
మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులు బంద్
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల వల్ల అపార నష్టం ఏర్పడింది. ఆ రాష్ట్రంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 197కు పెరిగింది. చెన్నై సహా చాలా ప్రాంతాల్లో మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వరదల వల్ల జనజీవనం స్తంబించిపోయిన నేపథ్యంలో కొన్ని టెలీకాం సంస్థలు తమ వినియోగదారులకు అండగా నిలిచాయి. ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు 'టాక్ టైమ్', ఒకే టెలీకాం సర్వీసులకు ఉచిత కాల్స్, మొబైల్ డాటాను పరిమిత స్థాయిలో అందించాయి.
భారీ వర్షాల వల్ల చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఎటూ చూసిన జలమయమే. రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. తమిళనాడులో వరదల పరస్థితిలో బుధవారం లోక్సభలో చర్చించి.. ఆ రాష్ట్రానికి అండగా ఉంటమని ప్రభుత్వం హామీ ఇచ్చింది.