శ్రీనగర్ : భద్రతా కారణాల రీత్యా శుక్రవారం శ్రీనగర్, అనంత్‌నాగ్‌లలో ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేసిన అధికారులు శనివారం తిరిగి పునరుద్దరించారు. నలుగురు ఉగ్రవాదులు అనంతనాగ్‌లోకి చొరబడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా అనంత్‌నాగ్, శ్రీనగర్‌లలో శుక్రవారం ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా భద్రతా దళాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అనంతనాగ్ పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో తీవ్రవాదులు, సైన్యం మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి నెట్ సర్వీసుల్ని తిరిగి ప్రారంభించామని అధికారులు వెల్లడించారు. కాగా, కశ్మీర్‌లో రంజాన్ ముగిసిన తర్వాత జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఇదే. ఈద్ సందర్భంగా నెల రోజులు పాటు సంయమనంతో ఉన్న సైన్యం ఉగ్రవాదలు వేటను తిరిగి ప్రారంభించింది.
ఇది కూడా చదవండి : వేట షురూ.. భారీ ఎన్‌కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment