న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్‌మార్‌శాట్‌కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్‌ఎన్‌ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్‌మార్‌శాట్ ఈ విషయాలు వెల్లడించింది.
వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్‌మార్‌శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment