'మరిన్ని రైళ్లు ప్రవేశపెడతాం' | Success Of Vande Bharat, Indian Railways Plans For New Trains | Sakshi
Sakshi News home page

'మరిన్ని రైళ్లు ప్రవేశపెడతాం'

Published Wed, Jul 3 2019 11:05 AM | Last Updated on Wed, Jul 3 2019 11:36 AM

Success Of Vande Bharat, Indian Railways  Plans For New Trains - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రవేశపెట్టిన 'వందేభారత్‌' సెమీ హైస్పీడ్‌  రైలు  విజయవంతం కావడంతో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ తయారీ కంపెనీలతో రైళ్ల తయారీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీహెచ్‌ఈఎల్‌, హ్యుందాయ్, చైన్నైకి చెందిన ఇంటిగ్రేట్‌డ్‌ కోచ్‌ ప్యాక్టరీ, రాయ్‌బరేలీ మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, ఆల్స్టమ్‌లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019, ఫిబ్రవరి 15 న వందేభారత్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వారణాసి ప్రయాణించే ఈ రైలును చెన్నైకి చెందిన ఇంటిగ్రేటడ్‌ కోచ్‌ ప్యాక్టరీ తయారు చేసింది. 16 కోచ్‌లు కలిగిన ఈ రైలు గంటకు 130 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. వందేభారత్‌ రైలును 30 ఏళ్లు పూర్తి చేసుకున్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ స్థానంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement