స్టాక్‌హోమ్: స్వీడన్ తీరంలో సుమారు 300 మందితో వెళ్తున్న ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులను కాపాడేందుకు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్వీడన్ నౌకాదళ అధికారులు తెలిపారు. ‘కార్ డెక్‌లో మంటలు చెలరేగాయి. మూడు హెలికాప్టర్లు, ఏడు నౌకలను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికుల తరలింపు జరుగుతోంది.’ అని స్వీడన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధిని జోనస్ ఫ్రాంజెన్ తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, మంటలు అంటుకునేందుకు గల కారణాలేంటనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు జోనస్ ఫ్రాంజెన్. మరోవైపు.. మంటలు అదుపులోకి వచ్చినట్లు మరో అధికారి తెలిపారు. స్వీడన్ ఈశాన్య తీర ప్రాంతంలోని గోట్‌స్కా సాండన్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైన స్టేనా స్కాండికా నౌక ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రకృతి విలయం చేజేతులారా పాక్ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో!
Comments
Please login to add a commentAdd a comment