
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన న్యూ డిజైన్ విస్టాడోమ్ కోచ్‌లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వీటిలో ప్రయాణాలు చిరస్మరణీయాలుగా మారతాయన్నారు.
► ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేశారు. ఈ కోచ్‌లో 44 ప్యాసెంజర్ సీట్లుంటాయి. వీటిని 180 డిగ్రీల మేర తిప్పుకోవచ్చు.
► పైకప్పు గాజుతో చేయడం వల్ల వ్యూ ఏరియా మరింత పెరుగుతుంది. మంగళవారం ఈ కోచ్‌లు 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వద్ద ట్రయిల్ రన్ పూర్తి చేసుకున్నాయి.
► వీటిని తొలిసారి ఎల్‌హెచ్‌బీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. కోచ్‌లో వైఫై ఆధారిత ప్రయాణీకుల సమాచారం ఉంటుంది.
► ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్లు, పెద్ద గాజు కిటికీలు, ప్రతిసీటుకి మొబైల్ చార్జింగ్ సాకెట్, డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్లు, స్పీకర్లు, వెడల్పైన ఎంట్రన్స్ డోర్లు, ఎల్‌ఈడీ డెస్టినేషన్ బోర్డులు, మల్టీటైర్ లగేజ్ ర్యాక్స్, మిని ప్యాంట్రీ, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ టాయిలెట్స్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ తదితరాలు ఈ కోచ్‌ల ప్రత్యేకతలు.
► ప్రస్తుతం ఐసీఎఫ్ పది విస్టాడోమ్ కోచ్‌లను తయారుచేస్తోంది. ఇప్పటికే రెండింటి ఉత్పత్తి పూర్తికాగా మిగిలినవి వచ్చేమార్చి చివరకు పూర్తి చేస్తారు. వీటిని పర్యాటకులు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment