డీల్ విలువ రూ. 669 కోట్లు
ముంబై: ఇంటర్నెట్ సేవలు అందించే తికోణ ఇన్ఫినెట్‌ను కొనుగోలు చేయనున్నట్లు నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎస్‌ఏఆర్ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ రూ. 669 కోట్లు. నగదు, స్టాక్స్ రూపంలో ఈ డీల్ ఉంటుంది. ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తికోణలో ఎస్‌ఏఆర్ 91 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
2008లో ఏర్పాటైన తికోణ 300 పైచిలుకు నగరాల్లో రెసిడెన్షియల్, కమర్షి యల్ కస్టమర్లకు హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సరీ్వసులు అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ మొదలైనవి కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. తికోణ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 193 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎన్‌ఎస్‌ఈకి చెందిన ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫాంలో లిస్టయిన ఎస్‌ఏఆర్ సంస్థ.. ఈ డీల్‌తో సమగ్ర టెలికం సేవల కంపెనీగా ఎదగనుంది.
Comments
Please login to add a commentAdd a comment