నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌ | By-polls in 8 states today, internet services suspended in Srinagar | Sakshi
Sakshi News home page

నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

Published Sun, Apr 9 2017 8:59 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌ - Sakshi

నేడు మూడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ బంద్‌

శ్రీనగర్‌: ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో 10 అసెంబ్లీ స్థానాలకు, శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఆదివారం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గతేడాది భద్రత దళాలు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ బుర్హన్‌ వనీని ఎన్‌ కౌంటర్‌లో చంపడాన్ని నిరసిస్తూ శ్రీనగర్‌​ పీడీపీ ఎంపీ తారిఖ్‌ హమీద్‌ కర్రా రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

శ్రీనగర్‌ లోక్‌ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండటంతో భద్రత చర్యల్లో భాగంగా ఈ రోజు శ్రీనగర్‌, బుద్గాం, గండర్బాల్‌ జిల్లాలలో అన్ని ఇంటర్నెట్‌ సర్వీసులను ఆపివేశారు. ఈ నెల 13న అసెంబ్లీ స్థానాలలో, 15న శ్రీనగర్‌ లోక్‌ సభ స్థానంలో కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ స్థానాలివే..

రాజౌరి గార్డెన్‌ (ఢిల్లీ)
లిటిపర (జార్ఖండ్‌)
నంజన్‌గూడ్‌, గుండ్లుపేట్‌ (కర్ణాటక)
దోల్‌పూర్‌ (రాజస్థాన్‌)
కాంతి దక్షిణ్‌ (పశ్చిమ బెంగాల్‌)
అటర్‌, బందవ్‌గఢ్‌ (మధ్యప్రదేశ్‌)
భోరంజ్‌ (హిమాచల్‌ ప్రదేశ్‌)
దీమాయి (అసోం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement