక్షణాత్మక చర్యలను అందిస్తుంది. ► ప్రధాన వస్తువుల ఎగుమతులు కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతాయి. ఫలితంగా ఆహార అభద్రత శక్తి అభద్రత వంటి అంశాలు తీవ్రతరమవుతాయని. దీనితో ద్రవ్యోల్బణం సమస్యా తలెత్తవచ్చు. కోవిడ్ సవాళ్ల నుండి బయటకు వస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ప్రపంచవ్యాప్త పరస్పర సహకారంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ► సముద్ర రంగానికి ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ రంగానికి నిధులు సమకూర్చడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఈ రంగానికి సంబంధించిన అధిక నష్టాల అవకాశం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సముద్రరంగం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ► భారత్– మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇప్పుడు కీలకం. మేము యూరప్, మధ్య ఆసియాలను సముద్రం అలాగే భూ మా ర్గం ద్వారా చేరుకోవాలని చూస్తున్నాము. తద్వా రా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం జరుగుతోంది. ► కోవిడ్–19 తర్వాత సముద్ర వాణిజ్యానికి మద్దతుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), దేశీయ బీమా కంపెనీల మద్దతుతో ‘‘మెరైన్ కార్గో పూల్’’ ఆవిష్కరణ జరిగింది. ► 12 ప్రభుత్వ ఓడరేవుల్లో తొమ్మిదింటిలో 35 ప్రాజెక్టులను మానిటైజేషన్ కోసం గుర్తించడం జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా రూ. 14,483 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోనటైజ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్ -
హార్బర్లకు సమాంతరంగా ఆహ్లాదం
సాక్షి, అమరావతి : ఫిషింగ్ హార్బర్లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. వాటి పక్కనే రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వాటర్ పార్క్స్, అమ్యూజ్మెంట్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. అలాగే ఫిషింగ్ హార్బర్లలో పట్టే చేపలను ప్రోసెసింగ్ చేయడం ద్వారా ఆదాయం తెచ్చేందుకు ఏర్పాట్లూ చేస్తోంది. తొలి దశ ఫిషింగ్ హార్బర్ల పనులు పూర్తి కావస్తుండటంతో పీపీపీ విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి ఫిషింగ్ హార్బర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో టూనా చేపలు, రొయ్యల కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది. జువ్వలదిన్నెలో 90 శాతం పనులు పూర్తి సుమారు రూ.1523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేవాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి కావడంతో ఈ సెప్టెంబర్ నాటికి సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా 5,900 బోట్లు నిలుపుకొనే అవకాశం రావడంతో పాటు ఏటా 2,37,350 టన్నుల చేపలను పడతారని అంచనా. ఈ ఫిషింగ్ హార్బర్ల ద్వారా రాష్ట్రంలోని 555 మత్స్యకార గ్రామాల్లోని 6.3 లక్షల మత్స్యకారులు లబ్ధిపొందనున్నారు. -
పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులే లక్ష్యం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధారంగా పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. వచ్చే ఏడాది విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పోర్టు ఆధారిత విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సదస్సులో పరిశ్రమలు, ఇంధన రంగం తర్వాత పోర్టు ఆధారిత రంగంలో పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్గో టెర్మినల్స్, లాజిస్టిక్స్ పార్క్, ఐసీడీ, వేర్ హౌసింగ్ తదితరాల్లో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాల గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని భావిస్తున్నారు. యూఏఈ, జపాన్ తదితర దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మారిటైమ్ బోర్డు అధికారులు వెల్లడించారు. కొత్తగా నిర్మిస్తున్న 4 పోర్టుల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు.. ఈ పోర్టుల పక్కనే అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులు, వాటిలో మౌలిక వసతుల కల్పన తదితరాలను కూడా వివరించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సముద్ర ఆధారిత వాణిజ్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ జనవరిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గుంటూరు వేదికగా సముద్రపు ఆహార ఉత్పత్తులు, వాటి రంగంలో పెట్టుబడుల అవకాశాలపై సదస్సు నిర్వహించడానికి ఏపీ మారిటైమ్ బోర్డు కసరత్తు చేస్తోంది. -
ముగిసిన భారత్–ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్–ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించిన మారీటైమ్ విన్యాసాలు శనివారం ముగిశాయి. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం సమీపంలోని బంగాళాఖాతం తీరం ఈ విన్యాసాలకు వేదికైంది. ఇండో పసిఫిక్ ఎండీవర్(ఐపీఈ)–2022లో భాగంగా గత నెల 30న రాయల్ ఆస్ట్రేలియా రక్షణ దళాలు విశాఖ చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన విన్యాసాల ముగింపు నేపథ్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన హెచ్ఎంఏఎస్ అడిలైడ్, హెచ్ఎంఏఎస్ అంజాక్ యుద్ధ నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొని సత్తా చాటాయి. చివరి రోజు విన్యాసాల్లో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన త్రివిధదళాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన యుద్ధ నౌకల్ని ఆస్ట్రేలియా రక్షణ బృందం సందర్శించాయి. హార్బర్ ఫేజ్‌లో ఉమ్మడి రక్షణ ప్రణాళికలు, పరస్పర అవగాహన ఒప్పందాలు, రక్షణ వ్యవస్థలో సహకార చర్యలు మొదలైన అంశాలపై చర్చించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
ఇండో పసిఫిక్ భద్రతపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, సవాళ్లపై ఆస్ట్రేలియాతో కలిసి అడుగులు వేస్తున్నామని తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రియర్ అడ్మిరల్ హరికుమార్ వెల్లడించారు. సీఎన్‌ఎస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాలో మూడు రోజులు అధికారికంగా పర్యటించారు. రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ మార్క్ హమ్మండ్, ఆస్ట్రేలియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ డేవిడ్ జాన్సన్‌తోపాటు రక్షణ శాఖకు చెందిన పలువురు ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక ఒప్పందాలు, పరస్పర సహకారానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సాగర జలాల్లో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన చర్యలపై ఆస్ట్రేలియా అధికారులతో సమీక్షించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని గురువారం విశాఖపట్నం చేరుకున్న రియర్ అడ్మిరల్ హరికుమార్ సముద్ర పర్యావరణం, హిందూ మహాసముద్రం, ఇండో పసిఫిక్ తీరంలో ఆధిపత్యం, ఇతర అంశాలపై కేంద్రీకృత ప్రయత్నాలను పెంచాల్సిన అవసరాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని తూర్పు నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. -
300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం
స్టాక్‌హోమ్: స్వీడన్ తీరంలో సుమారు 300 మందితో వెళ్తున్న ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులను కాపాడేందుకు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్వీడన్ నౌకాదళ అధికారులు తెలిపారు. ‘కార్ డెక్‌లో మంటలు చెలరేగాయి. మూడు హెలికాప్టర్లు, ఏడు నౌకలను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికుల తరలింపు జరుగుతోంది.’ అని స్వీడన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధిని జోనస్ ఫ్రాంజెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, మంటలు అంటుకునేందుకు గల కారణాలేంటనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు జోనస్ ఫ్రాంజెన్. మరోవైపు.. మంటలు అదుపులోకి వచ్చినట్లు మరో అధికారి తెలిపారు. స్వీడన్ ఈశాన్య తీర ప్రాంతంలోని గోట్‌స్కా సాండన్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైన స్టేనా స్కాండికా నౌక ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రకృతి విలయం చేజేతులారా పాక్ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో! -
అన్నంత పని చేసిన అమెరికా! కస్సు మంటున్న చైనా
తైవాన్ జలసంధి గుండా ఇటీవల యూఎస్ మారిటైమ్ విమానం పయనించడంతో చైనా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. అదీగాక తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని ఇటీవలే అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. పైగా ఇరు ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం ఏర్పడుతుందని హెచ్చరించింది కూడా. మరోవైపు తైవాన్ తమ ద్వీప సమీపంలోనే చైనా వైమానిక దళాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ పదే పదే ఫిర్యాదులు చేసింది. దీంతో యూఎస్ కూడా తైవాన్‌ని ఇబ్బంది పెట్టవద్దని చైనాకి సూచించింది. తైవాన్ పట్ల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకోనని... తైవాన్‌కి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా మిలటరీ సాయాన్ని కూడా అందిస్తానని యూఎస్ తెగేసి చెపింది. ఈ మేరకు యూఎస్ తాను అన్నట్లుగానే మాటనిలబెట్టుకోవడమే గాక అన్నంత పనిచేసేసింది. దీంతో చైనా తీవ్రస్థాయిలో యూఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందటూ కన్నెర్ర జేసింది. శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగుతుందంటూ అమెరికా పై ఆరోపణలు చేసింది చైనా . యూఎస్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నొక్కి చెప్పింది. అంతేకాదు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి తమ సైన్యం సదా అప్రమత్తంగానే ఉందని చైనా స్పష్టం చేసింది. ఈ మేరకు భూ, వాయు మార్గాల్లో చైనా దళాలు అప్రమత్తంగా ఉన్నాయని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండ్ ప్రతినిధి కల్నల్ షియి తెలిపారు. తైవాన్‌ని తన భూభాగంగానే భావిస్తున్న చైనాకి అమెరికా ఈ వ్యవహరంలో తలదూర్చడం మింగుడు పడని అంశంగా మారింది. ఐతే ఈ వ్యాఖ్యలపై అమెరికా నావికదళం ఇంకా స్పందించలేదు. (చదవండి: చైనాని శత్రువుగా చిత్రీకరించవద్దు! అమెరికా చారిత్రక తప్పిదం) -
బ్లూ ఎకానమీ.. ఆ దిశగా ఏపీ సర్కార్ వేగంగా అడుగులు..
సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం (బ్లూ ఎకానమీ)పై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డు విదేశీ పోర్టుల భాగస్వామ్య అంశాలపై దృష్టిసారించింది. యూరప్‌లోనే అతిపెద్ద పోర్టుగా పేరొందిన నెదర్లాండ్స్‌లోని రోట్టర్ డ్యామ్, బెల్జియంకు చెందిన యాంట్‌వెర్ప్‌లతో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తోంది. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రతినిధులు రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులను కలిసి రాష్ట్రంలోని పోర్టుల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. ఏపీలో సుమారు రూ.30,000 కోట్ల వ్యయంతో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందిగా ఆ రెండు సంస్థలను కోరినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అంతర్జాతీయ పోర్టులతో చేతులు కలపడం ద్వారా విదేశీ వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం రాష్ట్ర పోర్టులకు వేగంగా కలుగుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రతిపాదనలపై రోట్టర్ డ్యామ్, యాంట్వెర్ప్ పోర్టు ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తంచేశాయని, త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖతను వ్యక్తంచేసినట్లు ఆయన తెలిపారు. నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలోనూ.. అదే విధంగా.. షార్జాకు చెందిన డామన్ షిప్‌యార్డ్ ప్రతినిధులతో కూడా సమావేశం జరిగిందని, రాష్ట్రంలో నౌకల తయారీ, రిపేరింగ్ రంగంలో పెట్టుబడుల అవకాశాలను వివరించినట్లు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దావోస్ పర్యటన సందర్భంగా ఆయా పోర్టులను సందర్శించి స్థానిక పరిశ్రమల ప్రతినిధులు, పోర్టు చైర్మన్లతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా దావోస్ పర్యటన అనంతరం విదేశీ పోర్టుల ప్రతినిధులను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానిస్తూ తాజాగా ఈ–మెయిల్స్ పంపామన్నారు. ఈ పర్యటనలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, మారిటైమ్ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, గత దుబాయ్ ఎక్స్పో సందర్భంగా షరాఫ్ గ్రూపు రాష్ట్ర లాజిస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపించిందని, త్వరలోనే ఈ కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. -
మత్స్యకారుల వెలుగులదిన్నె
అదంతా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం.. అపార మత్స్య సంపదకు నిలయం.. కానీ వేటకు అనువుగా లేని వైనం.. ఈ లోపాన్ని సరిదిద్దితే గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగు నింపడం ఖాయం.. ఉపాధి వలసలకు చెక్ పెట్టడం తథ్యం.. గత పాలకులు ఈ విషయాన్ని నిర్లక్ష్యంతో విస్మరిస్తే, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా, ప్రతిష్టగా తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన హార్బర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఒకటి. ఇది పూర్తయితే మత్స్యకారుల పాలిట ఇది వెలుగులదిన్నెగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయో ‘సాక్షి’ అటు వైపు తొంగి చూసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సముద్ర తీరాన విలువైన మత్స్య సంపద ఉన్నప్పటికీ, అది గంగపుత్రుల దరి చేరడం లేదని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సంపదను వారి దరికి చేర్చే దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. వివిధ పథకాల ద్వారా వారిని ఓ వైపు ఆదుకుంటూనే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా తొలి దశలో నాలుగింటిని నిర్మిస్తున్నారు. ఇందులో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే నిర్దేశిత గడువుకంటే ముందే ఇది అందుబాటులోకి వచ్చేలా ఉంది. గత ఏడాది మార్చి 19వ తేదీన దీని నిర్మాణం ప్రారంభమైంది. రెండేళ్లలో అంటే 2023 మార్చికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందుకోసం 250 మంది రేయింబవళ్లు పని చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. పెద్ద పడవలు సముద్రంలో నుంచి హార్బర్‌కు వచ్చేందుకు ఉపయోగపడే కీలకమైన బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. బ్రేక్ వాటర్ ప్రాంతం పూడిపోకుండా నిర్మించే బ్రేక్ వాటర్ వాల్స్‌ను సుమారు 3 లక్షల టన్నుల రాతితో పటిష్టం చేశారు. ఈ గోడలను సిమెంట్‌తో నిర్మించిన ట్రైపాడ్స్‌తో నింపుతున్నారు. అలల ఉధృతిని తట్టుకోవడానికి నిర్మించే 7 వేల ట్రైపాడ్స్ (త్రికోణాకారంలో ఉన్న సిమెంట్ దిమ్మెలు)లో 5 వేల ట్రైపాడ్స్ నిర్మాణం పూర్తయ్యింది. పెద్ద బోట్లు రావడానికి 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే 7 లక్షల క్యూబిక్ మీటర్లను వెలికి తీశారు. 1,250 బోట్లు నిలిపే 919 మీటర్ల జెట్టీ పునాదుల ప్రక్రియ పూర్తయింది. సెప్టెంబర్ నాటికి జెట్టీ కాంక్రీట్ పనులు పూర్తి చేసి, బోట్లను అనుమతించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అడ్మినిస్ట్రేషన్, మెరైన్ పోలీస్ స్టేషన్, కోల్డ్ స్టోరేజ్, చేపల వేలం కేంద్రం వంటి 30 శాశ్వత భవనాల పనులు మార్చిలోగా పూర్తి చేయనున్నారు. ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద 72 ఎకరాల్లో రూ.260 కోట్లతో నిర్మిస్తున్న ఈ హార్బర్ ద్వారా ఏటా అదనంగా 41,000 టన్నుల మత్స్య సంపద లభిస్తుందని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇంతకాలం పెద్ద బోట్లు నిలిచే అవకాశం లేక 25 నాటికల్ మైళ్ల దూరం దాటి, వేట చేపట్టలేకపోయేవాళ్లమని.. ఈ హార్బర్ వస్తే ప్రభుత్వ సహకారంతో పెద్ద మెకనైజ్డ్ బోట్లు కొనవచ్చని స్థానిక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా నష్టం ఇలా.. హార్బర్లు, ఇతర సౌకర్యాలు లేనందున రాష్ట్ర మత్స్యకారులు సాధారణ బోట్లతో తీరంలో కొద్ది దూరంలోనే వేట సాగిస్తున్నారు. దీంతో అనుకున్న రీతిలో మత్స్య సంపద లభించడం లేదు. దీంతో పలువురు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర తీరంలోని మత్స్య సంపదను తరలించుకుపోతున్నాయి. 60 వేల కుటుంబాలకు ఉపాధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా రూ.3,622.36 కోట్లతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారు. తొలిదశ కింద రూ.1,204.56 కోట్లతో నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, బాపట్ల జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లా ఉప్పాడ హార్బర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశ కింద రూ.1,496.85 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులు త్వరలో ప్రారంభించనున్నారు. తొలి దశలోని నాలుగు హార్బర్లను వచ్చే మార్చి నాటికి, రెండో దశలోని ఐదింటిని 2024లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొమ్మిదీ అందుబాటులోకి వస్తే 10,000కు పైగా మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మన సంపద మనకే ఇంతకాలం సౌకర్యాలు లేకపోవడంతో పెళ్లాం బిడ్డలను ఇక్కడే వదిలేసి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసపోయే వాళ్లం. తమిళనాడుకు చెందిన కడలూరు, నాగపట్నం, తూతుకూడిల మత్స్యకారులు వచ్చి మన తీరంలో చేపలు పట్టుకుపోతున్నారు. జువ్వల దిన్నె హార్బర్ వస్తే తమిళనాడు మత్స్యకారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. మన తీరంలో మత్స్య సంపదను మనమే పొందొచ్చు. – శీనయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె ఇక్కడే ఉపాధి.. చేపల వేట కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లేవాడిని. ఇక్కడ ఫిషింగ్ çహార్బర్ వస్తే నాకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్లతో పాటు వాటికి అవసరమైన మౌలిక వసతులు కూడా అభివృద్ధి చేస్తుండటం చాలా సంతోషం. – కుందూరు గోవిందయ్య, మత్స్యకారుడు, జువ్వలదిన్నె సెప్టెంబర్ నాటికి జెట్టీ నిర్మాణం పూర్తి రూ.260 కోట్లతో జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం చేపట్టాం. ఇప్పటికే బ్రేక్‌వాటర్, డ్రెడ్జింగ్, ట్రైపాడ్స్ నిర్మాణం, జెట్టీ పిల్లర్స్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్, శీతల గిడ్డంగి, వేలం కేంద్రం వంటి భవనాల నిర్మాణం మొదలుపెట్టాం. ఈ సెప్టెంబర్ నాటికి జెట్టీని అందుబాటులోకి తెస్తాం. – కృష్ణమూర్తి, పీఎంయూ, ఏపీ అర్బన్ దేశ చరిత్రలో ఇదే ప్రథమం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,623 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలోని మత్స్యకారులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ ఉపాధి పొందేలా చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం. దీనికి అనుగుణంగా హార్బర్ల నిర్మాణం వేగంగా పూర్తి చేస్తున్నాం. – మురళీధరన్, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరిలో సైతం విశాఖ ప్రత్యేకత చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది. రక్షణ రంగంలో బలమైన శక్తిగా.. రక్షణ పరంగా తూర్పు నావికాదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖ తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు ఆతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది. తూర్పున ఏపీకి అగ్రస్థానం.. భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. 4వ స్థానంలో విశాఖ పోర్టు.. 2021–22 ఏడాదికి సంబంధించి మేజర్ పోర్టుల కేటగిరీలో విశాఖ ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో విశాఖ పోర్టు 4వ స్థానంలో నిలిచింది. 20.7శాతం వాటాతో 102.8 మిలియన్ టన్నుల లావాదేవీలతో దీనదయాళ్ పోర్టు తొలిస్థానంలో ఉండగా 13.5 శాతం వాటాతో పారాదీప్ పోర్టు, 13.1 శాతం 3వ స్థానంలో జేఎన్పీటి నిలిచాయి. ఈ కేటగిరీలో విశాఖ పోర్టు 8.7 శాతం వాటాతో 4వ స్థానంలో నిలిచింది. కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో లావాదేవీల్లో విశాఖపోర్టు మూడో స్థానంలో నిలిచింది. 24 శాతం వాటాతో 37.0 మిలియన్ టన్నుల లావాదేవీలతో పారాదీప్ పోర్టు తొలిస్థానంలో నిలవగా 14.3శాతం వాటాతో ముంబాయి పోర్టు 2వ స్థానంలోను, 12.5 శాతం వాటాతో విశాఖపోర్టు మూడు స్థానంలోని నిలిచాయి. మేజర్ పోర్ట్‌ల కేటగిరీలో తూర్పున సముద్ర వాణిజ్యంలో పారాదీప్ తరువాతి స్థానంలో విశాఖ నిలిచింది. ఏపీ మారిటైం బోర్డు బలోపేతం సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా ఏపీ మారిటైం బోర్డును బలోపేతం చేస్తున్నాం. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 13 నాన్ మేజర్ పోర్టులో ఏపీ తీరంలో ఉన్నాయి. వీటి ద్వారా ఏటా ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం ఏటా పెరుగుతోంది. త్వరలోనే రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు ఓడరేవులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రకాశం జిల్లా రామయ్యపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాం. చేపల నిల్వ, విక్రయాలకు అనువుగా ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా దేశం ఆశ్చర్యపోయే రీతిలో మారీటైం బోర్డును బలోపేతం చేయనున్నాం. – కనకాల వెంకటరెడ్డి, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ -
సముద్ర వాణిజ్యంలో అగ్రగామిగా..
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): తూర్పుతీరంలో సముద్ర వాణిజ్యంలో అన్నివేళల బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. బంగాళాఖాతం వెంబడి ఉన్న అనేక నగరాలను దాటుకొని వాణిజ్యం, రక్షణ అంశాల్లో తూర్పు తీరం అగ్రగామిగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మేజర్ పోర్టుల కేటగిరీలో సైతం విశాఖ ప్రత్యేక చాటుతోంది. వాణిజ్య పరంగా పోర్టు నుంచి రికార్డు స్థాయిలో సరుకు రవాణా సాగిస్తోంది. దశాబ్దాలుగా వాణిజ్య సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. నేడు జాతీయ మారిటైం దినోత్సవాన్ని పురస్కరించుకొని సముద్ర వాణిజ్యం, రక్షణ రంగాల్లో పటిష్టమవుతున్న విశాఖ ఖ్యాతిపై ప్రత్యేక కథనం. విశాఖ ఓడరేవును లార్డ్ విల్లింగ్డన్ 1933, డిసెంబర్19న ప్రారంభించారు. రూ 3.78 కోట్లు వ్యయంతో ఈ ఓడరేవు నిర్మించారు. ప్రారంభంలో 3 బెర్త్‌లతో ఏడాదికి 1.3 లక్షల టన్నుల సరుకు రవాణా చేసిన ఈ ఓడరేవు ప్రస్తుతం 24 బెర్త్‌లతో 65 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రస్తుతం 974 కిలోమీటర్లు సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు పరిధిలో 13 నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. దీంతో పాటు ఏపీలో విశాఖపట్నం పోర్టు ఏకైక మేజర్ పోర్టుగా నిలిచింది. రక్షణ రంగంలో బలమైన శక్తిగా: రక్షణ పరంగా తూర్పు నావికదళం విశాఖ కేంద్రంగా బలమైన శక్తిగా ఎదుగుతోంది. 1968లో ఆవిర్భవించిన తూర్పు నావికాదళం క్రమంగా తూర్పు సముద్ర జలాల్లో అగ్రగామిగా నిలిచింది. దేశంలో తొలిగా నిర్మించిన అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ విశాఖలో తయారు చేయడం విశాఖకు తీరానికి గర్వకారణంగా నిలుస్తోంది. 1992 నుంచి జరుగుతున్న మలబార్ విన్యాసాలకు తూర్పు తీరం అనేక సార్లు అతిథ్యమిచ్చింది. తూర్పునావికాదళం విశిష్టతను పెంచేలా ప్రెసిడెంట్ ప్లీట్ రివ్యూలకు విశాఖను వేదికగా నిలిచింది. తూర్పున ఏపీకి అగ్రస్థానం.. భారత పోర్ట్స్, షిప్పింగ్స్, వాటర్‌వేవ్స్ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో 2021–22 ఏడాదికి గాను ఓవర్సీస్ కార్గో ట్రాఫిక్‌లో ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు 2వ స్థానంలో నిలిచింది. 70.7శాతం వాటాతో 324.43 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో ఉండగా 14.8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో 7.7 శాతం వాటాతో ఒడిశా, 4.2 శాతం వాటాతో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కోస్టల్ కార్గో ట్రాఫిక్‌లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. 51.7 శాతం వాటాతో 41.27 మిలియన్ టన్నుల లావాదేవీలతో గుజరాత్ తొలిస్థానంలో నిలవగా 28.3 శాతం వాటాతో మహారాష్ట్ర 2వ స్థానంలోను 14.4 శాతం వాటాతో ఏపీ మారిటైమ్ బోర్డు మూడో స్థానంలో నిలిచాయి. తూర్పున బే ఆఫ్ బెంగాల్లో కార్గో వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం లభించింది. -
వేగంగా 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా రూ.3,622.86 కోట్ల వ్యయంతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. ఇందులో తొలిదశలో రూ.1,204.56 కోట్లతో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడల్లో ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ వీటిని నిర్మిస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయినట్లు ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నాలుగు ఫిషింగ్ హార్బర్లలో డ్రెడ్జింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. దీంతో కీలకమైన ఫిల్లర్లు, జెట్టీల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. అదనంగా మూడులక్షల టన్నుల మత్స్యసంపద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హార్బర్లు అండుబాటులోకి వస్తే రాష్ట్రంలో 60 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే 10 వేల మెకనైజ్డ్ బోట్లు నిలుపుకొనే సామర్థ్యం లభిస్తుంది. రెండోదశలో శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లాలో పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, ఓడరేవుల్లో హార్బర్ల నిర్మాణాలకు రూ.1,496.85 కోట్ల విలువైన పనులకు ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. -
సముద్రతీర అధ్యయనాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండాలి
సబ్బవరం(పెందుర్తి): సముద్రతీర అధ్యయనాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలవాలని కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి శర్భానంద్ సోనోవాల్ ఆకాంక్షించారు. మండలంలోని వంగలిలో గల ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాన్ని గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. సుమారు 110 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయం చెన్నై నుంచి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి మూడు వైపుల సముద్రం ఉండడంతో సముద్రతీర అధ్యయనాలకు ఓడరేవుల అభివృద్ధికి, నౌకా నిర్మాణాలకు, డిజైన్లకు ఎంతో భవిష్యత్ ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని దేశం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించాలని తెలియజేశారు. చెన్నై నుంచి ఐఎంయూ ఉపకులపతి మాలిని పి.శంకర్, ఎంపీ రవీంద్రనాథ్, ఎమ్మెల్యే రమేష్ అరవింద్ పాల్గొనగా.. విశాఖ కలెక్టరేట్లోని నిక్ నుంచి వర్సిటీ డైరెక్టర్ కేశవదేవ్, వీవీ శివకుమార్, ఆకెళ్ల వెంకటరమణ మూర్తి, డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ షైజీ, డాక్టర్ పట్నాయక్, డాక్టర్ వి.రవిచంద్రన్, సీతాకుమారి, డాక్టర్ శిరీషా, ఈపీఎస్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
‘ప్రకాశం’లో ఫ్లోటింగ్ ఫిషింగ్ హార్బర్
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా ఓడరేవు వద్ద నీటిపై తేలియాడే జెట్టీ (ఫ్లోటింగ్ జెట్టీ) విధానంలో హార్బర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఓడరేవు వద్ద ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ వ్యయానికి ప్రతిపాదనలను తక్షణం పంపించాల్సిందిగా ఏపీ మారిటైమ్ బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఓడ రేపు వద్ద ఫ్లోటింగ్ జెట్టీ ఏర్పాటు ఈ 8 హార్బర్లకు అదనం. దీంతో రాష్ట్రంలో మొత్తం తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రతిపాదిత 8 హార్బర్లలో ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్లతో జువ్వలదిన్నె (శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా) ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం, విశాఖ జిల్లా పూడిమడక, ప్రకాశం జిల్లా కొత్తపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా బియ్యపుతిప్పలో రూ.1,580.22 కోట్లతో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తాజాగా పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో న్యాయపరిశీలనకు టెండర్లు తొలి దశలో మాదిరే నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి టెండర్లు పిలవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుడగట్లపాలెం లో రూ.365.81 కోట్లతో, పూడిమడక రూ.392. 53 కోట్లు, కొత్తపట్నంలో రూ.392.45 కోట్లు, బియ్యపుతిప్ప రూ. 429.43 కోట్లతో హార్బర్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసిం ది. ఇందులో బియ్యపుతిప్ప హార్బర్ మినహా మిగిలిన మూడింటి ప్రాజెక్టు ప్రణాళికలను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీస్ (సీఐసీఈఎఫ్) ఆమోదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఒకొక్క హార్బర్ నిర్మా ణానికి రూ.150 కోట్లు గ్రాంటు రూపంలో ఇవ్వ నుంది. మిగిలిన మొత్తంలో 90 శాతం ఎన్ఐడీఐ రుణంగా అందిస్తుంది. బియ్యపుతిప్ప హార్బర్ ప్రాజెక్టు ప్రణాళికకు సీఐసీఈఎఫ్ ఆమోదం తీసుకుని న్యాయ పరిశీలన అనంతరం టెండర్లు పిలవాల్సిందిగా ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ హర్బర్ల నిర్మాణంతో30,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అలాగే 8.4 లక్షల మంది మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందుతాయి. -
రూ.3,650 కోట్లతో బందరు పోర్టు నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం బందరు (మచిలీపట్నం) పోర్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. బందరు పోర్టు తొలిదశలో రూ.5,835 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీన్లో రూ.1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది ఏపీ మారిటైమ్ బోర్డు రుణ రూపంలో సమకూరుస్తుంది. వాణిజ్యపరంగా పోర్టు పూర్తయితే చుట్టుపక్కల పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడంతో పాటు 80 వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బందరు పోర్టును సొంతంగా అభివృద్ధి చేసి లీజుకు (ల్యాండ్ లార్డ్) ఇచ్చే విధానం అమలు చేస్తోంది. దీన్లో భాగంగా ఇప్పుడు రూ.3,650.07 కోట్లతో పనులు చేపట్టడానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలుస్తోంది. ఈపీసీ విధానంలో పనులు చేపట్టడానికి టెండర్లను న్యాయ పరిశీలనకోసం బుధవారం జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపింది. ఈ టెండర్లపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఏడు రోజుల్లోగా తెలపాలని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్ ఒక ప్రకటనలో కోరారు. తొలిదశలో ఇలా... తొలిదశలో వివిధ రకాల సరుకు రవాణాకు వినియోగించే విధంగా మొత్తం నాలుగు బెర్తులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఒకటి మల్టీ పర్పస్ బెర్త్‌కాగా, రెండు జనరల్ కార్గో బెర్తులు, ఒకటి బోగ్గు కోసం కేటాయిస్తారు. అలాగే 2.99 కిలోమీటర్ల బ్రేక్ వాటర్, 43.82 మిలియన్ మీటర్ల డ్రెడ్జింగ్‌తో పాటు, అంతర్గత, బహిర్గత మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ఈ పనులకు రూ.3,650.07 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ పనుల వ్యయాన్ని 2020–21 ఎస్‌వోఆర్ ప్రకారం లెక్కించారు. తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తిచేయాలని నిర్దేశించారు. ఈ టెండర్లను ఏపీ పోర్టు డాట్ జీవోవీ డాట్ ఇన్ లేదా జ్యుడిషియల్ ప్రివ్యూ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ల ద్వారా పరిశీలించవచ్చు. -
సూయజ్‌కు ఎందుకంత ప్రాధాన్యం, మీకీ విషయాలు తెలుసా?
సూయజ్ కెనాల్లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా? 1967 జూన్‌లో 14 కార్గో నౌకలు సూయజ్ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరిగింది కొన్ని రోజులే.. కానీ కాల్వ మూసేయడంతో నౌకలు మాత్రం ఎనిమిదేళ్లు అక్కడే చిక్కుకుపోయాయి. ఇంతకీ జగడమెందుకు? సూయజ్ కెనాల్.. కేవలం సరుకు రవాణాకే కాదు.. సుమారు శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికీ కేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్ వంటి యూరప్ దేశాలు వ్యాపారం పేరిట ఆసియా దేశాలను ఆక్రమించినప్పటి సమయం అది. ఆ దేశాల వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాసియా దేశాలకు చేరాల్సి వచ్చేది. ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టేది. ఖర్చు ఎక్కువగా అయ్యేది. ఆ క్రమంలోనే మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రానికి మార్గం కలిపేందుకు.. 1859లో ఈజిప్ట్ మీదుగా 193 కిలోమీటర్ల పొడవునా భారీ కాల్వ తవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఫ్రాన్స్ ఎక్కువగా ఖర్చుపెట్టింది, బ్రిటన్ కూడా జత కలిసింది. 1869 నుంచి నౌకలు వెళ్లడం మొదలైంది. అప్పటి నుంచీ సూయజ్ కాల్వ మీద ఫ్రాన్స్, బ్రిటన్ల పెత్తనం కొనసాగింది. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాల్వను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ టైంలోనే ఈజిప్ట్‌పై ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాలు వంటివి జరిగాయి. (చదవండి: సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) కాల్వలో పడవలు ముంచి.. యుద్ధం తర్వాతి ఉద్రిక్తతలు ఎఫెక్ట్ సూయజ్ కెనాల్‌పై పడింది. కాల్వను మూసేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. కొన్ని పడవలను ముంచేసి, మట్టి, ఇసుక వంటివి వేసి అక్కడక్కడా కాల్వలో అడ్డంకులు కల్పించారు. దాంతో అప్పటికే ప్రయాణిస్తున్న నౌకలన్నీ కాల్వ మధ్యలో చిక్కుకుపోయాయి. గాలుల వల్ల పక్కనే ఉన్న ఎడారి నుంచి వచ్చిన ఇసుక, దుమ్ముతో నౌకలు నిండిపోయాయి. దీనినే ‘ది యెల్లో ఫ్లీట్ (పసుపు దళం)’గా పిలుస్తారు. మళ్లీ యుద్ధంతోనే తెరుచుకుని.. యుద్ధంతో మూతపడిన సూయజ్ కాల్వ తిరిగి తెరుచుకోవడానికి కూడా మరో యుద్ధమే కారణమైంది. 1973లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం జరిగి.. రెండు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఆ దెబ్బతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితే 1975లో కెనాల్‌ను తిరిగి ఓపెన్ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఏడు వేల కిలోమీటర్లు తిరిగిపోవాలి ప్రపంచంలో 70 శాతానికిపైగా జనాభా ఉన్న యూరప్, ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి సూయజ్ కాల్వ ఎంతో కీలకం. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం వరకు ఈ కాల్వ మీదుగానే జరుగుతుంది. ఈ కాల్వ లేకుంటే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు.. మొత్తంగా ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ రూట్ అంటారు. మన ముంబై నుంచి లండన్‌కు సూయజ్ కాల్వ మీదుగా వెళితే 11,600 కిలోమీటర్ల దూరం వస్తుంది. వాతావరణం, ఇతర అంశాల పరంగా ఇది భద్రమైన మార్గం. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళితే ఏకంగా 19,800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ మార్గంలో తుపానులు, ఇతర సమస్యలు ఎన్నో ఉంటాయి. నౌకలకు ప్రమాదకరం కూడా. అందుకే సూయజ్ కాల్వకు ఇంత ప్రాధాన్యత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మన పోర్టులపై సూయజ్ ప్రభావం అంతంతే
సాక్షి, అమరావతి: సూయజ్ కాలువలో తలెత్తిన సమస్య ప్రభావం రాష్ట్ర పోర్టులపై పెద్దగా లేదని.. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుంచి నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రకటించింది. విశాఖ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టులపై సూయజ్ ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ నుంచి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా వంటి దేశాలకు నౌకా వాణిజ్యం ఎక్కువని, యూరప్ దేశాలతో లావాదేవీలు తక్కువగా ఉండటంతో ‘సూయజ్’ సమస్య అంతగా ప్రభావం చూపదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మధ్యధరా, హిందూ మహా సముద్రాలను కలుపుతూ ఈజిప్టు వద్ద నిర్మించిన సూయజ్ కాలువలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కార్గో నౌక ‘ఎవర్ గివెన్’ పెనుగాలులకు అడ్డం తిరిగి నిలిచిపోవడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ కాలువ ద్వారా ఆసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు నిత్యం 35కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. ఎవర్ గివెన్ నౌక అడ్డంగా నిలిచిపోవడంతో ఇప్పటివరకు 300 నౌకలు వరకు నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత సముద్ర వాణిజ్యంపై తీవ్రంగానే ఉంది. సూయజ్ కాలువ ద్వారా మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రూ.14,80,000 కోట్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నట్టు కేంద్ర నౌకాయాన శాఖ అంచనా వేసింది. తాజా సమస్య చమురు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యవసర సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీంతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇక్కడి పోర్టుల్లో పరిస్థితిని సమీక్షించింది. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 4 రాష్ట్ర పోర్టుల ద్వారా ఏటా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఒక్క విశాఖ పోర్టు ద్వారానే 100 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతుండగా, గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం ద్వారా 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా అవుతోంది. వీటిలో బియ్యం, జొన్నలతోపాటు గ్రానైట్, బొగ్గు, ముడి ఇనుము, బెరైటిస్ వంటి ఖనిజాలే ఎక్కువ. ఈ పోర్టుల నుంచి యూరప్‌కు వెళ్లే నౌకలు లేకపోవడంతో సూయజ్ ప్రభావం ఏపీ మారిటైమ్‌పై పెద్దగా ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు. -
హరిత క్షేత్ర ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నాం: సీఎం జగన్
విశాఖపట్నం: దేశీయ దిగుమతుల్లో 2030 నాటికి కనీసం 10 శాతం దిగుబడులు రాష్ట్రం నుంచి జరగాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మారిటైమ్ ఇండియా-2021 సదస్సులో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం విశాఖలో మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ''మారిటైమ్ రంగంలో భారత్ విశిష్ట గుర్తింపు సాధిస్తుంది. మారిటైమ్ ఇండియా సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుంది. గతేడాది నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. నౌకాశ్రయాలపై ఆధారపడి ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయి. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం.. భావనపాడు వద్ద హరిత క్షేత్ర ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్స్ ద్వారా పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుంది. నౌకాశ్రయాలు, ఓడరేవులు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఆక్వా వర్శిటీ ఏర్పాటుతోపాటు, 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం 100 శాతం ఎఫ్‌డీఐలు, మేక్ ఇన్ ఇండియా, సాగర్మాల, భారత్‌మాల వంటి సంస్కరణల ప్రక్రియలు విశేష పురోగతికి దోహదం చేశాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఒక నిదర్శనంలా మారిటైమ్ ఇండియా విజన్-2030 డాక్యుమెంట్ నిలుస్తుంది. సముద్ర యానం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న స్ఫూర్తిదాయక ఎజెండా ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ. తీరప్రాంతం ఉంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..సులభతర వాణిజ్యంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. నౌకాశ్రయాల్లో మౌలిక వసతుల కల్పన, వాటిపై ఆధారపడిన పరిశ్రమలకు..నిరంతర ప్రోత్సాహం ద్వారానే ఇది సాధ్యమైంది.విశాఖలో అతిపెద్ద నౌకాశ్రయంతోపాటు 5 చోట్ల నౌకాశ్రయాలు.. మరో 10 గుర్తించిన ఓడరేవులు ఉన్నాయి. 170 టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోంది.కార్గో రవాణాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. '' అని తెలిపారు. -
అటు ఆదాయం.. ఇటు ఉపాధి
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధితో పాటు ఆదాయాన్ని అందించే షిప్ రీ సైక్లింగ్ వ్యాపారంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన బోర్డు.. తాజాగా పాడైపోయిన ఓడలను ఒడ్డుకు చేర్చి విడదీసే రీ సైక్లింగ్ వ్యాపారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద షిప్ రీ సైక్లింగ్ వ్యాపారాన్ని పెద్దయెత్తున ప్రోత్సహిస్తుండటమే కాకుండా, ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019ని కూడా తీసుకురావడంతో ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకేసారి 50 ఓడల రీ సైక్లింగ్ గుజరాత్లో (అలాంగ్‌లో) ఏటా 300 ఓడలు రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆ రాష్ట్రం భారీగా ఆదాయం పొందుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓడల రీ సైక్లింగ్ చేపట్టాలని మారిటైమ్ బోర్డు భావిస్తోంది. ఇందుకోసం అలల ఉధృతి ఎక్కువగా ఉండి, మత్స్యకారుల చేపల వేటకు ఎక్కువ ఉపయోగపడని తీర ప్రాంతాలను పరిశీలించి.. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఇందుకు అనువైనవిగా గుర్తించింది. వీటిలో ఒక ప్రాంతాన్ని ఖరారు చేసి ఒకేసారి 50 ఓడలను రీ సైక్లింగ్ చేయడానికి తగిన విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించనుంది. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానీ లేని విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మందికి ఉపాధి యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతంలో ఉపాధి కోల్పోయేవారికి ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019 ద్వారా తగిన రక్షణ కల్పించనున్నారు. ఒక ఓడను విడగొట్టాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. దీనికి ఐదు రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. యూనిట్లో ఒకసారి 50 ఓడల రీ సైక్లింగ్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఏటా 150 ఓడలను రీ సైక్లింగ్ చేయాలని మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. బయటకు తీసిన ఇనుమును తరలించడానికి, ఇనుమును కరిగించడానికి రీ రోలింగ్ మిల్స్ వంటి అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఒక నౌకను విడదీయడానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరమవుతుందని, ఆ విధంగా 50 నౌకలకు కలిపి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. గతంలో 5 ఓడల రీ సైక్లింగ్ 1995–96 ప్రాంతంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరం వద్ద 5 నౌకలను రీ సైక్లింగ్ చేశారు. దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనే చెరో రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటుకు అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. ► ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాణిజ్య నౌకల సంఖ్య 53,000 ► ఇందులో ఏటా 1,000 నౌకలు రీ సైక్లింగ్‌కు వెళ్తున్నాయి ► అంతర్జాతీయ రీ సైక్లింగ్ వ్యాపారంలో మన దేశం వాటా 30 శాతం ► 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యం 40 శాతం పెంచడం ద్వారా 60 శాతం మార్కెట్ వాటాను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ► ఇందులో 50 శాతం వ్యాపారం చేజిక్కించుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక 50% మార్కెట్ వాటా లక్ష్యం కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమే కాకుండా సముద్ర ఆధారిత వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ప్రస్తుతం షిప్ రీ సైక్లింగ్‌లో రెండవ స్థానంలో ఉన్న మన దేశాన్ని 2030 నాటికి మొదటి స్థానానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో జరిగే షిప్ రీ సైక్లింగ్‌లో 50 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. –ఎన్.రామకృష్ణారెడ్డి, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
నైజీరియా తీరంలో భారతీయుల కిడ్నాప్
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు. -
ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటుకు సీఎం జగన్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఏపీ మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్ పోర్టుతోపాటు 14 నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. మరిని పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తీరప్రాంత కారిడార్‌లో పరిశ్రమలను పెంచి పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల రంగంలో రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగానే ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డు ద్వారా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి జరుగుతుందన్నారు. -
విశాఖలో అంతర్జాతీయ సాగర ఉత్పత్తుల ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం :విశాఖ నగరం మరో అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికవుతోంది. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ (ఎంపెడా) భారత సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్‌తో కలిసి వచ్చే నెల 23 నుంచి 25 వరకు అంతర్జాతీయ సీఫుడ్ షోను నిర్వహించనుంది. నగరంలోని పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియంలో ఈ ప్రదర్శన జరగనుంది. విశాఖలో 2001లో తొలిసారి సీఫుడ్ షో జరిగిందని, 15 ఏళ్ల తర్వాత మళ్లీ వచ్చే నెలలో నిర్వహిస్తున్నామని ఎంపెడా చైర్మన్ ఎ.జయాతిలక్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సీఫుడ్ షో అని చెప్పారు. సుమారు 65 విదేశీ సంస్థల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రదర్శనలో సీఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాల తయారీదారులు, సర్టిఫికేషన్లు, ప్రాసెసింగ్ ఇంగ్రీడియెంట్లు, కోల్డుచైన్ సిస్టంలు, లాజిస్టిక్స్, సీఫుడ్ పరిశ్రమ భాగస్వాముల యంత్ర, వస్తు సామగ్రి ప్రదర్శిస్తారని తెలిపారు. భారత మత్స్య పరిశ్రమ ఉత్పత్తి, శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ఈ షో లక్ష్యమన్నారు. దేశంలో పాటించే భద్రతతో కూడిన సుస్థిర ఆక్వా కల్చర్, సముద్ర మత్స్యపరిశ్రమలో సాంకేతికాభివద్ధి, సుస్థిర వేట, మత్స్యకారులు, ఆక్వా రైతులు, సీఫుడ్ ఎగుమతిదార్లు పాటించే విధానాలను తెలియజేస్తారని చెప్పారు. ఎగుమతుల విలువ రెట్టింపు! ప్రస్తుత ఎగుమతుల ఫలితాలను బట్టి భారత విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెండింతలు పెరిగే అవకాశం ఉందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.30,420.83 కోట్ల (4.7 బిలియన్ డాలర్ల) విలువైన 9,45,892 టన్నుల మత్స్య ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతి చేశామన్నారు. 2020 నాటికి భారత సముద్ర, ఆక్వా కల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల టర్నోవర్ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎల్–వెనామీ రొయ్య కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. భారత సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏఐ) జాతీయ అధ్యక్షుడు వి.పద్మనాభం మాట్లాడుతూ సెప్టెంబర్‌లో జరిగే సీఫుడ్ షోకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించామన్నారు. సమావేశంలో ఎంపెడా కార్యదర్శి బి.శ్రీకుమార్, ఎస్ఈఏఐ సెక్రటరీ జనరల్ ఇలియాస్ సేట్, ట్రెజరర్ కె.జి.లారెన్స్ పాల్గొన్నారు.