High-speed
-
భారత మార్కెట్లలోకి మరో రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్..! ధర ఎంతంటే..?
భారత్‌కు చెందిన వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ సంస్థ రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వోల్ఫ్+, నాను+ అనే రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటితో పాటుగా డెలివరీ సేవలకోసం ఫ్లీట్ మేనేజ్మెంట్ విభాగంలో డెల్ గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను గుజరాత్ వడోదరలోని తయారీ కేంద్రంలో తయారుకానున్నాయి. యువతే లక్ష్య ంగా..! యువతను లక్ష్యంగా చేసుకొని వోల్ప్ ప్లస్, నాను ప్లస్ హైస్పీడ్ బైక్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది. వోల్ఫ్+ బైక్ పొడిగించిన వీల్‌బేస్‌తో వైడ్ లాంగర్ సీటుతో రానుంది. సిటీ ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని సులభమైన సీటింగ్‌తో నాను+ బైక్‌ను డిజైన్ చేశారు. డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్‌తో సౌకర్యంగా అందించనుంది. ఈ బైక్‌లను కీలెస్ స్టార్ట్/స్టాప్ ఆప్షన్ కూడా ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే..! వోల్ఫ్+, నాను+ బైక్‌లో వివిధ సెన్సార్ల కలయికతో అద్భుతమైన ఫీచర్స్‌తో రానుంది. 'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' తో పనిచేయనుంది. బ్లూటూత్, ట్రాకింగ్, బ్యాటరీ స్టేటస్ ఫీచర్స్‌ను వార్డ్విజర్డ్ ఏర్పాటుచేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మూడు డ్రైవ్ మోడ్స్ వస్తాయి. ఎకో, స్పోర్ట్స్ , హైపర్. రివర్స్ మోడ్‌ను మద్దతు ఇస్తాయి. జీపీఎస్ సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి ఇతర ఫీచర్సు కూడా ఉన్నాయి. రేంజ్ విషయానికి వస్తే..! వోల్ఫ్+, నాను+ ఎలక్ట్రిక్ బైక్స్‌లో అద్భుతమైన రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రానుంది. బ్రేక్ లివర్ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని రీఛార్జ్ చేస్తోంది. ఈ బైక్స్‌లో 1500W మోటార్ 20 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. గరిష్ట వేగం 55 kmph. రెండు స్కూటర్లకు బ్యాటరీ 60V 35Ahగా రేట్ చేయబడింది. ఈ బైక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్స్‌పై మూడేళ్ల వారంటీతో రానుంది. వోల్ఫ్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,10,185; కాగా నాను+ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,06,991; డెల్ గో స్కూటర్ ధర రూ. 1,14,500 (ఎక్స్‌షోరూమ్) చదవండి: చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతానంటే ఎలా ? మేము ఒప్పుకోం ! -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
న్యూవిస్టాడోమ్ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన న్యూ డిజైన్ విస్టాడోమ్ కోచ్‌లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వీటిలో ప్రయాణాలు చిరస్మరణీయాలుగా మారతాయన్నారు. ► ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేశారు. ఈ కోచ్‌లో 44 ప్యాసెంజర్ సీట్లుంటాయి. వీటిని 180 డిగ్రీల మేర తిప్పుకోవచ్చు. ► పైకప్పు గాజుతో చేయడం వల్ల వ్యూ ఏరియా మరింత పెరుగుతుంది. మంగళవారం ఈ కోచ్‌లు 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వద్ద ట్రయిల్ రన్ పూర్తి చేసుకున్నాయి. ► వీటిని తొలిసారి ఎల్‌హెచ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. కోచ్‌లో వైఫై ఆధారిత ప్రయాణీకుల సమాచారం ఉంటుంది. ► ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్లు, పెద్ద గాజు కిటికీలు, ప్రతిసీటుకి మొబైల్ చార్జింగ్ సాకెట్, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు, స్పీకర్లు, వెడల్పైన ఎంట్రన్స్ డోర్లు, ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డులు, మల్టీటైర్ లగేజ్ ర్యాక్స్, మిని ప్యాంట్రీ, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ టాయిలెట్స్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ తదితరాలు ఈ కోచ్‌ల ప్రత్యేకతలు. ► ప్రస్తుతం ఐసీఎఫ్ పది విస్టాడోమ్ కోచ్‌లను తయారుచేస్తోంది. ఇప్పటికే రెండింటి ఉత్పత్తి పూర్తికాగా మిగిలినవి వచ్చేమార్చి చివరకు పూర్తి చేస్తారు. వీటిని పర్యాటకులు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో ఉపయోగిస్తారు. -
నిద్రమత్తు ప్రాణం తీసింది
కొనకనమిట్ల: అతివేగం, నిద్రమత్తు వెరసి కారు యజమాని ప్రాణం తీసింది. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారిలో కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలోని ఎర్రవాగు బ్రిడ్జి దగ్గర ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన వల్లభనేని వెంకటేశ్వరరావు (65) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామం దగ్గర కొంత పొలం కొన్నాడు. ఆ పొలంలో ఇటీవల ఒక ఇల్లు నిర్మించాడు. కాగా ఆ ఇంటికి రంగులు వేసేందుకు తన గ్రామానికి చెందిన పెయింటర్స్ ఇస్లావత్ రాజేంద్రప్రసాద్ నాయక్, కృష్ణమూర్తి, ప్రసాద్‌లను తీసుకొని మారుతీ సుజికి కారులో రామేశ్వరం వెళుతున్నాడు. కారును క్రాంతి కిరణ్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. వాహనం చినారికట్ల జంక్షన్ ఎస్ఆర్ పెట్రోలు బంక్ సమీపంలో ఎర్రవాగు దగ్గరకు వేగంగా వచ్చింది. ఇదే సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి ఎర్రవాగుపై నిర్మించిన బ్రిడ్జి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. అతని పక్కసీటులో కూర్చుని ఉన్న కారు యజమాని వెంకటేశ్వరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న రాజేంద్రప్రసాద్ నాయక్, ప్రసాద్, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కొనకనమిట్ల ఏఎస్ఐ మనోహరరాజు, కానిస్టేబుల్ మోహన్‌లు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఎక్కడో ఊరు కాని ఊర్లో పొలం కొని అక్కడ ఇల్లు కట్టించుకొన్న వెంకటేశ్వరరావు మృతి చెందటంతో బంధువులు భోరున రోదించారు. కూలి పనికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆ తర్వాత ఒంగోలుకు వైద్యశాలకు తరలించడంతో బంధువులు వచ్చి పరామర్శించారు. -
అతివేగం వల్లే ప్రమాదం
ఏర్పేడు ఘటనపై తిరుపతి ఎస్పీ స్పష్టీకరణ తిరుపతి క్రైం: చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఈ నెల 21న లారీ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఘటన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఈ ఘటనలో లారీ దూసుకు పోవడం వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారన్నారు. లారీలో ఇద్దరు డ్రైవర్లున్నారని, ఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ గురవయ్యను స్థానికులు పోలీసులకు అప్పగించారన్నారు. అతను మద్యం సేవించి ఉండడం వల్ల వైద్య పరీక్షలు చేయించి, భద్రతా కారణాల దృష్ట్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ సుబ్రమణ్యం అలియాస్ మణి, లారీ యజమాని రమేష్‌లు మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అక్కరపాక గ్రామం ఇన్చార్జి వీఆర్వో ముందు హాజరై సంఘటన జరిగిన తీరును వివరించార న్నారు. వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు వారిద్దరినీ స్టేషన్లో డీఎస్పీ ముందు హాజరు పరిచారని చెప్పారు. వారిని విచారించగా లారీ యజమాని టి.రమేష్ వారికి లైసెన్స్ లేదని తెలిసినా చేర్చుకున్నాడని తేలిందన్నారు. -
అతివేగానికి ఇద్దరు బలి
∙ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు బైక్‌లు ∙ఒకరి పరిస్థితి విషమం రఘునాథపల్లి : రఘునాథపల్లి – కంచనపల్లి రహదారిపై ఆదివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కంచనపల్లికి చెందిన మంచోజు బ్ర హ్మచారి(54) కొన్నేళ్ల కిత్రం జనగామ మండ లం వడ్లకొండలోని అత్తగారింటికి ఇల్లరికం పోయి అక్కడే నివాసముంటున్నాడు. కంచనపల్లిలో జరిగిన తన తల్లి సంవత్సరీకం కార్యక్రమానికి బ్రహ్మచారి ద్విచక్రవాహనంపై వచ్చా డు. ఆదివారం రాత్రి బైక్‌పై తిరిగి వెళుతుండ గా, భాంజీపేట శివారు పిట్టలగూడేనికి చెందిన కావ్య రాంగోపాల్(40), కావ్య రాజులు ద్విచక్రవాహనంపై కంచనపల్లి వైపు వస్తున్నారు. కంచనపల్లి ఎస్సీ కాలనీ సమీపంలోని కల్వర్ట్ వద్ద రెండు బైకులు వేగంగా, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బ్రహ్మచారి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైకుపై ఉన్న పిట్టలగూడెం వాసులు రాంగోపాల్, రాజులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108లో జనగామ ఏరియా అసుపత్రికి తరలిం చగా చికిత్స పొందిన కొద్ది సేపటికి రాంగోపాల్ మృతి చెందాడు. మృతుడు బ్రహ్మచారికిSభార్య నాగలక్ష్మి, కూతురు శ్రావణి, కుమారుడు సంతోష్ ఉన్నారు. మృతుడు రాంగోపాల్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఎస్సై రంజిత్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బుల్లెట్ ట్రైన్ కు ట్రయిల్ రన్!
బరేలి : హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కల త్వరలో సాకారం కానుంది. ఇండియన్ రైల్వే అందుకోసం మరో అడుగు ముందుకేసింది. ఇజత్ నగర్, భోజీపురా స్టేషన్ల మధ్య శనివారం స్పానిష్ కు చెందిన టాల్గో కంపెనీ హైస్పీడ్ రైలు కోచ్ లకు సెన్సార్ ట్రయల్ నిర్వహించింది. ట్రయల్ రన్ లో భాగంగా సూపర్ లగ్జరీ కోచ్ లను ఇండియన్ ఇంజన్ తో పట్టాలపై నడిపించినట్లు అధికారులు తెలిపారు. బుల్లెట్ లా దూసుకుపోయే హైస్పీడ్ రైలు దేశంలో అతి త్వరలో పట్టాలెక్కనుంది. (చదవండి...మనకూ స్పానిష్ హైస్పీడ్ రైలు) టాల్గో కంపెనీ ఈ కోచ్ లను సుమారు 30 ఏళ్ళ క్రితం తయారు చేసింది. ఇప్పటివరకూ తజకిస్తాన్ తో సహా 12 దేశాల్లో ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యింది. అనేక సెన్సార్ల ఆధారంగా నడిచే కోచ్ లు సరైన రీతిలో పనిచేస్తున్నాయా లేదా తెలుసుకునేందుకు రైల్వే బోర్డ్ మెకానికల్ ఇంజనీర్ సెన్సార్ ట్రయల్ నిర్వహించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆదివారం బరెలీ నుంచి మొరాదాబాద్ వరకూ ప్రారంభించే బోగీల స్పీడ్ ట్రయల్ జూన్ 12 వరకూ కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ప్రస్తుత ట్రయల్ సందర్భంలో ఈ కోచ్ లు గంటకు 115 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయని, త్వరలో న్యూఢిల్లీ ముంబై మార్గంలోని మధుర పాల్వాల్ సెక్షన్ లో జరిగే ట్రయల్ రన్ లో గంటకు 180 నుంచి 200-220 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన కోచెస్ సెన్సార్ ట్రయల్ విజయవంతమైందని ఈశాన్య రైల్వే ఇజత్ నగర్ డివిజన్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం రైల్వే బోర్డులోని ముగ్గురు సభ్యుల బృదం వర్క్ షాప్ కు చేరుకొని, టాల్గో కోచెస్ కు సంబంధించిన వివరాలను అందించిందని, అనంతరం స్పానిష్ టీమ్ దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు, కోచ్ లలోని ప్రతి వస్తువుకు చెందిన పూర్తి సమాచారాన్ని విపులంగా వివరించినట్లు రాజేంద్ర సింగ్ తెలిపారు. -
దూసుకెళ్లిన కారు.. ఒకరి మృతి
తూర్పుగోదావరి: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని వేమగిరి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వేమగిరి సెంటర్లో సైకిల్‌మీద రహదారిని దాటడానికి ప్రయత్నిస్తున్న యనమదల లక్ష్మణరావు(34) అనే వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కన లారీ టైర్ మారుస్తున్న డ్రైవర్, క్లీనర్లను ఢీకొట్టింది. దీంతో వేమగిరికి చెందిన లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందగా.. లారీ డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
అతివేగమే కొంపముంచింది
అడ్డాకుల: అతివేగమే వారి కొంపముంచింది. స్పీడ్ దాటొద్దని చేసిన హెచ్చరికలు వినకపోవడమే వారికి శాపమైంది. సోమవారం జిల్లాలో జరిగిన మూడు వేర్వేరుప్రమాదాల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన మజీద్(40), మీర్జహూర్ అలీ, మహ్మద్ హమీద్ స్నేహితుడి క్వాలీస్ వాహనంలో డ్రైవర్ కార్తీక్‌తో కలిసి జిల్లాలోని ఎర్రవల్లి ప్రాంతంలో భూములను చూసేందుకు బయలుదేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న క్వాలీస్ వెనక టైరు జానంపేట పాత పెట్రోల్‌బంకు సమీపంలోకి రాగానే పగిలిపోయింది. దీంతో వేగంగా వెళ్తున్న వాహనం బోల్తాపడి పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న మజీద్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడ్డాకుల ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించి.. కేసు దర్యాప్తు చే స్తున్నారు. లారీ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలు కొత్తకోట: జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరుతీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తకోటలోని బైపాస్ సమీపంలో చోటుచేసుకుంది. కొత్తకోట బైపాస్‌లో ఇటీవల రోడ్డు పనులు జరుగుతుండటంతో వన్ వేలో వాహనాలను మళ్లిస్తున్నారు. దీంతో తిరుపతి నుంచి మెదక్ జిల్లా జహీరాబాద్ వెళ్లున్న కారును హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జహీరాబాద్‌కు చెందిన నరేష్, ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం కొత్తకోట: ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ నుంచి కొత్తకోటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు కనిమెట్ట వద్ద ఆగింది. దీంతో వెనుక వచ్చిన డీసీఎం ఆగిఉన్న బస్సును ఢీకొట్టి బోల్తాపడింది. కాగా, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం
గుమ్మిడిపూండి: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగమే అని రెడ్‌హిల్స్ ఆర్టీవో సంపత్‌కుమార్ అన్నారు. కవరపేట సమీపంలోని పెరువాయిల్ గ్రామంలో ఉన్న టీజేఎస్. పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఒక్క రోజు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు కళాశాల చైర్మన్ టి.జె.గోవిందరాజన్, ఆర్టీవో సంపత్‌కుమార్ హాజరయ్యారు. ఆర్టీవో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు ఆత్మవిశ్వాసం, సహనంతో వాహనాలు నడపాలని కోరారు. ప్రయాణికుల భద్రత డ్రైవర్ల చేతుల్లో ఉందన్నారు. 2013లో తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15,563 మంది మృతి చెందారని వీరిలో ద్విచక్ర వాహనచోదకులు 80 శాతం మంది ఉన్నారని తెలిపారు. అందుకు ప్రధాన కారణం అతివేగం, హెల్మెట్ ధరించకపోవడమే అన్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటే, తమిళనాడు ఇండియాలో మొదటి వరసలో ఉందని చెప్పారు. అందుకే తమ శాఖ తరపున విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన నిబంధనలను వివరిస్తూ , 45 నిమిషాల పాటు టెలిఫిల్మ్ను ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ తిరునావుక్కరసు, ఏవో.బాబు, రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు.