Tikona
-
ఎస్ఏఆర్ టెలీవెంచర్ చేతికి తికోణ ఇన్ఫినెట్
ముంబై: ఇంటర్నెట్ సేవలు అందించే తికోణ ఇన్ఫినెట్ను కొనుగోలు చేయనున్నట్లు నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎస్ఏఆర్ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ రూ. 669 కోట్లు. నగదు, స్టాక్స్ రూపంలో ఈ డీల్ ఉంటుంది. ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తికోణలో ఎస్ఏఆర్ 91 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. 2008లో ఏర్పాటైన తికోణ 300 పైచిలుకు నగరాల్లో రెసిడెన్షియల్, కమర్షి యల్ కస్టమర్లకు హై–స్పీడ్ ఇంటర్నెట్, డేటా సరీ్వసులు అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ మొదలైనవి కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. తికోణ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 193 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎన్ఎస్ఈకి చెందిన ఎస్ఎంఈ ప్లాట్‌ఫాంలో లిస్టయిన ఎస్ఏఆర్ సంస్థ.. ఈ డీల్‌తో సమగ్ర టెలికం సేవల కంపెనీగా ఎదగనుంది. -
ఎయిర్టెల్ చేతికి ‘టికోనా’
♦ 4జీ వ్యాపారం కొనుగోలు ♦ డీల్ విలువ రూ.1,600 కోట్లు న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్టెల్... ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్వర్క్స్కు చెందిన 4జీ వ్యాపారాన్ని రూ.1,600 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఈ కొనుగోలులో భాగంగా టికోనా సంస్థకు చెందిన బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 5 టెలికం సర్కిళ్లలో విస్తరించి ఉన్న 350 సైట్లు తమ పరం అవుతాయని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టికోనా సంస్థకు గుజరాత్, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ టెలికం సర్కిళ్లలో 2,300 మోగాహెట్జ్ బ్యాండ్‌పై 20 మెగా హెట్జ్ స్పెక్ట్రమ్ ఉంది. టికోనా కొనుగోలుతో దేశంలో రిలయన్స్ జియో తర్వాత దేశవ్యాప్త 4జీ నెట్వర్క్ ఉన్న కంపెనీగా భారతీ ఎయిర్టెల్ అవతరిస్తుంది. టికోనా సంస్థ కొనుగోలుతో వినియోగదారులకు మరింత వేగవంతమైన వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలందించగలమని కంపెనీ ఎండీ, సీఈఓ (ఇండియా,దక్షిణాసియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఈ డీల్ పూర్తికాగానే ఈ ఐదు సర్కిళ్లలో 4జీ సేవలందిస్తామని తెలియజేశారు. -
ఎయిర్టెల్ మరో భారీ డీల్
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ కీలక అడుగు వేసింది. భారత్‌లో 4జీ ఇంటర్నెట్ సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ బ్రాడ్‌బాండ్ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్‌ను స్వాధీనం చేసుకోనుంది. టికోనా 4జీ డిజిటల్ నెట్వర్క్ బిజినెస్‌ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్‌లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కాగా ఒకవైపు జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్ జియో సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్, ఐడియా మెగామెర్జర్ టెలికాం పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ టికోనాతో నిశ్చయాతమ్మకం ఒప్పందం చేసుకోవడం విశేషం. జియో ఎంట్రీ స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థ నిష్క్రమణకు ఉత్ర్పేరకంగా నిలిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు.