internet services
-
పాక్ సర్కారుకు ‘ఇమ్రాన్’ భయం..మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు రద్దు
ఇస్లామాబాద్:పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో ఆదివారం(నవంబర్24) మొబైల్‌ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అభిమానులు ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేసింది. కాగా,పాకిస్తాన్లో ఎక్స్‌ను ఇప్పటికే నిషేధించడం గమనార్హం. ఏయే ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేయనున్నారు, వాటిని తిరిగి ఎప్పుడు పునరుద్ధిరిస్తారన్నదానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కాగా,మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలు పాలై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయినా ఇప్పటికీ ఇమ్రాన్ క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు.ఇమ్రాన్ పార్టీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్(పీటీఐ)కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రభుత్వంపై పోరాడేందుకు ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతుంటారు.తాజాగా ఇమ్రాన్ విడుదలను డిమాండ్ చేస్తూ పీటీఈ కార్యకర్తలు ర్యాలీకి పిలుపునివ్వడంతో ప్రభుత్వం సోషల్‌మీడియాను నిషేధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ బ్యాక్ఎండ్ను బ్లాక్‌చేసినట్లు సమాచారం.వాట్సాప్ ద్వారానే నిరసన ర్యాలీల సమాచారాన్ని పీటీఐ శ్రేణులు చేరవేస్తుండడం ఇందుకు కారణం. మరోవైపు పీటీఐకి గట్టి పట్టున్న ప్రావిన్సులైన పంజాబ్, ఖైబర్ ప్రావిన్సుల నుంచి రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రోడ్లన్నింటిపై అడ్డుగా కంటెయినర్లు పెట్టి బ్లాక్ చేశారు. నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చెమటోడ్చాల్సి వస్తోంది. -
ఎస్ఏఆర్ టెలీవెంచర్ చేతికి తికోణ ఇన్ఫినెట్
ముంబై: ఇంటర్నెట్ సేవలు అందించే తికోణ ఇన్ఫినెట్ను కొనుగోలు చేయనున్నట్లు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎస్ఏఆర్ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ రూ. 669 కోట్లు. నగదు, స్టాక్స్ రూపంలో ఈ డీల్ ఉంటుంది. ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తికోణలో ఎస్ఏఆర్ 91 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. 2008లో ఏర్పాటైన తికోణ 300 పైచిలుకు నగరాల్లో రెసిడెన్షియల్, కమర్షి యల్ కస్టమర్లకు హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సరీ్వసులు అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మొదలైనవి కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. తికోణ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 193 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎన్ఎస్ఈకి చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫాంలో లిస్టయిన ఎస్ఏఆర్ సంస్థ.. ఈ డీల్‌తో సమగ్ర టెలికం సేవల కంపెనీగా ఎదగనుంది. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తాజాగా జియో ఎయిర్‌ఫైబర్ సర్విసులను ఆవిష్కరించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు మంగళవారం ప్రకటించింది. వైర్లెస్ విధానంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్విసులను పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్ ధరలు స్పీడ్‌ను బట్టి రూ. 599 నుంచి ప్రారంభమవుతాయి. వినాయక చవితి కల్లా వీటి సేవలను ప్రవేశపెడతామని రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జియో ఇప్పటికే ఫైబర్ పేరిట బ్రాడ్‌బ్యాండ్ సర్విసులను అందిస్తోంది. ఇది ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ వైర్‌లైన్ మాధ్యమం ద్వారా ఇంటర్నెట్ను అందిస్తుండగా.. ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ తరహాలో నెట్‌ను పొందడానికి ఉపయోగపడుతుంది. ‘మా ఫైబర్–టు–ది–హోమ్–సర్వీస్ జియోఫైబర్ ఇప్పటికే 1 కోటి మిందికి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ప్రతి నెల వేల కనెక్షన్లు కొత్తగా జతవుతున్నాయి. ఇంకా అసంఖ్యాక గృహాలు, చిన్న వ్యాపారాలకు వేగవంతమైన ఇంటర్నెట్ను అందించాల్సి ఉంది. జియో ఎయిర్‌ఫైబర్ ఇందుకు తోడ్పడనుంది. విద్య, ఆరోగ్యం, స్మార్ట్‌హోమ్ వంటి సొల్యూషన్స్‌తో ఇది కోట్ల గృహాలకు ప్రపంచ స్థాయి డిజిటల్ వినోదం, స్మార్ట్‌హోమ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించగలదు‘ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. జియోకు 15 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఉంది. అయినప్పటికీ చాలా చోట్ల వైర్‌లైన్ వేయడంలో ప్రతిబంధకాల కారణంగా పూర్తి స్థాయిలో విస్తరించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జియోఎయిర్‌ఫైబర్ ఆ సవాళ్లను అధిగమించి, యూజర్లకు ఇంటర్నెట్ను చేరువ చేయడానికి ఉపయోగపడనుంది. జియోఫైబర్ ప్లాన్లు, ఎటువంటి మార్పు లేకుండా స్పీడ్‌ను బట్టి రూ. 399 నుంచి రూ. 3,999 వరకు రేటుతో యథాప్రకారం కొనసాగుతాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. ప్రత్యేకతలివీ.. ♦ ఎయిర్‌ఫైబర్ కేటగిరీలో అపరిమిత డేటాతో, స్పీడ్ 30 నుంచి 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. నెలవారీ ప్లాన్ల ధరలు రూ. 599 నుంచి రూ. 1,199 వరకు ఉంటాయి. ప్లాన్‌ను బట్టి 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లు, 14 పైచిలుకు యాప్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. ♦ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ కేటగిరీలో డేటా స్పీడ్ 300 నుంచి 1000 ఎంబీపీఎస్ వరకు (అపరిమితం) ఉంటుంది. ధర రూ. 1,499 నుంచి రూ. 3,999 వరకు ఉంటుంది. 550 పైగా డిజిటల్ టీవీ చానళ్లతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర 14 పైగా ఓటీటీ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ♦ అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఫై రూటర్, 4కే స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్, వాయిస్ యాక్టివ్ రిమోట్ లభిస్తాయి. -
డేటా సెంటర్ల కేంద్రం.. విశాఖ!
కె.జి.రాఘవేంద్రారెడ్డి– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దైనందిన జీవితంలో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ప్రతీ రోజూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిలియన్ టెరాబైట్స్ డేటాను సృష్టిస్తున్నాం. దీనిని భద్రపరచడానికి ఉపయోగపడే ప్రత్యేకమైన కేంద్రాలే డేటా సెంటర్లు. ఇంటర్నెట్ ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అటువంటి డేటా సెంటర్లకు ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ) ప్రకటించింది. ఇక ఏకంగా రూ. 21,844 కోట్ల పెట్టుబడితో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుతో రాష్ట్ర ఇంటర్నెట్ అవసరాలకు విశాఖ కేంద్రంగా మారనుంది. తద్వారా ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ కేంద్రాల కోసం ముంబై, చెన్నై, హైదరాబాద్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండానే విశాఖ డేటా కేంద్రాలు స్థానిక అవసరాలను తీర్చనున్నాయి. సింగపూర్ నుంచి ఓఎఫ్సీ డేటా సెంటర్లలో ఇంటర్నెట్ డేటాను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్సీ)ద్వారా సమాచారాన్ని సేకరించడం జరుగుతోంది. ఇందుకోసం కేవలం భూమి మీదనే కాకుండా.. సముద్రగర్భం నుంచి వేస్తున్న ఓఎఫ్సీనే కీలకం. ఒక అంచనా ప్రకారం సముద్రాల్లో ఏర్పాటు చేసిన 9 లక్షల మైళ్ల ఓఎఫ్సీ ద్వారా 95 శాతం డేటా నిత్యం ప్రసారమవుతోంది. విశాఖలో ఏర్పాటుకానున్న అదానీ డేటా సెంటర్‌కు కూడా సింగపూర్ నుంచి సముద్రగర్భం ద్వారా వేస్తున్న ఓఎఫ్సీ ద్వారానే డేటా ప్రసారం కానుంది. 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అదానీ డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్స్‌కు కూడా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇంటర్నెట్ సేవల్లో వేగం పెంచడం, స్థానిక అవసరాలను తీర్చడం కోసం ఇప్పటికే డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తున్నట్టు నిక్సీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. అమెరికా వర్సెస్ చైనా...! ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల ఏర్పాటు విషయంలో చైనా ముందంజలో ఉంది. అయితే, సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్సీ విషయంలో మాత్రం అమెరికా సంస్థల పెత్తనం ఉంటోంది. తాజాగా ఆసియా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలను కలుపుతూ సింగపూర్ టు ఫ్రాన్స్ వరకూ ఏర్పాటవుతున్న ఓఎఫ్సీ పనులను కూడా అమెరికాకు చెందిన సబ్కామ్ కన్సార్టియం దక్కించుకుంది. ఈ సముద్రగర్భంలో ఏర్పాటు చేస్తున్న ఓఎఫ్సీలోనూ పైచేయి సాధించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. తాజాగా చైనా చేసిన ప్రయత్నాలు అమెరికా ఎత్తులతో చిత్తయ్యాయి. ఇక రానున్న రోజుల్లో ఈ సముద్రగర్భ ఓఎఫ్సీ మార్కెట్లో భారత్ సంస్థలూ పోటీ పడనున్నాయి. ఈ మార్కెట్లోకి రిలయన్స్, అదానీ వంటి సంస్థలు అడుగుపెట్టాయి. అందులో భాగంగా సింగపూర్ నుంచి విశాఖకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అదానీ సంస్థనే వేసుకోనుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లు... ప్రపంచవ్యాప్తంగా టాప్–10 డేటా సెంటర్లలో ప్రధానంగా చైనా, అమెరికా, బ్రిటన్ సంస్థలే ఉన్నాయి. అయితే, 0.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బెంగళూరులో ఉన్న తులిప్ డేటా సెంటర్ 13వ స్థానంలో ఉంది. టాప్–10 డేటా కేంద్రాలివే... ఇకపై స్థానికంగానే.! ఇంటర్నెట్ ఎక్స్చేంజ్లు స్థానికంగా లేని కారణంగా పలు సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది. నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కేంద్రం, వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు.. బల్క్‌గా డేటాను వినియోగిస్తున్నాయి. అలాగే విశాఖలో.. ఎ–కేటగిరీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు 20, బీ, సీ కేటగిరీ ఐఎస్పీలు 60 నుంచి 80 వరకూ ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పెద్ద మొత్తంలో డేటా కొనుగోలు చేస్తున్నాయి. 150 వరకూ ఐటీ కంపెనీలు, 13 వేల ఎంఎస్ఎం యూనిట్లకూ డేటా అవసరం ఉంటోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో వీటికి ఇకపై అంతరాయం లేకుండా ఇంటర్నెట్, తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన సేవలు అందనున్నాయి. -
మారుమూలకూ.. డిజిటల్ విప్లవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగేళ్లుగా గిరిజన సంక్షేమాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకెన్నడూ లేని విధంగా విశేషంగా కృషి చేస్తోంది. గిరిజనుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేకంగా దృష్టి సారించింది. కనీస మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, రహదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వీటన్నింటికీ తోడు మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. తద్వారా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను లబ్ధిదారుల ముంగిటకు మరింత త్వరితగతిన తీసుకెళ్లడానికి నాంది పలికింది. సమగ్ర గిరిజనాభివృద్ధే లక్ష్యంగా నాలుగేళ్లుగా చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయా ప్రాంతాల్లో డిజిటల్ సేవలు విస్తరింప చేయాలన్న తాపత్రయంతో ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెల్ ఫోన్ సేవలు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌లో మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయని భావించారు. ప్రధానంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని విశ్వసించారు. ఇందులో భాగంగా మారుమూల ప్రాంతాల్లో సెల్ టవర్ల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేశారు. ఇందుకు గిరిజన, అటవీ ప్రాంతాల్లో ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో స్వయంగా మాట్లాడారు. మార్గదర్శకాలను సులభతరం చేసుకుని.. సెల్టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని రాష్ట్రంలో వేగవంతం చేశారు. అవరసమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయించారు. మొత్తంగా రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని 5,459 ఆవాసాలకు సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) ద్వారా సెల్ టవర్ల ఏర్పాటు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మొత్తం ప్రాజెక్టు కింద కొత్తగా 2,849 ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు గాను ఇప్పటికే 2,463 చోట్ల స్థలాలు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలందించేందుకు ఒకేసారి 100 జియో టవర్స్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ నాటికి రాష్ట్రంలో సెల్ సర్వీసులు లేని ఆవాసాలన్నింటికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ రానుందని తెలిపారు. తద్వారా ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింతగా కనెక్టివిటీ లభించడంతో పాటు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలు అందుతాయన్నారు. సెల్ టవర్స్ ఏర్పాటు ద్వారా రేషన్ పంపిణీ, ఇ–క్రాప్ బుకింగ్ సులభమవుతుందని.. ఆయా ప్రాంతాలకు ఆర్థికంగా కూడా మరింత లబ్ధి కలగనుందని చెప్పారు. సంక్షేమాభివృద్ధి పథకాలను అత్యంత పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్కచెల్లెమ్మలకు మరింత సమర్థవంతంగా అందించగలుగుతామన్నారు. ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సెల్ టవర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగానికి, జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్కు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రారంభమైన సెల్ టవర్ల ద్వారా 209 గ్రామాలకు 4జీ సేవలు అందనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో వీటిని 5జీ సేవలుగా అప్‌గ్రేడ్ చేయనుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సెల్ టవర్ల పరిధిలో 150 ఎంబీపీఎస్ డౌన్లోడ్, 50 ఎంబీపీఎస్ అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. గిరిజన సంక్షేమాభివృద్ధికి పెద్దపీట ► గిరిజనుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 2022 డిసెంబర్ నాటికి రూ.17,651 కోట్లు ఖర్చు చేసింది. గిరిజనులు ధైర్యంగా పంటలు పండించుకునేందుకు వీలుగా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 4.88 లక్షల ఎకరాలకు 2.49 లక్షల అటవీ హక్కు పత్రాలు, డికేటీ పట్టాలు అర్హులైన గిరిజనులకు పంపిణీ చేశారు. ► నాడు–నేడులో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల రూపురేఖలు మార్చింది. గిరిజనుల కోసం ప్రత్యేకించి పాడేరు, పార్వతీపురంలో మెడికల్ కళాశాలలు, కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాల, సీతంపేట, పార్వతిపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. విజయనగరం వద్ద గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా విద్యకు కేటాయించిన బడ్జెట్లో గిరిజనుల విద్య కోసం 37.66 శాతం కేటాయిస్తూ వస్తోంది. ► ఈ ఒక్క ఏడాదే రూ.4,123.39 కోట్ల బడ్జెట్ కేటాయించింది. గిరిజన ఉప ప్రణాళిక కోసం రూ.6,929.09 కోట్లు కేటాయించింది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం రాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం నిర్మిస్తోంది. మారుమూల గ్రామాలకు వందల కిలోమీటర్ల మేర రహదారి సౌకర్యం కల్పించింది. గిరిజనులతో ముచ్చటించిన సీఎం అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సికలబాయి, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కుంటంబడేవలస గ్రామాల్లో టవర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయా గ్రామాల్లో వచ్చిన సెల్ టవర్ నెట్వర్క్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీ గొడ్డేటి మాధవి, అరుకు, పాడేరు, కురుపాం ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, కొట్టుగుళ్లు భాగ్యలక్ష్మి, పుష్ప శ్రీవాణి, కలెక్టర్లు సుమిత్ కుమార్, నిషాంత్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్, ప్రజలు.. సీఎంతో మాట్లాడారు. వారందరినీ సీఎం ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ సెక్రటరీ కోన శశిధర్, రిలయెన్స్ జియో ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ రోజు పెద్ద పండుగ మీ (సీఎం) చొరవ వల్ల గిరిజన ప్రాంతాలు సైతం అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వంద సెల్ టవర్లు ప్రారంభించడం మా మారుమూల ప్రాంతాల్లో పెద్ద పండుగగా భావిస్తున్నాం. ఈ టవర్ల వల్ల మాకు వేగవంతమైన సేవలు అందుతాయి. 104, 108, ఆర్బీకే వ్యవస్థల సేవలను చక్కగా వినియోగించుకోవడానికి దోహద పడుతుంది. గత టీడీపీ ప్రభుత్వం మా గిరిజన ప్రాంతాలను అంధకారంలోకి నెట్టివేసింది. ఇప్పుడు మీ వల్ల మా గిరిజనులు అభివృద్ధికి నోచుకుంటున్నారు. అందరికీ ఆధార్ కార్డులు కూడా ఇస్తుండడంతో ప్రభుత్వ సేవలు ప్రతి గడపకూ చేరుతున్నాయి. – చెట్టి ఫాల్గున, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అరకు మీ వల్లే గిరిజనుల్లో వెలుగు ఎక్కడో మారుమూల ఒడిశాకు అతి సమీపంలో ఉన్న గ్రామాలకు సైతం ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందడం చాలా సంతోషకరం. మా ఐటీడీఏ డివిజన్‌లోనే 86 టవర్లు ప్రారంభించడం ఒక చరిత్ర. మా ప్రాంత ప్రజలందరి తరఫునా మీకు పాదాభివందనం. గతంలో సిగ్నల్స్ లేక ఆఫ్‌లైన్‌లో పని చేయలేక.. ఆన్లైన్ ఉన్నచోట డేటా డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. గ్రామస్తుల సమస్యలు ఎవరికైనా అత్యవసరంగా చెప్పాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తప్పింది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు రోడ్లు.. సెల్ కనెక్టివిటీ కల్పించడం శుభ పరిణామం. గత పాలకులు మా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే.. మీరు (సీఎం) పారదర్శకంగా చక్కటి పాలన అందిస్తున్నారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపిన మీ మేలు ఎవరూ మరచిపోరు. – కె.భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పాడేరు గిరిజనుల పక్షపాత సీఎం అన్నా.. మీరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి ఆలోచనా, ప్రతి పథకం మా గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి దోహదపడ్డాయి. మీరు గిరిజన పక్షపాత ముఖ్యమంత్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మా గిరిజన ప్రాంతాల స్కూల్స్, ఆస్పత్రుల రూపురేఖలు మార్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మాకు అందించారు. నా కుటుంబ సభ్యులంటూ మమ్మల్ని అభివర్ణించిన నాయకుడు మీరే. మీరు మా గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. – పాముల పుష్ప శ్రీవాణి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, కురుపాం కష్టాలు తప్పించారు సెల్ టవర్ అందుబాటులోకి రావడం వల్ల భీమవరం సచివాలయ పరిధిలో 16 గ్రామాలకు నెట్వర్క్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వలంటీర్లు సకాలంలో పింఛన్లు పంపిణీ చేసేందుకు అవకాశం ఏర్పడింది. సెల్ నెట్వర్క్ లేకపోవడం వల్ల గతంలో వలంటీర్లు సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట వెళ్లి డేటా ఎంట్రీ చేసేవారు. ఆ తర్వాతే పింఛన్లు పంపిణీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు భీమవరం, అండిభ పంచాయతీల పరిధిలో నాలుగు టవర్లు నిర్మించడం ద్వారా ఆ ఇక్కట్లు తప్పాయి. తద్వారా పింఛను, వైఎస్సార్ బీమా, ఈ క్రాప్ బుకింగ్, ఈకేవైసీ, మ్యుటేషన్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. – శాంతికుమారి, హార్టికల్చర్ అసిస్టెంట్, భీమవరం, హుకుంపేట్ మండలం, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఇప్పుడు ఫోన్ చేస్తే 108 వస్తుంది అన్నా.. మేం నేరుగా మీతో మాట్లాడుతున్నామంటే సెల్ టవరే కారణ. మాకు గతంలో రోడ్లు, కరెంట్, సెల్ టవర్ సౌకర్యాలు లేవు. అవన్నీ మీరు ఇచ్చారు. చాలా సంతోషం. గతంలో గర్భవతులను ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కు. కానీ ఇప్పుడు మేము 108కు ఫోన్ చేస్తే మా ప్రాంతానికీ వెంటనే వస్తుంది. మాకు వైద్యం అందుతుంది. మేం మీకు రుణపడి ఉంటాం. – పాలక సంధ్య, పెదఖర్జ, గుమ్మలక్ష్మీపురం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా -
ఈ ఇంటర్నెట్ మాకొద్దు బాబోయ్..!
జకార్తా: స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు. ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్‌హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలున్నాయి. -
విశాఖ, విజయవాడలో ‘నిక్సీ’ కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశేష నగరంగా ప్రధాని ప్రశంసలందుకున్న విశాఖతో పాటు విజయవాడలోనూ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) నిర్ణయించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం నేపథ్యంలో అంతరాయ సమస్యలను అధిగమించేందుకు ఎక్స్చేంజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే.. ఇంటర్నెట్ సేవలందించే సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువగా ముంబై, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయి. ఇకపై ఈ సమస్య ఉత్పన్నం కాకుండా విశాఖ, విజయవాడ కేంద్రంగా ఇంటర్నెట్ ఎక్స్చేంజీ కార్యకలాపాలు మొదలుకానున్నాయి. నిక్సీ కేంద్రాలు ఏర్పాటైతే ఇంటర్నెట్ ఎకోసిస్టమ్ వృద్ధి చెంది.. ఐటీ పరిశ్రమలు తమ ఉత్పత్తుల దూకుడు పెంచేందుకు అవకాశాలూ మెరుగుపడనున్నాయి. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, విజయవాడలో యాక్సెంచర్ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి. గతంలోనే పరిశీలన.. వాస్తవానికి విశాఖపట్నంలో నిక్సీ ఏర్పాటుపై గతంలోనే ఒకసారి ప్రయత్నాలు జరిగాయి. 2019 చివరి త్రైమాసికంలో నిక్సీ బృందం పలు దఫాలుగా విశాఖపట్నంలో పర్యటించింది కూడా. నిక్సీ ఢిల్లీ కేంద్రం టెక్నికల్ మేనేజర్ అభిషేక్ గౌతమ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నిఖిల్ విశాఖలోని ఐటీ పరిశ్రమల్ని ఇప్పటికే రెండు మూడు సార్లు సందర్శించి.. ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటుకు గల అనుకూలతల్ని అడిగి తెలుసుకున్నారు. అయితే, తదనంతర కాలంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా నిక్సీ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. కొత్తగా ఏర్పాటు చేయనున్న నిక్సీ కేంద్రాల మధ్య కనెక్టివిటీ పెంచడం కోసం పాయింట్ టు పాయింట్ కనెక్టివిటీ కోసం చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే టెండర్లను కూడా నిక్సీ ఆహ్వానించింది. ఈ నెలాఖరులోగా ఈ టెండర్లను ఖరారు చేసి కనెక్టివిటీ పెంచిన తర్వాత కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏమిటీ ఉపయోగం.. రోజురోజుకీ ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోంది. ప్రతి చిన్న రోజువారీ అవసరాలకు ఇంటర్నెట్ తప్పనిసరిగా మారింది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇంటర్నెట్లో వేగం పెరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎక్స్చేంజీ సేవలు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఆయా సంస్థలకు 40 శాతం అదనపు భారం పడుతోంది. నగర పరిధిలో ఏపీఈపీడీసీఎల్, జీవీఎంసీ, బ్యాంకులు, రైల్వే బుకింగ్ కేంద్రం, వివిధ పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య సంస్థలు.. మొదలైన సంస్థలు బల్క్ కేంద్రాలుగా ఇంటర్నెట్‌ని వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిక్సీ ఏర్పాటైతే.. తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. -
పాక్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు!
ఇస్లామాబాద్: తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు.. నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు(NIBT) ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. అంతరాయం వారి(టెలికాం ఆపరేటర్ల) కార్యకలాపాలకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. అందుకే టెలికామ్ ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు అని ఎన్ఐబీటీ ప్రకటించింది. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం. ఇక విద్యుత్సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో.. నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 91కి చేరుకున్నాయి. నిందితుల ఒప్పుకోలు, సహ నిందితుల వాంగ్మూలం, వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. చదవండి: (నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని) -
‘అమలాపురం అల్లర్లు’.. మరో 9 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 9 మంది నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 71కి చేరుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. అందులో నాలుగు ఎఫ్ఐఆర్లకు సంబంధించి మొత్తం 71 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. తాజాగా అరెస్టు చేసిన 9 మందిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని పేర్కొన్నారు. నిందితులను పూర్తి ఆధారాలతో గుర్తించే అరెస్ట్ చేస్తున్నామన్నారు. అమలాపురంలో 144 సెక్షన్, సెక్షన్ 30 ఇంకా అమలులోనే ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియా గ్రూపులపై పూర్తి నిఘా.. సున్నితమైన విషయాలు, ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు, ఒక వర్గాన్ని, ఒక నేతను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. అలాంటి పోస్టులు పెట్టేవారిపైనే కాకుండా ఆ గ్రూపుల అడ్మిన్లపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా అలాంటి అభ్యంతరకర పోస్టులు పెడితే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. అలా కాకుండా పోస్టులు పెట్టిన వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం, కొట్టడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, చదువులు పూర్తయినవారే ఉన్నారని తెలిపారు. భవిష్యత్‌లో ఈ కేసుల్లో ఉన్న నిందితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వస్తే పోలీసు వెరిఫికేషన్‌లో అనర్హులవుతారని చెప్పారు. అలాగే విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పార్ట్‌లు కూడా మంజూరు కావని స్పష్టం చేశారు. 3 మండలాలకు ఇంటర్నెట్ పునరుద్ధరణ సోషల్ మీడియాలో పుకార్ల నియంత్రణకు నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను మరో 24 గంటలు పొడిగించినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే కోనసీమలో 16 మండలాలకు గాను 3 మండలాలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. సఖినేటిపల్లి, మలికిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. మిగిలిన మండలాల్లో బుధవారం కూడా ఇంటర్నెట్ ఉండదన్నారు. -
అమలాపురం విధ్వంసం కేసులో మరో 25 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో ఈ నెల 24న జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుల్లో 19 మంది అరెస్ట్ చేశామని, తాజా అరెస్టులతో ఆ సంఖ్య మొత్తం 44కు చేరిందని చెప్పారు. ఆదివారం మరికొందరిని అరెస్ట్ చేస్తామన్నారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తితో కలసి డీఐజీ పాలరాజు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం అరెస్ట్ చేసిన నిందితుల్లో అమలాపురం పట్టణం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల దహనం, బస్సులు, పోలీసు వజ్ర వాహనం ధ్వంసం కేసుల్లో వీరంతా నిందితులని పేర్కొన్నారు. 20 వాట్సాప్ గ్రూపుల స్క్రీన్ షాట్స్, గూగుల్ ట్రాక్స్, టవర్ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి వంటి సూచనలు వాట్సాప్ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. మరో వారంపాటు 144 సెక్షన్ కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించిన సెక్షన్ 144ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కూడా మరో 24 గంటలపాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి ఇంటర్నెట్ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలిపారు. నష్టాలు నిందితుల నుంచే రికవరీ ఆందోళనకారులు ఆ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేసి అపార నష్టాన్ని కలిగించారని డీఐజీ పాలరాజు తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆప్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్ చేశామని చెప్పారు. ఆస్తులు ధ్వంసం చేసిన దృశ్యాలను, వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి వ్యూహరచనతో మెసేజ్‌లను డీఐజీ పాలరాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు చూపించారు. -
భారత్‌లో లైసెన్స్ కోసం నిరీక్షణ తప్పదా?
ప్రపంచం మొత్తం తన వ్యాపార రంగాన్ని విస్తరించాలన్న ఎలన్ మస్క్ ప్రయత్నాలను భారత్ ముందుకు పోనివ్వడం లేదు. అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఇదివరకే టెస్లా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. భారత్‌లో మాత్రం దిగుమతి సుంకం దెబ్బకి జాప్యం జరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో మరో వ్యాపారానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఎలన్ మస్క్ సొంత కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్, సౌత్-నార్త్ అమెరికాలోని కొన్ని దేశాలతో పాటు ఓషియానా(ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)లలో సేవలు అందుతున్నాయి . ఇక ఆసియాలో అడుగుపెట్టడానికి భారత్ బెస్ట్ కంట్రీగా భావించి.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సేవల కంటే ముందు బుక్సింగ్ సైతం ప్రారంభించించింది కూడా. అయితే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు మొదలుపెట్టాలన్న ప్రయత్నాలకు కేంద్రం అడ్డు పడింది. దీంతో స్టార్‌లింక్ ప్రయత్నాలు సైతం నిలిచిపోగా.. కనెక్షన్ల కోసం తీసుకున్న డబ్బులు సైతం వెనక్కి ఇచ్చేసింది స్టార్‌లింక్. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. భారత ప్రభుత్వ ఒత్తిడితో స్టార్‌లింక్ ఇండియా డైరెక్టర్ పదవికి సంజయ్ భార్గవ రాజీనామా చేశారు కూడా. ఇదిలా ఉండగా.. తాజాగా అతిపెద్ద దేశాల్లో టాప్ టెన్‌లో ఉన్న బ్రెజిల్.. స్టార్‌లింక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి బ్రెజిల్ నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఏజెన్సీ (Anatel)తో స్టార్‌లింక్ సంప్రదింపులు జరిపిందే లేదు. అయినప్పటికీ బ్రెజిల్ గవర్నమెంట్ ముందుకొచ్చి.. డీల్ ఓకే చేసుకోవడం గమనార్హం. మరోవైపు భారత్‌లో లైసెన్స్ ప్రయత్నాలు మొదలుపెట్టిన స్టార్‌లింక్.. కొత్త చీఫ్ కోసం వేట సైతం ప్రారంభించింది. అయితే లైసెన్స్ పరిశీలనలోనూ జాప్యం జరుగుతోందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది స్టార్‌లింక్. చదవండి: అయ్యా ఎలన్ మస్క్.. మన దగ్గర బేరాల్లేవమ్మా! -
‘లోహార’కు త్వరలో ఇంటర్నెట్
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్, నెట్ సరిగా లేక విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు గుట్టలు, చెట్లు ఎక్కుతున్న తీరుపై ‘సిగ్నల్ దొరికేనా.. పాఠం వినేనా’అనే శీర్షికతో జూలై 3న ‘సాక్షి’మెయిన్ పేజీలో ఫొటో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన టెలికం టెస్, టెరా టెక్నో సొల్యూషన్స్, టెలికం శాఖ అధికారులు నెట్వర్క్ ఏర్పాటు కోసం రెండు రోజుల పాటు లోహార గ్రామంలో సర్వే చేశారు. పీఎం–వాణి ద్వారా త్వరలో ఇంటర్నెట్ అందుబాటులో తెస్తామని ఈ సందర్భంగా టెలికం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఎస్.శివరాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు లోహార గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పీఎం–వాణి పథకంలో భాగంగా పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో)ల ఏర్పాటుపై అవగాహన కల్పించామని చెప్పారు. గతంలో టెలిఫోన్ బూత్‌ల వద్ద ఎలా ఫోన్ ఉపయోగించేవారో అలాగే పీడీవోకు వచ్చి ఇంటర్నెట్ వాడుకోవచ్చన్నారు. చేతిలో ఫోన్ లేకున్నా పీడీఓలో అందుబాటులో ఉండే ఫోన్ ద్వారా తమ పనులు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
భైంసాలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల అవస్థలు
సాక్షి, రాయికల్(జగిత్యాల): నిర్మల్ జిల్లా భైంసా అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను ఆ జిల్లావ్యాప్తంగా నిలిపివేశారు. దీంతో కరోనా కారణంగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మద్దిపడగ గ్రామానికి చెందిన చౌడారపు మహేశ్వరి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. మద్దిపడగలో ఇంటర్నెట్ సేవలు లేకపోవడంతో జగిత్యాల జిల్లా రాయికల్‌లోని బంధువుల ఇంటికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. తండ్రితో కలిసి మోటార్‌సైకిల్‌పై సుమారు 40 కిలోమీటర్లు రోజూ వచ్చి వెళ్తోంది. శనివారం కూడా వచ్చి విధులు నిర్వర్తించి వెళ్లింది. ఇదేవిధంగా అనేకమంది ఇంటర్నెట్ సదుపాయం కోసం ఇతర జిల్లాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. -
భైంసాలో ఉద్రిక్తత.. ఇంటెర్నెట్ సేవలు బంద్
సాక్షి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన గొడవల ప్రభావంతో మంగళవారం కూడా హైఅలర్ట్ కనిపించింది. పట్టణమంతా పోలీసు పికెటింగ్‌లు, పెట్రోలింగ్ వాహనాలు తప్ప జనాలెవరూ రోడ్లపైకి రాలేదు. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మెడికల్ షాపులు, కూరగాయలు, కిరాణా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా మూసే ఉన్నాయి. పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. దాదాపుగా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. భారీగా బందోబస్తు కొనసాగినా, జనం రోడ్లపై కనిపించకపోయినా.. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయ సమీపంలో మంగళవారం ఉదయం మరో కారు దహనమైంది. ఇంటిముందు నిలిపి ఉంచిన కారుకు ఎవరో నిప్పంటించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఫైరింజన్‌ను రప్పించి మంటలు ఆర్పివేయించారు. దీంతో మళ్లీ ఏదో జరుగుతోందని ప్రజల్లో భయం కనిపించింది. కొనసాగుతున్న విచారణ భైంసాలోని జుల్ఫిగల్ గల్లీలో ఆదివారం రాత్రి బైకు సైలెన్సర్ విషయంగా మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. నిమిషాల్లోనే ఇరువర్గాల వారు గుమిగూడి పరస్పర రాళ్లదాడికి, హింసకు పాల్పడ్డారు. పోలీసులు త్వరగా స్పందించడంతో రాత్రి 10.30 గంటలకల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జుల్ఫికర్ గల్లీ, సంజయ్ గాంధీ మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆస్తి, వాహనాల విధ్వంసం జరిగింది. రెండు ఇళ్లు, రెండు ఆటోలు, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు కార్లు దహనమయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే సుమారు 14 మందిని అదుపులోకి తీసుకోగా.. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ, ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనలో వాహనాలు దహనమైన బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ వారినుంచి ఫిర్యాదులు తీసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన గొడవల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఆరా తీస్తున్నారు. నిఘా బృందాలు కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నాయి. ఇక రెవెన్యూ అధికారులు రెండోరోజు సైతం ఆస్తి నష్టం వివరాలను అంచనా వేస్తూ కనిపించారు. కొనసాగిన ఆంక్షలు.. ఇంటర్నెట్ బంద్ భైంసా పట్టణం, పరిసర ప్రాంతాల్లో పోలీసు ఆంక్షలు కొనసాగాయి. పట్టణానికి వచ్చే అన్నిమార్గాల్లో, పట్టణంలోని గల్లీల్లోకి వెళ్లే రహదారుల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గల్లీల్లో ఉన్నవారిని బయటికి అనుమతించలేదు. బయటివారిని లోనికి వెళ్లనీయలేదు. వేరే ఊర్ల నుంచి వచ్చేవారిని పట్టణంలోకి రానివ్వలేదు. మొత్తంగా భైంసాలో ఏం జరుగుతోందో బయటి జనానికి అంతుచిక్కని పరిస్థితి ఉంది. వరుసగా రెండోరోజు సైతం ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పోలీసు ఆంక్షలతో మంగళవారం సైతం భైంసా డిపో నుంచి బస్సులు బయటికి రాలేదు. పట్టణం నుంచి బయటికి వెళ్లేవారు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. అత్యవసర సేవల్లో పాల్గొనే సిబ్బందికి సైతం ఎలాంటి పాసులు జారీ చేయక.. ఇబ్బంది పడ్డారు. భైంసా డివిజన్లో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ ఇబ్బందులు తప్పలేదు. వారంతా భైంసాలో ఉంటూ ఊర్లలో విధులకు వెళ్లొస్తుంటారు. తీవ్ర ఇబ్బందుల్లో జనం పట్టణంలో పోలీసు ఆంక్షలు, దుకాణాలు మూసి ఉండటంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని ఏరియాల్లో పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందక అల్లాడుతున్నారు. ముఖ్యం గా పట్టణం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక చాలా మంది వాటర్ ప్లాంట్ల నుంచి రక్షిత మంచినీటిని తెచ్చుకునేవి. ఇప్పుడు వాటర్ సరఫరా చేసే ఆటోలనూ అనుమతించకపోవడంతో నల్లా నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉంది. ఎంపీని అడ్డుకున్న పోలీసులు బాల్కొండ: చలో బైంసా నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఎంపీ సోయం బాపురావును నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ వైపు వెళ్లేందుకు అనుమతి లేదని.. హైదరాబాద్‌లోని నివాసానికి తిరిగి వెళ్లాలని సూచించారు. దీంతో పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
గిరిజన గూడేలకూ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికీ ఇంటర్నెట్ సౌకర్యం కలగనుంది. కొండకోనల మధ్య ఉండే గిరి శిఖర గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవల్ని అందించేం దుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ నిర్వహణకు ఇంటర్ నెట్ తప్పనిసరి కావడంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి గిరిజన గ్రామానికీ ఈ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. 134 గూడేల్లో వేగంగా పనులు ఇప్పటికే 134 గిరిజన గూడేల్లో ఫైబర్ నెట్ కనెక్టివిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు ఇప్పటికే చెల్లించింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో 51 గ్రామాలు, విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 49 గ్రామాలు, విశాఖపట్నం జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో 26 గ్రామాలు, శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 6 గ్రామాలు, చింతూరు, కేఆర్ పురం ఐటీడీఏల పరిధిలో ఒక్కో గ్రామంలో ఫైబర్ నెట్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొండ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ సంస్థ 200కు పైగా టవర్స్ ఏర్పాటు చేసింది. వీటిద్వారా సమీప ఏజెన్సీ గ్రామాల్లో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 251 గూడేల్లోనూ.. ఫైబర్ నెట్‌ను ప్రతి గిరిజన గ్రామానికి విస్తరించే కార్యక్రమంలో భాగంగా 251 గూడేల్లో పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇందుకు రూ.24.50 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపడతామని అధికారులు చెప్పారు. -
బూతు సినిమాలు చూడటానికే ఇంటర్నెట్..
సాక్షి, ముంబై : జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యువత దర్టీ మూవీస్ (బూతు సినిమాలు) చూడటానికే ఇంటర్నెట్ను ఉపయోగిస్తారని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో దేశానికి ఎలాంటి ఆర్థిక నష్టాలు లేవని అన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అసలు విషయమే కాదు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో వచ్చే తేడా ఏమిటి? అక్కడ ఇంటర్నెట్లో ఏం చూస్తారు? బూతు సినిమాలు చూడటం తప్ప అక్కడ యువత ఏం చేస్తారు?’’ అని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వదంతులు వ్యాప్తి కాకుండా ఉండేందుకే అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని సారస్వత్ స్పష్టం చేశారు. (జమ్మూ కశ్మీర్లో మొబైల్ సేవల పునరుద్ధరణ) రాజకీయ నాయకులు కశ్మీర్లో ఢిల్లీ తరహా నిరసనలను సృష్టించి, వాటికి సోషల్ మీడియా ద్వారా మరింత ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆగస్ట్ 5 నుంచి కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. సంఘ వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ను వాడుతున్నాయని సమాచారం అందడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. అనంతరం పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. -
జమ్మూ కశ్మీర్లో మొబైల్ సేవల పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు అక్కడి అధికారులు శనివారం నిర్ణయం తీసుకున్నారు. ప్రీపెయిడ్ మొబైల్ సేవల్లో భాగంగా వాయిస్ కాల్స్, మెసేజ్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ ప్రధాన కార్యదర్శి రోహిత్ కన్సాల్ మీడియాకు వెల్లడించారు.శనివారం నుంచే ఇది అమల్లోకి రానుందని ఆయన తెలిపారు. జమ్మూలోని పది జిల్లాలు, కశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను తిరిగి ప్రారంభించాలని ఆయన కోరారు. కాగా మొబైల్ ఇంటర్నెట్ సేవల విషయంలో సిమ్‌కార్డులను ఆధారాలతో దృవీకరించుకోవాలని టెలికాం అధికారులకు కన్సాల్ సూచించారు. అయితే కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న సైట్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని, సోషల్ మీడియాపై మాత్రం నిషేధం అలాగే కొనసాగుతుందని కన్సాల్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శాంతి భద్రతలు పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని జమ్మూ కశ్మీర్లో అన్ని ప్రీపెయిడ్ మొబైల్ సేవలను నిలిపివేస్తూ టెలికాం శాఖ ఆంక్షలు విధించింది. -
కశ్మీర్లో ఆంక్షల పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
ఉచిత ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
లండన్: ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు భారత్‌లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు. ఇంటర్నెట్ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించిందని, ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కొందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండి.. మరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారంది. -
178 సార్లు నెట్ సర్వీసులు కట్!
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో మొబైల్ ఫోన్, మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులే కాకుండా ల్యాండ్‌లైన్ ఫోన్ సర్వీసులు కూడా గత వారం రోజులుగా నిలిచిపోయాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ ఆర్టికల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వీటి సేవలు నిలిచి పోయిన విషయం తెల్సిందే. కశ్మీర్లో ఈ సేవలను నిలిపివేయడం మూడోసారో, 30వ సారో కాదు. 2012 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 178 సార్లు నిలిపివేసినట్లు ఇంటర్నెట్ వాచ్డాగ్ ‘ఫ్రీడమ్ లా సెంటర్ (ఇండియా)’ ఓ నివేదిలో వెల్లడించింది. ఈసారి ల్యాండ్‌లైన్ సేవలను కూడా నిలిపివేయడం ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. గత వారం రోజులుగా వార్తా పత్రికలు కూడా ప్రచురితం కాకపోవడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోంది. శాటిలైట్ డిషెస్ ఉన్న వాళ్లు మాత్రమే కశ్మీర్ గురించి జాతి జనులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చూడగలిగారు. నేటి వరకు వాటిలో వస్తున్న టీవీ ఛానళ్ల ద్వారా వార్తలు తెలసుకోగలుగుతున్నారు. ప్రజా ఎమర్జెన్సీ, ప్రజా భద్రతను దష్టిలో పెట్టుకొని ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికమ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సేఫ్టీ) రూల్స్ 2017’ కింద కమ్యూనికేషన్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేయవచ్చు. కశ్మీర్లో ల్యాండ్ ఫోన్ సర్వీసులనైతే ప్రభుత్వం అతి సులువుగా నిలిపివేయచ్చు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థ అయిన ఒక్క బీఎస్ఎన్ఎల్ మాత్రమే కశ్మీర్లో ఈ సర్వీసులను నిర్వహిస్తోంది. అయినప్పటికీ 1971 నుంచి కశ్మీర్లో ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ సేవలను నిలిపివేయలేదని, ఇదే మొదటిసారని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. కనీసం కార్గిల్ యుద్ధం అప్పుడు కూడా ఈ సేవలను నిలిపి వేయలేదట. అయితే హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వాణి ఎన్కౌంటర్ జరిగినప్పుడు బారముల్లా, బండిపొర, కుప్వారా జిల్లాల్లో ల్యాండ్‌లైన్ సర్వీసులను నిలిపివేశారట. -
అక్కడ ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభం
శ్రీనగర్ : భద్రతా కారణాల రీత్యా శుక్రవారం శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేసిన అధికారులు శనివారం తిరిగి పునరుద్దరించారు. నలుగురు ఉగ్రవాదులు అనంతనాగ్‌లోకి చొరబడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అనంత్‌నాగ్, శ్రీనగర్‌లలో శుక్రవారం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా భద్రతా దళాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో తీవ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి నెట్ సర్వీసుల్ని తిరిగి ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. కాగా, కశ్మీర్లో రంజాన్ ముగిసిన తర్వాత జరిగిన భారీ ఎన్కౌంటర్ ఇదే. ఈద్ సందర్భంగా నెల రోజులు పాటు సంయమనంతో ఉన్న సైన్యం ఉగ్రవాదలు వేటను తిరిగి ప్రారంభించింది. ఇది కూడా చదవండి : వేట షురూ.. భారీ ఎన్కౌంటర్ -
ఇంటర్నెట్ సేవలపై కొనసాగుతున్న ఆంక్షలు...!
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ సేవలు (షట్‌డౌన్) నిలిపివేయడం వంటివి చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో శాంతి, భద్రతల పరిస్థితి క్షీణించే పరిస్థితులు, ఏవైనా ఘర్షణాత్మక పరిణామాలు చోటు చేసుకున్నపుడు ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు ఉపయోగించుకుని వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వదంతులు వ్యాపించే అవకాశమున్నందున దీనిపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 2012 నుంచి ఇప్పటివరకు 161 సందర్భాల్లో ఈ సేవలకు అంతరాయం ఏర్పడినట్టు ఢిల్లీకి చెందిన లాభాపేక్ష లేని ‘సాఫ్ట్వేర్ ఫ్రీడం లా సెంటర్’ గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందులో అధిక శాతం గత రెండున్నరేళ్లలోపు జరిగినవే. 2016లో 31, 2017లో 70, ఈ ఏడాది ఇప్పటివరకు 32 సందర్భాలున్నాయి. అయితే భారత్‌లో ఎక్కువస్థాయిలో నియంత్రణ విధించడాన్ని మానవహక్కుల సంఘాలు, పత్రికా స్వేచ్ఛ సంస్థలు తప్పుబడుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘనతో పాటు పత్రికాస్వేచ్ఛకు భంగం వంటి కారణాల వల్ల ఇలాంటివి సరికాదని వాదిస్తున్నాయి. గత 15 రోజుల్లోనే ఆరు రాష్ట్రాల్లో... మరీ ముఖ్యంగా గత రెండువారాల్లోనే ఆరురాష్ట్రాల్లో ఈ షట్‌డౌన్ చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ , పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా శాంతి,భద్రతల పరిరక్షణలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అయితే మధ్యప్రదేశ్, పంజాబ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం 2017లో నిర్దేశించిన నియమ,నిబంధనల ప్రక్రియను పాటించాయి. బెంగాల్లో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా, కశ్మీర్లో మిలిటెంట్లపై భద్రతాదళాలు జరిపిన భారీ ఆపరేషన్ సందర్భంగా, ఎస్సీ,ఎస్టీల అత్యాచారాల నిరోధకచట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దళితసంఘాల భారత్‌బంద్ సందర్భంగా ఇవి చోటుచేసుకున్నాయి. ప్రాథమిక నిషేదాజ్ఞలు, ప్రజల కదలికలపై నియంత్రణలతో పాటు ఆయా రాష్ట్రాల్లోని అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినపుడు ఇంటర్నెట్‌సేవలు ఆపివేయడాన్ని ఒక ప్రామాణిక ప్రక్రియగా కొనసాగుతోంది. పుకార్లు, వదంతులు త్వరగా వ్యాపించేందుకు తరచుగా ఇంటర్నెట్ను ఉపయోగించడం, దాని ద్వారా హింస, అల్లర్లు రెచ్చగొట్టే అవకాశం ఏర్పడుతోందని స్థానిక అధికార యంత్రాంగం వాదిస్తోంది. అందువల్లే పరిమిత కాలానికి తాత్కాలికంగా ఈ సర్వీసును నిలిపివేయాల్సి వస్తోందని చెబుతోంది. దీని ద్వారా శాంతి,భద్రతల పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు వీలు కలుగుతోందని వాదిస్తోంది. కొత్త నిబంధనలు... ప్రస్తుతం వివిధ పనులు, అవసరాల కోసం విస్తృతంగా ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నందున ఇలాంటి నియంత్రణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ప్రజా భద్రతకు భంగం, అత్యవసర పరిస్థితి వంటిది ఏర్పడినపుడు తాత్కాలికంగా టెలికం సర్వీసులు సస్పెండ్ చేసేందుకు పాటించాల్సిన ప్రక్రియను కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ప్రకటించింది. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో భాగంగా ‘టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ సెఫిటీ)రూల్స్,2017గా ఈ నిబంధనలు ఖరారు చేసింది. ఇలాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే పక్షంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి (కేంద్ర/ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతితో) జారీచేయవచ్చు. అయితే ఈ నిబంధనల పట్ల కూడా కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా బెంగాల్‌లోని పశ్చిమ వర్థమాన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్రాండ్ సర్వీసులు (స్థానిక కేబుల్ టీవీ వార్తా ప్రసారాలు సహా) రెండున్నర రోజుల పాటు నిలిపివేశారు. జిల్లా మేజిస్ట్రేట్‌కు సెక్షన్–144 కింద ఉన్న అపరిమిత అధికారాలను దీనికి ఉపయోగించారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు కూడా దేశంలోని ఇంటర్నెట్ సేవల నిలుపుదల ఉత్తర్వులు ఎక్కువగా ఇదే తరహాలో ఇస్తూ వచ్చారు. నూతన నిబంధనలు వచ్చాక కూడా పాత పద్థతే కొన్ని చోట్ల కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో మాత్రం కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనలు పాటిస్తూ ఇటీవల ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలుపుదల ఉత్తర్తులిచ్చాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏ మూలకైనా ‘వల’ వేస్తాం!
సాక్షి, హైదరాబాద్: గూగుల్.. సంచలనాలకు పెట్టింది పేరు. టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ నిత్యావసరంగా మారిన ఈ సంస్థ ఇంకో అద్భుత విజయం సాధించింది. ప్రపంచంలో ఏమూలలో ఉన్న వారికైనా.. చిటికెలో మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్లను అందించేందుకు వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో భాగంగా బుధవారం ‘కనెక్టింగ్ ద నెక్ట్స్ బిలియన్’పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో గూగుల్ అనుబంధ సంస్థ ‘ఎక్స్’డైరెక్టర్ టామ్ మూర్ స్వయంగా వెల్లడించిన ఈ కొత్త టెక్నాలజీ వివరాలు.. ‘ప్రపంచంలో వీలైనంత ఎక్కువ మందికి ఇంటర్నెట్ను అందుబాటులోకి తేవాలని గూగుల్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండేళ్ల క్రితం మేం భారీసైజు గాలి బుడగల్లో కొన్ని పరికరాలను ఉంచి ఇంటర్నెట్ను ప్రసారం చేయాలని ఒక ప్రాజెక్టు చేపట్టాం. ప్రయోగాలన్నీ విజయవంతం గానే సాగాయి. అయితే ఈ ప్రాజెక్టుల్లో భాగంగా మేం గాలి బుడగల్లో వాడిన ఓ పరికరం మా ఆలోచనలకు పదును పెట్టింది. ఒక బెలూన్ ఇంకోదాన్ని గుర్తించేందుకు, సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వాడే ఈ పరికరం లేజర్ల సాయంతో పని చేస్తుంది. ఆకాశంలో విజయవంతంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించిన ఈ ‘ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (ఎఫ్ఎస్ఓసీ) టెక్నాలజీని భూమ్మీద వాడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలు మొదలయ్యా యి. పరీక్షించి చూద్దామని శాన్ఫ్రాన్సిస్కో బేలో గతేడాది చిన్న ప్రయోగం చేశాం. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు ఎల్తైన భవనాలపై రెండు ఎఫ్ఎస్ఓసీలు బిగించి పరీక్షించాం. సెకనుకు కొన్ని గిగాబైట్ల సమాచారం ప్రసారం చేయవచ్చని, అందుకోవచ్చని తేలింది. ఈ పరికరాలకు బదులు గా ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను వాడాల్సి వస్తే.. భారీగా కేబుల్ వేయాల్సి వచ్చేది. గోతు లు తవ్వడం, కేబుల్ వేయడం వంటి అన్ని పనులకు బోలెడంత ఖర్చయ్యేది. నెలల సమయం పట్టేది. ఇవేవీ లేకుండానే 2 గంటల సమయంలోనే మేం ఆ పని చేయగలిగాం. తర్వా తి కాలంలో ప్యూర్టారికోలో ప్రకృతి విపత్తు కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ నాశనమైనప్పుడు ఈ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షిం చి చూశాం. 2 వారాల సమయంలోనే అక్కడ విద్యుత్ టవర్లపై ఎఫ్ఎస్ఓసీలను ఏర్పాటు చేసి 90 వేల మందికి నెట్ సౌకర్యం కల్పించాం. చాపరాయిలోనూ సక్సెస్ ఎఫ్ఎస్ఓసీలతో అతితక్కువ సమయంలో ఎక్కడైనా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించవచ్చని స్పష్టమైన తర్వాత ఆ సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా చాపరాయిలోనూ డిజిటల్ వెలుగులు పంచేందుకు దీన్ని ఉపయోగించారు. అడవి మధ్యలో అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామానికి నాలుగంటే నాలుగు వారాల్లో పూరిస్థాయిలో కనెక్టివిటీ సాధించగలిగాం. ఈ ప్రాజెక్టు విజయవంతమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రెండు వేల ఎఫ్ఎస్ఓసీల కొనుగోలుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి గత నెలలోనే ఒప్పందం కుదిరింది. అన్నీ సవ్యంగా సాగితే సమీప భవిష్యత్తులో భారత్‌లోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాం’. -
భారత్ ఏకచత్రాధిపత్యానికి తెర
కఠ్మాండు : దేశ పౌరులకు అంతర్జాల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు హిమాలయ దేశం నేపాల్ చైనాతో చేతులు కలిపింది. దీంతో గత దశాబ్దంగా నేపాల్ సైబర్ కనెక్టివిటీపై భారత్ ఏకచత్రాధిపత్యానికి తెర పడింది. ఇప్పటివరకూ భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా నేపాల్ అంతర్జాల సౌకర్యాన్ని పొందుతూ వచ్చింది. అయితే, తరచూ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ గురవుతుండటం నేపాల్ అధికారులకు విసుగొచ్చేలా చేసింది. దీంతో చేసేది లేక ఉత్తమ నెట్వర్క్ కల్పన కోసం చైనా సాయం కోరినట్లు నేపాల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. నేపాల్ టెలికాం, చైనా టెలికాం గ్లోబల్‌లు కలసి చైనాలోని కెరుంగ్ నగరం నుంచి నేపాల్‌లోని రసువగడి వరకూ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 50 కిలోమీటర్ల మేర నిర్మించిన నెట్‌వర్క్‌ను శనివారం ప్రారంభించినట్లు పేర్కొంది. భారత్ విఫల సర్వీసులకు చైనా నుంచి ప్రత్యామ్నాయం లభించినట్లు నేపాల్ టెలికాం అధికార ప్రతినిధి పేర్కొన్నారని రాయిటర్స్ తెలిపింది. రెండు కోట్ల ఎనభై లక్షల జనాభా కలిగిన నేపాల్‌లో ప్రస్తుతం 60 శాతం మందికి ఇంటర్నెట్ సర్వీసులు అందుతున్నట్లు పేర్కొంది. సరిహద్దులో కీలక ప్రాంతంగా ఉన్న నేపాల్‌లో తమ పలుకుబడిని పెంచుకునేందుకు ఏళ్లుగా భారత్, చైనాలు ప్రయత్నిస్తున్నాయి. 2016లో పోర్టులను వర్తకానికి ఉపయోగించుకునేందుకు చైనా నేపాల్‌కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లో నేపాల్ చైనా తలపెట్టిన సిల్క్ రోడ్డులో చేరేందుకు అంగీకారం కూడా తెలిపింది. -
ఏజెన్సీలో ఆఫ్‌లైన్
సేవలను పునరుద్ధరించాలి.. గత 12 రోజుల నుంచి జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఘర్షణ నేపథ్యంలో డేటా సేవలను జిల్లా స్థాయిలో నిలిపివేయడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేపోతున్నాం. కరెంట్ అఫైర్స్, ఉద్యోగ నోఫికేషన్లు గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఘర్షణలకు కారణమైన సోషల్ నెటవర్క్లను బ్లాక్ చేసి, ఇంటర్నెట్ పునరుద్ధరిస్తే సామాన్య ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, ఆన్లైన్ సెంటర్ల వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – ఎల్చల్‌వార్ లక్ష్మణ్, ఆదిలాబాద్ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాపించకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివాసీలు, లంబాడా తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో తలెత్తిన వివాదం ముదిరి ఈనెల 15న ఉట్నూర్‌లో విధ్వంసానికి కారణమైంది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా, సామాజిక మాధ్యమాల్లో హత్యలుగా ప్రచారం జరిగి, విధ్వంసానికి కారణమైందని భావించిన ప్రభుత్వం 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ సర్వీస్‌లతో పాటు అన్ని ప్రైవేటు మొబైల్ కంపెనీల ఇంటర్నెట్ డేటా సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఏజెన్సీ మండలాల్లో 16వ తేదీ నుంచి నెట్ సర్వీస్ పూర్తిగా నిలిచిపోయింది. ఈనెల 23వ తేదీ వరకు ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, మందమర్రి, బైంసా వంటి పట్టణాల్లో కూడా ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించారు. కానీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఉట్నూర్, నార్నూర్, లింగాపూర్, సిర్పూర్(యు), ఇంద్రవెల్లి మండలాల్లో 13 రోజులుగా ఎలాంటి ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందడం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈనెల 26న మరోసారి అల్లర్లు చెలరేగడంతో జన్నారం, కడెం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల పరిధిలో మళ్లీ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఈ పరిణామాలతో ఇబ్బంది పడుతున్నారు. కుమురం భీం జిల్లాలో సమస్య తీవ్రం ఈనెల 16 నుంచి ఏజెన్సీలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో కుమురం భీం జిల్లాలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మీ సేవ, ఈ సేవ, విద్య, వైద్యంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నింటా ఆన్లైన్తోనే ముడిపడి ఉండటంతో అనేక పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రవాణా కోసం బస్సు, రైల్వే, విమాన టికెట్ల బుకింగ్ నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాల్లో ఆధార్, కుల, ఆదాయ, భూ సంబంధ తదితర మార్పులు చేర్పులకు సంబందించి సేవలు అందడం లేదు. రవాణా కార్యాలయానికి నిత్యం వందలాది మంది లైసెన్స్, రెన్యూవల్, ఫిట్నెస్, పర్మిట్ ఇతర అనుమతుల కోసం వాహనదారులు వస్తుంటారు. ఆర్టీఏ కార్యాయలంలో నెట్ అందుబాటులో ఉన్నా... జిల్లా వ్యాప్తంగా నెట్ లేకపోవడంతో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడం కుదరడం లేదు. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య తగ్గిపోయింది. ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమీప ప్రాంతాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని వస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, బెజ్జూర్, సిర్పూర్(యు), కెరిమెరి, తిర్యాణి, దహేగాం, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, వాంకిడి తదితర మండలాల్లో ప్రజలు ఇంటర్నెట్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలో కూడా బీఎస్ఎన్ఎల్ మినహా ఇతర నెట్‌వర్క్‌ల బ్రాడ్‌బాండ్ రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తప్పని తిప్పలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోనూ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఫైళ్లన్ని పేరుకుపోతున్నాయి. కల్యాణలక్ష్మి బిల్లులు అప్లోడ్ చేయడం, ప్రభుత్వ ఉద్యోగుల, కింది స్థాయి సిబ్బంది జీతాలు, రెవెన్యూ శాఖలో భూ ప్రక్షాళనలో ఆన్లైన్లో మార్పులు చేర్పులు అన్ని స్తంభించిపోయాయి. ఇక ఉపాధిహామీ పథకంలో దినసరి కూలీల వేతాలు, పెన్షన్లు, ప్రతి రోజు ఇచ్చే నివేదికలు తదితరవన్ని ఆన్లైన్లో జరగాల్సి ఉన్నందున అన్నింటా జాప్యం జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కిట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నమోదయ్యే గర్భిణుల వివరాలు, ప్రసూతి వివరాలు, ఆశ వర్కర్ల ఇన్సెంటివ్‌లు, సిబ్బంది జీతాలు నమోదు ప్రక్రియ ఆగిపోయిందని డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ముంచుకొస్తున్న టీఆర్టీ గడువు.. మరో పక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న టీఆర్టీ (టీచర్ రిక్రూమెంట్ టెస్టు)కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకే గడువు ఉంది. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేకమంది దరఖాస్తు చేసుకోనివారు ఉన్నారు. అంతేకాక పాత టీఆర్టీ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు కొత్త నోటిఫికేషన్ (పాతజిల్లా ప్రతిపాదికన జరిగే) ప్రకారం ఎడిట్ చేసుకోవల్సిన అభ్యర్థులు ఉన్నారు. కొందరు నెట్ వచ్చే ప్రాంతాలకు వెళ్లి దరఖాస్తు చేసుకంటున్నారు. వీరికోసం జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీసులో ప్రత్యేకంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించినప్పటకీ బెజ్జూర్, పెంచికల్పేట్, దహేగం వంటి సుదూర ప్రాంతాల వారు ఇక్కడికి రావాలంటే ఎంతో కష్టం. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్‌తో ప్రభుత్వ కార్యాలయాల్లో... ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లా ఏజెన్సీ మండల కేంద్రాల్లోని బ్యాంకులు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌తో సేవలు నడుస్తున్నాయి. ఆదిలాబాద్‌లో మీ సేవ సెంటర్లు అన్ని మండలాల్లో నడుస్తున్నట్లు సంబంధిత అధికారులు చెపుతున్నప్పటికీ, ఏజెన్సీల్లో సెంటర్లను తెరవడం కూడా లేదు. ప్రైవేటు మొబైల్ కంపెనీల బ్రాడ్‌బాండ్‌తో పనిచేసే కంప్యూటర్లు గానీ, మొబైల్ డేటాతో రూటర్‌తో నడిచే కంప్యూటర్లు పనిచేయడం లేదని పలు ప్రాంతాల్లో ఆందోళన చెందుతున్నారు. గిరాకే లేకుండా పోయింది జిల్లాలో రెండు వర్గాల మద్య ఏర్పడిన ఘర్షణల మూలంగా నెట్‌ను తొలగించటంతో షాపులో గిరాకే లేకుండా పోయింది. రోజంతా షాపులో ఉంటే రూ.100 కూడా రావటం లేదు. టీఆర్టీతో పాటు ఇతర ఉద్యోగాల కోసం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేయాలి. నెట్ ఉంటేనే ఆన్లైన్ పనులు సాగుతాయి. అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా గత 15 రోజులుగా నెట్ సేవలు తొలగించటంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. కనీసం ఎప్పటి వరకు పునరుద్ధరిస్తారనే విషయం కూడా తెలియటం లేదు. – మియ్యపురం రమేశ్ (నెట్‌సెంటర్ యజమాని) -
ఇంటింటికీ ఇంటర్నెట్
-
ఇంటింటికీ ఇంటర్నెట్
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఏడాది డిసెంబర్ నాటికల్లా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె. తారకరామారావు ఆదేశించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్ణీత గడువులో పూర్తవుతున్న నేపథ్యంలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే మిషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. బుధవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ చేపట్టిన పలు ప్రాజెక్టులపై ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం భారత్ నెట్ కింద అందిస్తున్న ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు కేటీఆర్‌కు వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ ద్వారా వచ్చే మార్పును ప్రపంచానికి చూపేందుకు మహేశ్వరం మండలంలోని 4 గ్రామాల్లో చేపడుతున్న టెక్నాలజీ డెమో నెట్వర్క్ జనవరి మొదటి వారంలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు విజయ బ్యాంకు ఇస్తున్న రూ.516 కోట్ల రుణ పత్రాలను బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణరాజు మంత్రికి అందజేశారు. టీవర్క్స్ డిజైన్లు సిద్ధం చేయండి పరిశ్రమల శాఖ సమీక్షలో భాగంగా టీహబ్–2, ఇమేజ్ టవర్, టీవర్క్స్ ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్ ఆ శాఖ అధికారులతో చర్చించారు. టీవర్క్స్ డిజైన్లు సిద్ధం చేయాలని, వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఫార్మాసిటీకి త్వరలోనే కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వస్తాయని అధికారులు వివరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
నెట్ 'స్వేచ్ఛ' కు సై
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సేవలను అందించడంలో వివక్షను సహించేది లేదని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కుండబద్దలుకొట్టింది. నెట్ న్యూట్రాలిటీకే తమ మద్దతు అని తేల్చిచెప్పింది. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు, టెలికం కంపెనీలు సహా ఈ రంగంలోని ఏ సంస్థలైనా సరే కొన్ని యాప్‌లు, వెబ్సైట్లను ఎలాంటి నెట్చార్జీలు లేకుండా ఉచితంగా అందించడం, అదేవిధంగా మరికొన్ని వెబ్సైట్లు, యాప్‌లను విస్మరించడం.. అడ్డుకోవడం వంటి చర్యలను నిషేధించాలని సూచించింది. నెట్‌న్యూట్రాలిటీపై ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సిఫార్సుల నివేదికను మంగళవారం ట్రాయ్ విడుదల చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం(టెలికం శాఖ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. నెట్ సేవల్లో వివక్షపై గతేడాదే ట్రాయ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుత లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం.. ఇంటర్నెట్లో సమాచారం (కంటెంట్)ను అందించే విషయంలో కొన్నింటికి అధిక చార్జీలు, మరికొన్నింటికి తక్కువ చార్జీలు లేదా ఉచితంగా సేవల వంటివి లేకుండా నియంత్రణరహిత సేవలను ప్రొవైడర్లు కల్పించాలి’ అని ట్రాయ్ పేర్కొంది. నెట్ న్యూట్రాలిటీపై ఇదివరకే చర్చాపత్రాన్ని విడుదల చేసి వివిధ పక్షాల నుంచి అభిప్రాయాలను ఆహ్వానించింది. వీటన్నింటినీ పరిశీలించి.. తాజా సూచనలను కేంద్రానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం కూడా ఓకే చెబితే... ఇకపై ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు(ఐఎస్పీ) వెబ్ ట్రాఫిక్(కంటెంట్)ను ఇష్టానుసారం అడ్డుకోవడం లేదా నియంత్రించడం(కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ఫోన్లు ఇలా ఏవిధమైన పరికరానికి సంబంధించినదైనా), కొందరు కంటెంట్ ప్రొవైడర్లకు వేగవంతమైన సర్వీసులు(ఫాస్ట్ లేన్స్) కల్పించడం వంటి వాటికి పూర్తిగా అడ్డుకట్టపడుతుంది. అమెరికా వెనకడుగు... కాగా, నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఒబామా సర్కారు 2015లో తీసుకొచ్చిన నిబంధనలను పక్కనబెట్టి కొత్త నిబంధనల రూపకల్పనకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ ప్రతిపాదించిన కొద్దిరోజులకే ట్రాయ్ నివేదిక వెలువడటం గమనార్హం. ఐఎస్పీలన్నింటినీ సమాన సేవలందించే సంస్థలుగా(కామన్ క్యారియర్లు) పరిగణించకుండా.. కంటెంట్ ఆధారంగా వాటిని ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సంస్థలుగా విభజించాలనేది పాయ్ ప్రతిపాదన. దీనిపై వచ్చే నెలలో పూర్తిస్థాయిలో కమిషన్ ఓటింగ్ జరపనుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా పలుదేశాలు నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ప్రస్తుత ట్రంప్ సర్కారు మాత్రం దీనిపై మెలిక పెడుతుండటంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఏం చెబుతున్నాయంటే... ♦ టెలికం కంపెనీలు, ఐఎస్పీలు... ఇంటర్నెట్ ద్వారా అందించే కంటెంట్, సర్వీసులకు సంబంధించి విభిన్న డేటా చార్జీలు, ఉచిత సేవలు వంటి చర్యలకు పాల్పడకూడదు. ఆన్లైన్ వీడియోలకు ఎక్కువతక్కువ స్పీడ్లతో వివక్షకు తావుండరాదు. ♦ కంటెంట్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్(సేవలు)లో వివక్షను నిరోధించేందుకు ప్రొవైడర్ల లెసెన్స్ నిబంధనలను మార్చాలి. ♦ కంటెంట్‌ను అడ్డుకోవడం, స్పీడ్‌ను తగ్గించడం, స్పీడ్ విషయంలో కొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి ఎలాంటి జోక్యాన్ని అయినా వివక్షగానే పరిగణించాలి. ♦ సమాచారం పంపేవాళ్లు–అందుకునేవాళ్లు, సర్వీసు ప్రోటోకాల్స్, వినియోగించే పరికరాలు(ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, మొబైల్స్ ఇతరత్రా) ఆధారంగా అసమానతలకు తావిచ్చేవిధంగా కంటెంట్‌ను అందించే సంస్థలతో సర్వీసు ప్రొవైడర్లు ఒప్పందాలు కుదుర్చుకోకుండా నిషేధం విధించాలి. ♦ అయితే, ఈ వివక్షరహిత ఇంటర్నెట్ విధానం విషయంలో కొన్ని ‘ప్రత్యేక సర్వీసు’లకు మినహాయింపు ఇవ్వొచ్చు. ముఖ్యంగా చాలా కీలకమైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఎలక్ట్రా నిక్ ఉపకరణాలను ఇంటర్నెట్తో అనుసంధానించడం) సేవల విషయంలో నిబంధనల సడలింపు అవసరం. డ్రైవర్‌లెస్ కార్లు, టెలీ–సర్జరీ వంటి సేవలు దీనికిందికి వస్తాయి. ♦ నెట్ న్యూట్రాలిటీని కచ్చితంగా అమలుచేయాలంటే దేశంలో ఇంటర్నెట్ సర్వీసులకు సంబంధించిన లైసెన్స్ ఒప్పందాల నిబంధనల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నిబంధనల్లో సమానత్వానికి కూడా దోహదం చేస్తుంది. ♦ కొత్త నిబంధనల పర్యవేక్షణతోపాటు ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు టెలికం శాఖ ఒక బహుళపక్ష మండలిని ఏర్పాటు చేయాలి. దీనిలో టెలికం ఆపరేటర్లు, ఐఎస్పీలు, కంటెంట్ ప్రొవైడర్లు, సామాజిక సంస్థలు, వినియోగదారులకు ప్రతినిధులకు చోటు కల్పించాలి. ♦ టెలికం అపరేటర్లు తమ వెబ్ ట్రాఫిక్ నిర్వహణ విధానాలను ప్రకటించాల్సి ఉంటుంది. అదేవిధంగా యూజర్లపై దాని ప్రభావం వంటి అంశాలనూ వెల్లడించాలి. ప్రత్యేక సేవలు, కంటెంట్ ప్రొవైడర్లతో కుదుర్చుకునే ప్రత్యక్ష, పరోక్ష ఒప్పందాలు వంటివన్నీ బహిర్గతపరచాలి. సమానత్వం తప్పనిసరి... ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ న్యూఢిల్లీ: ఇంటర్నెట్ అనేది దేశాభివృద్ధితో ముడిపడిన అత్యంత ముఖ్యమైన వేదిక అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, సమానత్వంతో కూడిన ఇంటర్నెట్ సేవల కల్పనకు ఆయన పిలుపునిచ్చారు. ‘ఇంటర్నెట్ ఒకరిసొత్తుకాదు. ఇదొక బహిరంగ వేదిక. అందరికీ ఒకేవిధమైన సేవలు లభించాలి. అంతేకానీ, ఒకరినొకరు అంతంచేసుకునే(క్యానిబలైజ్డ్) విధంగా వ్యవహరించడం మంచిదికాదు. సర్వీసు ప్రొవైడర్లు ఇంటర్నెట్పై నియంత్రణలు(గేట్ కీపింగ్) విధించకూడదు’ అని శర్మ వ్యాఖ్యానించారు. వినూత్నతల ఆవిష్కరణ(ఇన్నోవేషన్), స్టార్టప్‌లు, ఆన్లైన్ లావాదేవీలు, విభిన్న ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రామ్ సాకారం కావడంలో ఇంటర్నెట్ ప్రధాన భూమిక పోషిస్తోందని.. ఇటువంటి వేదికపై వివక్షకు తావుండకూడదని ఆయన పేర్కొన్నారు. కాగా, నెట్ న్యూట్రాలిటీకి మీరు(ట్రాయ్) మద్దతుగా నిలుస్తుంటే.. అమెరికా నియంత్రణ సంస్థ మాత్రం 2015 నాటి నిబంధనలను రద్దుచేయనుండటంపై అడిగిన ప్రశ్నకు.. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా ట్రాయ్ మార్గదర్శకాలు, సూచనలను రూపొందిస్తోందని బదులిచ్చారు. ‘దేశంలో 130 కోట్ల జనాబాలో 50 కోట్ల మంది నెట్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా ఎన్నో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో దీన్ని వివక్షరహితంగా ఉంచడం చాలా కీలకం. టెలికం, ఐఎస్పీ నెట్‌వర్క్‌లు కంటెంట్ యాక్సెస్ విషయంలో తటస్థంగా వ్యవహరించాల్సిందే’ అని శర్మ స్పష్టం చేశారు. కాగా, నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ తాజా కార్యాచరణ ప్రణాళిక ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందన్న ప్రశ్నపై స్పందించేందుకు శర్మ నిరాకరించారు. లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానాలు ఉంటాయని.. అంతేకానీ, నెట్ న్యూట్రాలిటీ నియమాల ఉల్లంఘనకు ప్రత్యేకంగా జరిమానాలను ట్రాయ్ ప్రతిపాదించలేదని పేర్కొన్నారు. ఇక ఓవర్ ద టాప్(ఓటీటీ– అంటే నెట్ ద్వారా వాయిస్, వీడియో కాల్స్ వంటివి) సేవలపై కూడా త్వరలోనే ట్రాయ్ చర్చా పత్రాన్ని విడుదల చేయనుంది. నెట్ న్యూట్రాలిటీ అంటే... ఇంటర్నెట్ ద్వారా యూజర్లు చూసే, వాడుకునే కంటెంట్ విషయంలో సర్వీసు ప్రొవైడర్లు(టెలికం సంస్థలు, ఐఎస్పీలు ఇతరత్రా) వివక్ష చూపకుండా సమానత్వాన్ని పాటించడమే నెట్ న్యూట్రాలిటీ. అంటే కొన్ని కంటెంట్ ప్రొవైడర్ల సేవలను(వెబ్సైట్లు, యాప్‌ల వంటివి) ఎలాంటి డేటా చార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా అందించడం, మిగతావాటికి చార్జీలు వసూలు చేయడం లేదంటే కొన్ని వెబ్సైట్లకు అధిక స్పీడ్, మరికొన్నింటికి తక్కువ స్పీడ్‌తో వచ్చేవిధంగా చేయడం వంటి అసమానతలు లేకుండా చూడటమే నెట్ న్యూట్రాలిటీ ప్రధానోద్దేశం. రెండేళ్ల క్రితం ఫేస్బుక్ తన కంటెంట్‌ను ఎలాంటి డేటా చార్జీలు లేకుండా ఉచితంగా అందించేందుకు టెలికం ఆపరేటర్లతో ఒప్పందం చేసుకోవడంతో గగ్గోలు మొదలైంది. మిగతా కంటెంట్ ప్రొవైడర్ల నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో నెట్ న్యూట్రాలిటీపై దేశవ్యాప్తంగా చర్చమొదలైంది. అదేవిధంగా ఎయిర్టెల్ కూడా ‘ఎయిర్టెల్ జీరో’ పేరుతో కొన్ని ఎంపిక చేసిన వెబ్సైట్లను డేటా చార్జీల్లేకుండా ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గతేడాది ఫిబ్రవరిలో ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతుగా ఫేస్‌బుక్‌కు సంబంధించిన ‘ఇంటర్నెట్.ఆర్గ్’, ‘ఎయిర్టెల్ జీరో’ వంటి ప్లాట్‌ఫామ్స్‌ను నిషేధించింది. కాగా, ఇంటర్నెట్ ఆధారిత యాప్‌ల ద్వారా దేశీయంగా వాయిస్ కాల్స్(వాట్సాప్, స్కైప్ వంటివి)పై నియంత్రణ ఉండాలని, ఈ సేవలను టెలికం ఆపరేటర్ల సర్వీసుల కిందే పరిగణించాలన్న ట్రాయ్ ప్రతిపాదనలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివిధ పరిశ్రమ సంఘాలు, సామాజికవేత్తలు దీనిపై నిరసన గళం వినిపించారు కూడా. తలోమాట.. ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీ సిఫారసులపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. వెబ్ ద్వారా అనియంత్రిత సేవలు, కంటెంట్ పొందేందుకు ట్రాయ్ సిఫారసులు ఉపకరిస్తాయని ఇంటర్నెట్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ అంశానికి ట్రాయ్ నామమాత్రపు నిర్వచనమే ఇచ్చినట్టు టెలికం ఆపరేటర్లు పేర్కొనడం గమనార్హం. దేశంలో ఇంకా నెట్ అందుబాటు లేని వారిని కనెక్ట్ చేసేందుకు ఉద్దేశించిన అంశాలను ట్రాయ్ పరిష్కరించలేదని... అలాగే, కాల్స్, మెస్సేజ్‌లకు వీలు కల్పిస్తున్న వాట్సాప్, స్కైప్, వైబర్, గూగుల్ డ్యుయో వంటి యాప్స్‌కు లైసెన్సింగ్పైనా మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తమైంది. దేశంలో ఇంకా సేవలు అందని 100 కోట్ల ప్రజలను కనెక్ట్ చేసేందుకు వీలుగా నెట్ న్యూట్రాలిటీపై మేము మరింత విస్తృత విధానాన్ని సూచించాం. ఈ విధానం దేశ అవసరాలకు అనుగుణంగానే ఉండాలి. కానీ, ట్రాయ్ మాత్రం పరిమిత విధానాన్నే సూచించింది. సిఫారసులను ఇంకా అధ్యయనం చేస్తున్నాం. తర్వాత మా అభిప్రాయాలను వివరంగా తెలియచేస్తాం. – రాజన్ ఎస్ మాథ్యూస్, సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ప్రగతిదాయక, ఆచరణాత్మక సిఫా రసులు ఇవి. దేశంలో డిజిటల్ సేవల విస్తరణ అవసరాలను గుర్తించినట్టయింది. ఇంటర్నెట్ అన్నది చైనా, అమెరికా మాదిరిగా కాకుండా ఉచితంగా, స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యపు సూత్రాలకు అనుగుణంగా ఉండాలి. సిఫారసులపై ప్రభుత్వం వేగంగా స్పందించాలి. – ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్‌లను నెట్న్యూట్రాలిటీ నియంత్రణల నుంచి మినహాయించాలంటూ ట్రాయ్ సూచించినందున రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరం. ఇవి ఇప్పటికే కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లుగా ఉన్నాయి. – ఎడెల్వీజ్ రిపోర్ట్ -
నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు, శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఆదివారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గతేడాది భద్రత దళాలు హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీని ఎన్ కౌంటర్లో చంపడాన్ని నిరసిస్తూ శ్రీనగర్ పీడీపీ ఎంపీ తారిఖ్ హమీద్ కర్రా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండటంతో భద్రత చర్యల్లో భాగంగా ఈ రోజు శ్రీనగర్, బుద్గాం, గండర్బాల్ జిల్లాలలో అన్ని ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. ఈ నెల 13న అసెంబ్లీ స్థానాలలో, 15న శ్రీనగర్ లోక్ సభ స్థానంలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాలివే.. రాజౌరి గార్డెన్ (ఢిల్లీ) లిటిపర (జార్ఖండ్) నంజన్గూడ్, గుండ్లుపేట్ (కర్ణాటక) దోల్పూర్ (రాజస్థాన్) కాంతి దక్షిణ్ (పశ్చిమ బెంగాల్) అటర్, బందవ్‌గఢ్ (మధ్యప్రదేశ్) భోరంజ్ (హిమాచల్ ప్రదేశ్) దీమాయి (అసోం) -
గ్రామస్థాయి నుంచి ఇంటర్నెట్ సేవలు
కోవూరు: గ్రామస్థాయి నుంచి ఇంటర్నెట్ సేవలు నిర్వహించాలన్న ఆలోచన తలంపుతోనే సాతి ప్రోగామ్ కింద పొదుపు సంఘాల సభ్యులకు ఇంటర్నెట్లో శిక్షణ ఇస్తున్నామని డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి పేర్కొన్నారు. స్థానిక సంఘమిత్ర కార్యాలయంలో గురువారం డిజిటల్ లిట్రసీ ప్రోగామ్‌ను ఆమె జిల్లాలో తొలిసారిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ అవసరాలతో పాటు సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలన్న లక్ష్యంతో డిజిటల్ లిట్రసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. జిల్లాలో 8 కేంద్రాలు గుర్తించామన్నారు. 244 ఇంటర్నెట్ సాతిలను తయారుచేసి వీరి ద్వారా 3.60 లక్షల మంది పొదుపు సంఘాల సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వీరందరికీ ఇంటర్నెట్లపై పట్టు సాధించే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏదైనా ఒక వస్తువును తయారుచేసి దానికి సరైన మార్కెటింగ్ చూపించడంలో ఇంటర్నెట్ ఎంతో కీలకభూమిక పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమం మూడు నెలల పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాతి ప్రాజెక్ట్ మేనేజర్ రాజు, శ్రీనివాసరావు, ఎంపీడీవో జాలిరెడ్డి, ఎంఈవో జగన్నాథశర్మ, ఏసీ కనుపూరు శ్రీనివాసులు, కోవూరు, కొడవలూరు, విడవలూరు, సంగం, అల్లూరు మండలాల ఏపీఎంలు, సంఘమిత్ర అధ్యక్ష, కార్యదర్శులు కలిచేటి కృపావతి, సుగుణమ్మ, సీసీలు పాల్గొన్నారు. అనంతరం సాతి కో ఆర్డినేటర్లకు స్మార్ట్ ఫోన్‌తో పాటు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. -
గుజరాత్ సరికొత్త నిర్ణయం
గాంధీనగర్: పంచాయతీ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు రాకుండా నివారించేందుకు గుజరాత్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న పంచాయత్ సేవా మండల్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షా సమయంలో నాలుగు గంటల పాటు ఇంటర్నెట్ పనిచేయదని రాష్ట్ర సర్కారు ప్రకటించింది. టెక్నాలజీని ఉపయోగించుకుని పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంచాయత్ సేవా మండల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేస్తోంది. -
తటస్థతే విజేత!
భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రవహించే సమా చారాన్ని అంతరాల దొంతరల్లో బంధించి దాన్ని దారీ తెన్నూ లేకుండా చేయాలను కున్నవారు ఓటమిపాలయ్యారు. సర్వ స్వతంత్రమైన, స్వేచ్ఛాపూరితమైన ఇంటర్నెట్ వ్యవస్థ కోసం ఉద్యమించినవారికే అంతిమ విజయం దక్కింది. ఇంటర్నెట్ సేవల్లో వివక్షాపూరిత విధానాలు చెల్లవని టెలికాం నియంత్రణా వ్యవస్థ ట్రాయ్ సోమవారం తేల్చిచెప్పింది. వర్తమానకాలంలో ఇంటర్నెట్ ఒక వ్యసనంగా, నిత్యావసరంగా పరిణమించడం కాదనలేని సత్యం. ఫేస్బుక్, గూగుల్, ట్విటర్ వంటి సంస్థలు చూస్తుండగానే లక్షల కోట్లకు పడగలెత్తడం ఇందువల్లే. కొన్ని ఎత్తుగడలతో ఈ లాభాలను మరిన్ని వందల రెట్లు పెంచుకోవచ్చునని ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భావించిన పర్యవసానంగా ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ ఆవిర్భవించింది. అవసరమైన కొన్ని వెబ్సైట్లను ఉచితంగా అందించ డమే దీని ప్రధానోద్దేశమంటూ ఊరించి తీసుకొచ్చిన ఈ కొత్త ఆలోచనను ఆదిలోనే అందరూ తిప్పికొట్టారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదన్న ఉద్యమం బయ ల్దేరింది. భారత్‌లో ‘ఉచితం’ అని పేరు పెడితే ఎలాంటి అనుచిత విధానాన్నయినా చలామణి చేయడం సాధ్యమన్న ఆలోచనతో కావొచ్చు... ఈమధ్యే ‘ఫ్రీ బేసిక్స్’ పేరిట ఫేస్బుక్ వివిధ రకాల మాధ్యమాల్లో వాణిజ్య ప్రకటనలతో హోరెత్తించింది. అందుకు వందలాది కోట్లు ఖర్చు చేసింది. ఇంటర్నెట్కు విధించాలనుకుంటున్న పరిమితులకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి చేసిన ఈ ప్రయత్నం కొంతమేర సఫలమైంది కూడా. ఈ పోకడలపై దృష్టి సారించి, దీనిపై ఒక విధానాన్ని ప్రకటించే పనిలో నిమగ్నమైన ట్రాయ్‌కు ‘ఫ్రీ బేసిక్స్’ను ఆమోదించే లక్షలాది సందేశాలు చేరాయి. అయితే తమ పరిశీలన ఇంటర్నెట్కు పరిమితులు ఉండవచ్చునా లేదా అన్న అంశంపైనే తప్ప... ‘ఫ్రీ బేసిక్స్’ అనుకూల, వ్యతిరేక అభిప్రాయాల సేకరణకు కాదని ట్రాయ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పి గాలి తీసింది. ట్రాయ్ వెలువరించిన నిర్ణయం ఇటీవలికాలంలో ఎన్నదగినది. ఇంటర్నెట్లో లభించే డేటాకు దాని అవసరాన్నిబట్టి వేర్వేరు ధరలు నిర్ణయించి వసూలు చేయొచ్చునన్నది ‘ఫ్రీ బేసిక్స్’లోని ఆంతర్యం. ఒకవైపు ఉచితం అంటూనే అటు వినియోగదారుడినుంచీ, ఇటు వెబ్సైట్ సంస్థనుంచీ ఏకకాలంలో డబ్బు గుంజడం ఈ విధానంలో కీలకాంశం. ఫలితంగా వారు డిమాండ్ చేసిన సొమ్ము చెల్లించగల సంస్థలు సైబర్ ప్రపంచంలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వెలగబెడతాయి. ఆ వెబ్సైట్లే వినియోగదారులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. అలాగే టెలికాం సంస్థలు అడిగిన మేర చెల్లించగలిగే వినియోగదారులకే నిర్దేశిత వెబ్సైట్ లభ్యమవు తుంది. మిగిలినవారికి అది తెరుచుకోదు. మరోవిధంగా చెప్పాలంటే మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే ‘వీఐపీ సంస్కృతి’ ఇంటర్నెట్లో చొరబడుతుంది. డబ్బుతో ధగధగలాడే సంస్థలు మెరుపు వేగంతో వినియోగదారులకు చేరతాయి. అది సాధ్య పడని సంస్థలు మందగమనంతో మిగిలిపోతాయి. వినియోగదారులకు ఎంతకీ తెరుచుకోవు. ఇప్పుడు స్కైప్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఉచితంగా లభించే సేవలు కొనుక్కోవడం తప్పనిసరవుతుంది. ఇప్పుడున్న పద్ధతి ప్రకారం ఇంటర్నెట్లో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అన్ని రకాల డేటా అందరికీ అందుబాటులో ఉంటున్నది. అందువల్ల ప్రపంచంలో ఏమూలనున్నవారైనా తమ అభిప్రాయా లనూ, ఆలోచనలనూ, ఉద్దేశాలనూ స్వేచ్ఛగా ప్రపంచం ముందు ఉంచగలుగుతు న్నారు. ఏ అన్యాయమైనా, అక్రమమైనా జనం ముందు... దృశ్యరూపంలో కావొచ్చు, అక్షరాల్లో కావొచ్చు క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. వారిలో ఆగ్రహావేశా లను రగిలిస్తున్నది. వారిని కార్యాచరణకు పురిగొల్పుతున్నది. ఔత్సాహికులెందరో తమ సృజనాత్మకతను చాటి లబ్ధిపొందుతున్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారు సైతం అందరికీ చేరువకాగలుగుతున్నారు. వివిధ రకాల ధరవరలు నిర్ణయిం చడంవల్ల ఇలాంటివన్నీ సామాన్య పౌరులకు దూరమవుతాయి. డబ్బే దేన్నయినా నిర్దేశిస్తుంది. ఈ ప్రమాదాన్ని ట్రాయ్ తాజా నిర్ణయం నివారించగలిగింది. పౌరులు అప్రమత్తంగా లేకుంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. నిరుడు జనవరిలో ఒకరిద్దరు ప్రారంభించిన ‘తటస్థ ఇంటర్నెట్’ ఉద్యమం చూస్తుండగానే నలువైపులా విస్తరించింది. ఈ సైబర్ ఉద్యమకారులు ఎప్పుడూ ఒకచోట కలుసుకు న్నది లేదు. డాక్టర్లు, న్యాయవాదులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ నిపుణులు, పాత్రికేయులు, కళాకారులు, రచయితలు... ఇంకా ఎందరెందరో తమ తమ వృత్తులను కొనసాగిస్తూనే తటస్థ ఇంటర్నెట్ అవసరాన్ని అందరికీ అర్ధమ య్యేలా విశదీకరించారు. అందులో పొంచివున్న ప్రమాదాలను విప్పిచెప్పారు. ఇప్పటికైతే ఇది సెల్ఫోన్లకే, అందులో వాడే యాప్‌లకే పరిమితమైనా...చాలా త్వరగానే అన్నిటిలోకీ చొచ్చుకొచ్చి సమాచార ప్రసారానికి గుదిబండలా మారు తుందని వివరించగలిగారు. అందువల్ల కలిగే నష్టాలను విప్పిచెప్పారు. ఇంట ర్నెట్‌కు ఖరీదు కట్టే షరాబులొస్తే ఏమవుతుందో ఎవరికి తోచిన రూపాల్లో వారు చెప్పారు. వీడియోల ద్వారా, కార్టూన్లద్వారా చైతన్యం తెచ్చారు. ఈ ఉద్య మంలో అందరూ కార్యకర్తలే. నాయకులు లేరు. ఇంతమంది ఇన్నివిధాల చేయబట్టే... అన్నివైపులనుంచీ తీవ్ర వ్యతిరేకత రాబట్టే ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకోగలిగింది. మన దేశంలో సాగిన తటస్థ ఇంటర్నెట్ ఉద్యమం అమెరికా, యూరప్ దేశాల పౌరుల్లో కూడా పునరాలోచన తీసుకురాగలిగింది. ఆ విషయంలో తమ ప్రభు త్వాలు తీసుకున్న నిర్ణయాలను మార్చేలా అక్కడ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ట్రాయ్ నిబంధనల ప్రకారం తటస్థ ఇంటర్నెట్కు భిన్నంగా వ్యవహరించే సంస్థలకు రోజుకు రూ. 50,000 నుంచి రూ. 50 లక్షల వరకూ జరిమానా విధించే వీలుంటుంది. ఇంటర్నెట్లో లభించే ఏ రకం డేటాకైనా వివిధ రకాల టారిఫ్‌లు ఉండరాదని ట్రాయ్ తాజా నిబంధనావళి స్పష్టం చేస్తున్నది. అయితే అవసరమైన సందర్భాల్లో సర్వీసు ప్రొవైడర్లు కొన్ని సేవలకు టారిఫ్‌ను తగ్గించ వచ్చునని చెబుతోంది. ట్రాయ్ తీర్పు శృంఖలాలులేని ఇంటర్నెట్ను కోరుకునేవారి విజయం. భావప్రకటనాస్వేచ్ఛను గౌరవించేవారందరి విజయం. అప్రమత్తంగా ఉంటే ఎలాంటి అక్రమాన్నయినా అడ్డుకోవచ్చునని ఈ విజయం నిరూపించింది. -
మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు బంద్
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల వల్ల అపార నష్టం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 197కు పెరిగింది. చెన్నై సహా చాలా ప్రాంతాల్లో మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వరదల వల్ల జనజీవనం స్తంబించిపోయిన నేపథ్యంలో కొన్ని టెలీకాం సంస్థలు తమ వినియోగదారులకు అండగా నిలిచాయి. ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు 'టాక్ టైమ్', ఒకే టెలీకాం సర్వీసులకు ఉచిత కాల్స్, మొబైల్ డాటాను పరిమిత స్థాయిలో అందించాయి. భారీ వర్షాల వల్ల చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఎటూ చూసిన జలమయమే. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. తమిళనాడులో వరదల పరస్థితిలో బుధవారం లోక్‌సభలో చర్చించి.. ఆ రాష్ట్రానికి అండగా ఉంటమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
ఇంటర్నెట్.. స్పేస్ టు హోమ్
ఓవైపు స్మార్ట్‌ఫోన్ యుగం మొదలైంది. మరోవైపు ప్రపంచంలో మూడొంతుల మందికి ఇంటర్నెట్టే ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుకే అంతరిక్షంలో ఉపగ్రహాలను మోహరించి భూమిపై అన్ని ప్రాంతాల వారికీ ఇంటర్నెట్ అందేలా చేసేందుకు స్పేస్ఎక్స్, గూగుల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఆకాశంలో డ్రోన్లను విహరింపజేస్తూ ఇంటర్నెట్ను ప్రసారం చేసేందుకు ఫేస్బుక్ కూడా ప్రాజెక్టును చేపట్టింది. అయితే, వీటన్నిటికన్నా ముందే అంతరిక్ష ఇంటర్నెట్ వచ్చేసింది! ఇంటర్నెట్కు దూరంగా మారుమూలల్లో ఉన్న 300 కోట్ల మంది కోసం 12 ఉపగ్రహాలతో ‘ఓ3బీ నెట్వర్క్స్’ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా అంతరిక్ష ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది! ఓ3బీ అంటే.. ద అదర్ 3 బిలియన్. అంటే ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని ‘ఇతర 300 కోట్ల మంది ప్రజల’ కోసం అన్నమాట. భూమి చుట్టూ 8 వేల కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతూ సిగ్నళ్లను ప్రసారం చేసే 12 ఉపగ్రహాలను ఓ3బీ నెట్వర్క్స్ మోహరించింది. కొన్ని నెలలుగా ప్రధానంగా భూమధ్య రేఖాప్రాంతంలోని దేశాలు, దీవులకు ఈ ఇంటర్నెట్ సేవ లను అందిస్తోంది. ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌మాదిరిగానే వేగవంతమైన ఇంటర్నెట్ను చవకగానే అందించడం దీని ప్రత్యేకత. గూగుల్, హెచ్ఎస్బీసీ వంటి అనేక సంస్థల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శాటిలైట్ నెట్వర్క్ నుంచి భూగోళంపై 70 శాతం ప్రాంతాలు కవర్ అవుతాయని, మరో 8 ఉపగ్రహాలను మోహరించేందుకూ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ3బీ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు గ్రెగ్ వీలర్ వెల్లడించారు. భారతీ ఎయిర్టెల్ వంటి 21 కంపెనీలతో ఇదివరకే ఒప్పందాలు ఖరారయ్యాయని, మరో 20 కంపెనీలతో ఒప్పందాలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇవీ ‘ఓ3బీ’ ప్రత్యేకతలు.. ⇒ అంతరిక్షం నుంచి ఇంటర్నెట్ను అందిస్తున్న తొలి కంపెనీ ఇదే. ⇒ స్కూళ్లు, ఆస్పత్రులు, కార్యాలయాలకు 200-500 డాలర్లకే శాటిలైట్ సిగ్నళ్లను స్వీకరించే టెర్మినల్‌ను ఓ3బీ అందిస్తోంది. ⇒ పెద్ద కంపెనీలకు మరింత ఎక్కువ ధరకు పెద్ద యాంటెన్నాలను సమకూరుస్తోంది. ⇒ అంతరాయాలు లేకుండానే వేగవంతమైన మొబైల్, ఇంటర్నెట్ సేవలను కల్పిస్తోంది. ⇒ ప్రస్తుత ఇంటర్నెట్ సేవల ఖర్చుతో పోల్చితే ఓ3బీ సేవలు చవకే. ⇒ మొబైల్ సేవలకు ‘ఓ3బీ సెల్’, టెలికం కంపెనీల కోసం ‘ఓ3బీ ట్రంక్’, సముద్రప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు ‘ఓ3బీ మారీటైమ్’, ప్రభుత్వ సంస్థల కోసం ‘ఓ3బీ గవర్నమెంట్’ సర్వీసులను అందిస్తోంది. -
ఇక యాక్ట్ ఫైబర్ వైఫై జోన్లు
డిసెంబర్‌కల్లా హైదరాబాద్ అంతటా - ఏప్రిల్ నుంచి వైజాగ్‌లో ఇంటర్నెట్ సేవలు - 3-5 ఏళ్లలో మరో రూ. 2,000 కోట్ల పెట్టుబడి - ఇక నుంచి యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు: బీమ్ టెలీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీమ్ టెలీ పేరిట బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలందిస్తున్న బీమ్ ఫైబర్ పేరు మారింది. యాక్ట్ ఫైబర్‌నెట్‌గా పేరు మార్చుకున్న ఈ సంస్థ... వైఫై జోన్లను ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో తొలిసారిగా వైఫై జోన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం అనుమతిస్తే డిసెంబర్‌కల్లా హైదరాబాద్‌లో ఈ జోన్లను అందుబాటులోకి తేనుంది. వినియోగదార్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ జోన్ల ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్ను అందిస్తామని యాక్ట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఎండీ సి.ఎస్.సుందర్ రాజు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తామని, తమ సేవలతో దేశంలో సంచలనం సృష్టిస్తామని తెలిపారు. సోమవారమిక్కడ సంస్థ సీఈఓ బాల మల్లాది, ఇండియా వా ల్యూ ఫండ్ పార్ట్నర్ ప్రమోద్ కోబ్రతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీపై భారీగా వెచ్చిస్తున్నామని, దేశంలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తున్నామని తెలియజేశారు. ఏటా ఒక నగరం.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీమ్‌ను బెంగళూరు కంపెనీ యాక్ట్ గ్రూప్ ప్రమోట్ చేస్తోంది. యాక్ట్‌లో మెజారిటీ వాటా ఇండియా వాల్యూ ఫండ్‌కు (ఐవీఎఫ్) ఉంది. బెంగళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, ఏలూరులో యాక్ట్ పేరుతో, హైదరాబాద్‌లో బీమ్ బ్రాండ్‌తో బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ఉంది. ఇక నుంచి దేశవ్యాప్తంగా యాక్ట్ ఫైబర్‌నెట్‌గా సేవలందించనుంది. ఏప్రిల్‌లో వైజాగ్‌లో ప్రవేశించటంతో పాటు సంస్థ ఏటా ఒక ప్రధాన నగరంలో అడుగు పెట్టనున్నట్లు గ్రూప్ సీఈవో బాల మల్లాది చెప్పారు. ఇప్పటికే రూ.1,000 కోట్లు వ్యయం చేశామని, 3-5 ఏళ్లలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. మూడేళ్లుగా పరిశ్రమ వృద్ధి 3 శాతమైతే, యాక్ట్ 43 శాతం వృద్ధి నమోదు చేసిందని ప్రమోద్ కోబ్ర తెలిపారు. దక్షిణాదికే బ్రాండ్ పరిమితమైనప్పటికీ, వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో భారత్‌లో బీఎస్ఎన్ఎల్, భారతి ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్ తర్వాతి స్థానం యాక్ట్దేనని ఆయన చెప్పారు. 100 ఎంబీపీఎస్ స్పీడ్.. రిటైల్ కస్టమర్ల కోసం ఇన్క్రెడిబుల్ 100 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను యాక్ట్ ఫైబర్‌నెట్ ప్రకటించింది. నెలవారీ చార్జీ రూ.2,799తో 200 జీబీ డేటా ఉచితంగా అందిస్తారు. అలాగే కంపెనీల కోసం 1 టీబీ డేటా లిమిట్‌తో 250 ఎంబీపీఎస్ స్పీడ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. నెలవారీ చార్జీ రూ.4 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఈ స్పీడ్‌తో ప్యాక్‌లు రావడం భారత్‌లో తొలిసారి. కాగా, యాక్ట్ గ్రూప్‌కు 6.5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షనుండగా వీటిలో హెదరాబాద్లో 4.5 లక్షలున్నాయి. నెలకు 20 వేల కొత్త కనెక్షన్లు వస్తున్నాయి. కనెక్షన్లను ఈ ఏడాదిలో 10 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. -
వచ్చేస్తోంది.. 4G
- ఇక అత్యంత వేగంగా ఇంటర్నెట్ సేవలు - నగరంలో అందుబాటులో 4జీ సపోర్టెడ్ మొబైల్స్ - ఏర్పాట్లు చేసుకుంటున్న కంపెనీలు కరీంనగర్ బిజినెస్: అత్యంత వేగవంతంగా ఇంటర్నెట్ సేవలు... కాపీ చేసి పేస్ట్ చేసినంత ఈజీగా డౌన్లోడింగ్స్.. ప్రస్తుతం ఉన్న 2జీ, 3జీ కంటే పది రేట్లు స్పీడ్ కనెక్టివిటీ... చాటింగ్, మెయిలింగ్, బ్రౌజింగ్ స్థానంలోకి దూసుకురానున్న వీడియో కాలింగ్... ఇవన్నీ కూడా అతి తక్కువ నామమాత్రపు ధరకే.. ఇది వినడానికే అద్భుతంగా ఉంది కదూ.. 4జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇవన్నీ నిజం కానున్నాయి. కరీంనగర్లో ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి. జీపీఆర్ఎస్ నుంచి 4జీ వరకు... సెల్‌ఫోన్ అనగానే ఎంఎంఎస్‌లు పంపే జీపీఆర్ఎస్ సేవలు ఉండేవి. ఆ తర్వాత 2జీ ఎడ్జ్, 3జీ రావడంతో ఫేస్బుక్, గూగుల్ ప్లస్, వాట్సప్ వంటి మెసేజ్ చాటింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. 3జీ బ్యాండ్‌విడ్త్ సేవలతో స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల అప్లికేషన్లు హల్చల్ చేస్తున్నాయి. నగరంలోకి 4జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలుండడంతో బాండ్విడ్త్ కనెక్టివిటీ మరింత పెరగడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్లైన్ సేవల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. 4జీతో...క్రేజీగా... 2జీ మొన్నటి మాట...3జీ నిన్నటి మాట.. మరింత స్పీడ్‌తో ఇంటర్నెట్ సౌకర్యం అందించే 4జీ సేవలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. నగరంలోనూ త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని యూత్ ఎదురుచూస్తున్నారు. 2జీ కనెక్టివిటితో అప్లోడింగ్ 20 కేబీపీఎస్ నుంచి 40 కేబీపీఎస్, డౌన్లోడింగ్ 40 కేబీపీఎస్ నుంచి 3జీతో 128 కేబీపీఎస్ నుంచి 512 కేబీపీఎస్ అప్లోడింగ్, డౌన్లోడింగ్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. 4జీ సేవలు ప్రారంభమైతే త్రీజీకీ పదిరేట్లు కనెక్టివిటీ బ్యాండ్‌విడ్త్ అందుబాటులోకి వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న 1ఎంబీపీఎస్, 10ఎంబీపీఎస్ అనేది నిన్నటి మాటగానే మారిపోతుంది. ఏకంగా 128 ఎంబీపీఎస్ నుంచి 256 ఎంబీపీఎస్ వరకు కనెక్టివిటీ పెరుగుతుంది. వీడియో కాలింగ్, ఆన్లైన్ గే మ్స్, ఆన్లైన్ షోలు, వీడియో చాటింగ్ ఎంతో నాణ్యతతో అతితక్కువ ధరకే అందుబాటులో లభిస్తాయి. విదేశాల్లో ఉండే వారితో నేరుగా చూస్తూ మాట్లాడే సౌకర్యం మున్ముందు ఉంటుంది. త్రీడీ మానిటర్లో అరుుతే పక్కపక్కన కూర్చొని మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఆపరేటర్ల హంగామా... వైర్లెస్ ఇంటర్నెట్ సేవలందించే పలువురు ఆపరేటర్లు ఇప్పటికే 2జీ, 3జీ డాంగిల్స్‌ను వివిధ ఆఫర్లతో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్, యునినార్, ఎయిర్‌సెల్ వంటి ఆపరేటింగ్ సేవలందిస్తున్న సంస్థలు 4జీ సేవల ప్రత్యేకంగా రూపొందించే డాంగిల్స్‌ను రూ.1500 నుంచి రూ.3వేలకు పైగా ఉండేలా అందుబాటులోకి తేనున్నాయి. శామ్సంగ్, సోనీ ఇరి క్సన్, హెచ్‌టీసీ, యాపిల్ వంటి సంస్థలు అ డ్వాన్స్ వెర్షన్‌తో 4జీ మొబైల్స్‌ను అందుబాటులోకి తెచ్చేశాయి. ఆండ్రాయిడ్ కూడా మరింత అధునాతనైమైన ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం నగరంలో 4జీ సఫోర్ట్ చేసేలా ఫోన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. కొత్త స్పీడ్లోకాన్ని చూడబోతున్నాం ప్రస్తుతం 2జీ, 3జీ మార్కెట్లో నడుస్తున్నాయి. చాలా సేవల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలో రోజురోజుకు ఇంటర్నెట్ వాడేవారు ఎక్కువవుతున్నారు. ప్రభుత్వం కూడా అప్లికేషన్లు, సర్టిఫికెట్లు అన్నీ నెట్‌పై ఆధారపడి ఉంటున్నాయి. ప్రస్తుతం పలు కంపెనీలకు చెందిన 4జీ మొబైల్ ఫోన్లు మా స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. - మహిపాల్‌రెడ్డి, లాట్ మొబైల్‌స్టోర్ మేనేజర్ -
మొబైల్ ముప్పు
సెల్‌ఫోన్.. ఈ రోజుల్లో ఉపయోగించని వారంటూ ఉండరు. ప్రతి పదిమందిలో ఎనిమిది మంది సెల్‌ఫోన్ వాడుతున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆండ్రాయిడ్ రంగప్రవేశంతో ఫోన్ల వాడకం మరింత పెరిగింది. గంటల కొద్ది చాటింగ్, షేరింగ్, వాయిస్ చాట్ ఇలాంటివన్ని నిత్యకృత్యమైపోయాయి. ఇక గేమ్స్.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫోన్లలో ఏ ఆటైనా ఆడేందుకు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడుతున్నారు. మరోవైపు 2జీ, 3జీ వంటి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ తతంగమంతా ఒకవైపు నుంచి చూస్తే సరదాగాను.. ఓ ప్రత్యేక హోదాగాను కనిపిస్తుంది. కానీ ఫోన్ ఎంత వినియోగిస్తే అంతగా ఆరోగ్యానికి చిల్లు పడుతుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వినియోగం శృతిమించితే ఇబ్బందులు తప్పవు. ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మొబైల్లో దాగి ఉండే బ్యాక్టీరియాతో పలు చర్మవ్యాధులు పొంచి ఉన్నాయని, తగు జాగ్రత్తలు తీసుకోనట్లయితే అవి సోకే ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. - న్యూఢిల్లీ న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌తో ఎంతమేలు జరుగుతుందో.. అంతకు మించిన కీడు ఉందని వైద్యనిపుణులు అంటున్నారు. మనిషి అనునిత్యం వెంట పెట్టుకుని తిరిగే మొబైల్‌ఫోన్ బ్యాక్టీరియాకు అడ్డా అని, ఫలితంగా మనకు తెలియకుండానే చర్మవ్యాధులు, కేన్సర్, మతిమరుపు, మెదడు, చెవికి సంబంధించిన వ్యాధులు సోకే ఆస్కారం ఉందని అంటున్నారు. స్టైప్టోకొకి, స్టాఫిలొకొకి, ఈకోలి అనే బ్యాక్టీరియా, కాంటాక్ట్ డెర్మటిస్ అనే స్కిన్ అలర్జీ వ్యాపించే అవకాశాలున్నాయి. రకరకాల చర్మవ్యాధులు.. టచ్‌స్క్రీన్, కీప్యాడ్లపై ఎన్నో రకాల సూక్ష్మ జీవులుంటాయి. అవన్నీ చేతివేళ్లపైకి, బుగ్గలపైకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ రకాల చర్మవ్యాధులు తలెత్తుతాయి. బుగ్గలు, చెవుల వద్ద బొబ్బలు రావడానికి ఈ మొబైల్ ఫోన్లే కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక సెల్ఫోన్లు చెవి వద్ద పెట్టుకుని గంటల తరబడి మాట్లాడేవారికి వినికిడి మందగించడం, చెవినొప్పి, మెదడుకు సంబంధించిన వ్యాధులు వ్యాపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్ ద్వారా శరీర కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా చర్మంలోని ప్రొటీన్ల నిర్మాణ క్రమం సైతం మారిపోయే అవకాశం ఉంటుంది. అతి వినియోగంతో కాంటాక్ట్ ఎలర్జీ.. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల కాంటాక్ట్ ఎలర్జీ వస్తుంది. దీనివల్ల చెవుల చుట్టూ ఎర్రబడి చిన్నచిన్న కురుపులు ఏర్పడతాయి. చెవి దగ్గర సెల్ పెట్టుకుని ఎక్కువ సేపు మాట్లాడడం వల్ల ఈ ఎలర్జీ వస్తుంది. సెల్‌ఫోన్ వీలయినంత తక్కువగా వాడితేనే ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఉంటాయి. మొబైల్‌ను ముఖ్యంగా చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లు గేమ్స్ ఆడడానికి టచ్ ఫోన్లు ఇవ్వకూడదు. ఇస్తే భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కేన్సర్ కారకం.. మొబైల్ ద్వారా రేడియేషన్‌కు గురైతే కొన్ని రకాల చర్మ కేన్సర్ రావడానికి అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్‌ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల చర్మం ముడతలు పడి వయసుకు మించి ఉన్నట్లు కనిపిస్తుంటారు. సెల్ఫోన్ల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వేన్సీ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ ఎంతో ప్రమాదకరం. ఎస్ఎంఎస్లతో ఇన్ఫోమేనియా... నగరంలో 75 శాతం మంది సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరిలో యువతే అధికం. వీరంతా అవసరానికి మించి ఫోన్ వినియోగిస్తూ రోజంతా అదే పనిగా ఎస్ఎంఎస్లు పంపిస్తూ కాలం గడుపుతున్నారు. దీనివల్ల ఇన్ఫోమేనియా అనే వ్యాధి బారిన పడుతున్నారు. అలాగే ఈ-మెయిల్స్ అదే పనిగా చూడడం అలవాటుగా మారింది. సెల్‌ఫోన్ ద్వారా కాంటాక్ట్ డెర్మటిటీస్ అనే స్కిన్ ఎలర్జీ సోకుతుంది. గంటల తరబడి మొబైల్‌ఫోన్‌ను ఉపయోగించే వారికి ఈ రకమైన సమస్యలు ఎదురవుతాయి. మొబైల్ ఫోన్లో ఉండే నికెల్ కోటింగ్ వల్ల కొన్నిరకాల బ్యాక్టీరియాలు వ్యాపించే అవకాశం ఉంది. చర్మంపై తెల్ల మచ్చల లాంటి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సెల్‌ఫోన్‌ను తక్కువగా వినియోగిస్తూ, సురక్షిత విధానాలు పాటిస్తే మంచిది. ప్రతిరోజూ చేతులు, ముఖాన్ని శుభ్రపర్చుకోవాలి. గంటల తరబడి సెల్ఫోన్లో మాట్లాడకూడదు. విటమిన్ ‘ఈ’తో కూడిన మాయిశ్చరైజర్ యాంటీ యాక్సిడెంట్లతో కూడిన ఎమోలియెంట్స్ని ఉపయోగించాలి. అవి చర్మానికి తేమను అందించడంతో పాటు చర్మాన్ని ముడతలు పడకుండా చూస్తాయి. చర్మం ఉత్తేజపడేలా నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడాలి. మొబైల్ ఫోన్ స్క్రీన్‌ను, ‘కీ’ ప్యాడ్‌ను తరచూ శుభ్రపరుస్తుండాలి. వాటిపై సూక్ష్మజీవులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ ఫోన్‌ను చెవిదగ్గర పెట్టుకుని మాట్లాడడం కంటే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ వంటివి వాడడం మేలు. టిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచడం మరిచిపోకూడదు. సాధ్యమైనంత వరకు సెల్‌ఫోన్ వాడకంలో లేనప్పుడు శరీరానికి అంటిపెట్టుకోకుండా దూరంగా పెట్టుకోవాలి.