ferry
-
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
ఓడ ప్రయాణం.. అంతా చూస్తుండగా భార్యని సముద్రంలోకి విసిరేసిన భర్త!
సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి తన భార్యని ఫెర్రీలో నుంచి తోసేసిన ఘటన ఇండోనేషియాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇండోనేషియా పోలీసులు విడుదల చేశారు. సుండా స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ఫెర్రీ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు షేర్ చేసిన వీడియోలో... ఫెర్రిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె భర్త తన వెనుక వచ్చి నిల్చుంటాడు. అతనికి ఏమైందోగానీ హఠాత్తుగా ఆమెను ఎత్తుకొని అందరి కళ్లు ముందు ఓవర్‌బోర్డ్‌లో నుంచి సముద్రంలోకి విసిరేస్తాడు. అయితే అదృష్టవశాత్తు, ఆ మహిళ సముద్రంలో పడకుండా తప్పించుకుంటుంది. కింద పడ్డ ఆమె ఫెర్రిలోని రెయిలింగ్‌పై ఉన్న కడ్డీలకు అతుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడింది. తోటి ప్రయాణికుల సహాయంతో ఆమె భర్తని పోలీసులకు అప్పగిస్తారు. మరో వైపు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై కేసు నమోదు చేయనట్లు సమాచారం. ఎందుకంటే.. ఆ వ్యక్తి మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేదని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు మహిళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్ -
300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం
స్టాక్‌హోమ్: స్వీడన్ తీరంలో సుమారు 300 మందితో వెళ్తున్న ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులను కాపాడేందుకు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్వీడన్ నౌకాదళ అధికారులు తెలిపారు. ‘కార్ డెక్‌లో మంటలు చెలరేగాయి. మూడు హెలికాప్టర్లు, ఏడు నౌకలను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికుల తరలింపు జరుగుతోంది.’ అని స్వీడన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధిని జోనస్ ఫ్రాంజెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, మంటలు అంటుకునేందుకు గల కారణాలేంటనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు జోనస్ ఫ్రాంజెన్. మరోవైపు.. మంటలు అదుపులోకి వచ్చినట్లు మరో అధికారి తెలిపారు. స్వీడన్ ఈశాన్య తీర ప్రాంతంలోని గోట్‌స్కా సాండన్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైన స్టేనా స్కాండికా నౌక ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రకృతి విలయం చేజేతులారా పాక్ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో! -
విషాదం: నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుగంధ నదిలో మూడంతస్తుల నౌక మంటల్లో చిక్కుకుపోయి 40 మంది ప్రయాణికులు మృతి చెందారు. కొందరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవ్వగా, కొందరు నదిలో మునిగిపోయారు. మరికొందరి జాడ తెలియడం లేదని పోలీసు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. 800 మంది ప్రయాణికులున్న నౌకకు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపన వివరాల ప్రకారం.. ఢాకా నుంచి బయలు దేరిన నౌక జలకఠి జిల్లాలో ఉండగా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న కొంతమంది సజీవ దహనమయ్యారు. మరికొంత మంది పొగకు ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఇంకొందరు నదిలోకి దూకినా ఈత రాకపోవడంతో జలసమాధి అయ్యారు. నౌకలో 310 మంది ప్రయాణి కులున్నట్టుగా రికార్డులు చెబుతుండగా... అంతకం టే ఎక్కువమందే ఉండొచ్చని భావిస్తున్నట్లు నౌకాయాన సహాయ మంత్రి ఖలీద్ మహ్మద్ చౌదరి తెలిపారు. ప్రమాద విచారణకోసం మూడు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. మంటలు వేగంగా వ్యాపించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తాము 70 మందికి చికిత్స అందిస్తున్నామని, ఇతర ఆస్పత్రుల్లో మరో 50 మందికి చికిత్స జరుగుతుందని అధికారులు తెలిపారని షేర్ ఇ బంగ్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. తీరప్రాంత సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రవాహానికి దిగువన ఉన్న మూడు జిల్లాల్లో ప్రయాణికుల జాడ కోసం వెదుకుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు... వాళ్ల బంధువులతో కిటకిటలాడుతున్నాయి. నౌకలో సామర్థ్యానికి మించిన ప్రయాణికులున్నారని, వారాంతం కావడంతో చాలా మంది తమ ఇళ్లకు బయల్దేరారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చదవండి: అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డాడు.. రిజక్ట్ చేయడంతో కాల్ గర్ల్ అని.. #Bangladesh : More than 30 bodies have been recovered while 60 admitted to Barguna Medical Hospital aftermath of fire at a ferry on The #Sugandha river, near #Gabkhan in Jhalokati district. pic.twitter.com/y3PyKcocXd — Breaking Now™® (@Breaking_Now1) December 24, 2021 -
కృష్ణానదిలో రవాణా పంట్ ట్రైల్‌రన్
ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు. స్థానికుల అభ్యంతరం జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. -
తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ
గాంధీనగర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డ్రీమ్ ప్రాజెక్టు రో-రో ఫెర్రీ సర్వీసును ఆదివారం గుజరాత్‌లోని ఘోఘా ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో పాటు రూ.650 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో అక్టోబర్‌లో ప్రధాని గుజరాత్లో పర్యటించడం ఇది మూడోసారి. రో-రో ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ.. ఈ ప్రాజెక్టు భారత్‌కు అమూల్యమైన బహుమతి అని అన్నారు. అనంతరం రోరో పడవలోనే ద హేజ్‌ను చేరుకున్నారు. పడవలో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. రో-రో అంటే రోల్ ఆన్, రోల్ ఆఫ్. నదీ మార్గం ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరేవేసే ప్రాజెక్టు. సౌరాష్ట్రలోని ఘోఘా ప్రాంతం నుంచి దక్షిణ గుజరాత్‌లోని దహేజ్ను చేరుకోవడానికి ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సివుంటుంది. రో-రో ఫెర్రీ సర్వీసు ద్వారా కేవలం ఒక గంట సమయంలోనే ప్రయాణాన్ని ముగించవచ్చు. -
సప్తశృంగేరీ భక్తులకు ట్రాలీ సదుపాయం!
నాసిక్‌ః పన్నెండేళ్ళకోసారి కుంభమేళాతో దేశంలోని భక్తుల దృష్టిని ఆకర్షించే నాసికా త్రయంబకం దగ్గరలోని సప్త శృగేరీ దేవి భక్తులకు త్వరలో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. సప్తశృంగి అమ్మవారిని నదీమార్గంలోనూ, కాలినడకన దర్శించే భక్తులు... ఇకపై ప్రత్యేక ట్రాలీలలో ప్రయాణించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రాలీ ప్రాజెక్టు పూర్తి చేసి మరో రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొండపై కొలువైన సప్తశృంగి ఆలయాన్ని దర్శించే భక్తులకు ట్రాలీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఎత్తైన కొండపైకి భక్తులు చేరడాన్ని సులభతరం చేసేందుకు ట్రాలీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సుయోగ్ గుర్బాక్సానీ ఫునిక్యులర్ రోప్‌వేస్ సంస్థ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు సుమారు 85 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రత్యేక సదుపాయం ప్రారంభించినట్లైతే భక్తులు ఇక 500 మెట్లను కాలి నడకన ఎక్కాల్సిన అవసరం ఉండదని, కేవలం మూడు నిమిషాల్లో కొండపైకి చేరుకో గల్గుతారని ప్రాజెక్ట్ మేనేజర్ రాజీవ్ లుంబా తెలిపారు. భక్తులను తరలించేందుకు రెండు ట్రాలీలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే రోప్ వే సౌకర్యంలోని ఒక్కో ట్రాలీలో ట్రిప్పుకు 60 మంది వరకూ ప్రయాణించవచ్చని, రెండు ట్రాలీలు కలిసి గంటకు సుమారు 12 వందల మంది భక్తులను కొండపై ఆలయానికి చేరవేయగల్గుతాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాక ట్రాలీల్లో ఏసీ సౌకర్యం కూడ ఉన్నట్లు తెలిపారు. నాసిక్ కు దగ్గరలోని కల్వాన్ తాలూకా నండూరి గ్రామంలో సప్తశృంగి ఆలయం ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నవరాత్రుల సమయంలో లక్షలకొద్దీ భక్తులు సందర్శిస్తుంటారు. మహరాష్ట్ర ప్రభుత్వం, సప్తశృంగీ దేవి నివాసిని ట్రస్ట్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్ణయించినట్లు ప్రాజెక్ట్ అధికారి లుంబా తెలిపారు. -
పడవ మునిగి 33 మంది మృతి!
బంగ్లాదేశ్‌లో ఘోరప్రమాదం జరిగింది. 150 మందితో బయలుదేరి వెళుతున్న ఓ పడవ పద్మనదిలో బోర్లా పడింది. దాంతో పడవలో ఉన్నవారంతా నీళ్లలో పడిపోయారు. అయితే, ఈ ఘటనలో ఓ మహిళ ఆరు నెలల పాపతో సహా 33మంది చనిపోగా మరి కొందరు గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు రెస్క్యూ టీంతోపాటు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్నపడవలవాళ్ల సహాయ చర్యలకు దిగారు. రాజ్బారీలోని దౌలత్‌దియా నుంచి పాటురియాకు ఆదివారం బయలుదేరిన ఈ పడవ సరిగ్గా బయలు దేరిన ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు వెళ్లగానే అనుకోకుండా మరో కార్గో పడవను ఢీకొని నది మధ్యలో తిరగబడింది. సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదే నెల 13న 200 మందితో బయలుదేరిన బల్లకట్టు ఒకటి బోల్తాపడగా ఆ తర్వాత జరిగిన మరో ప్రమాదం ఇది. అతి పేలవమైన ప్రమాణాలు పాటించడంవల్లే బంగ్లాలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధరణమవుతున్నాయి.