బంగ్లాదేశ్లో ఘోరప్రమాదం జరిగింది. 150 మందితో బయలుదేరి వెళుతున్న ఓ పడవ పద్మనదిలో బోర్లా పడింది. దాంతో పడవలో ఉన్నవారంతా నీళ్లలో పడిపోయారు. అయితే, ఈ ఘటనలో ఓ మహిళ ఆరు నెలల పాపతో సహా 33మంది చనిపోగా మరి కొందరు గల్లంతయ్యారు. అదృష్టవశాత్తు రెస్క్యూ టీంతోపాటు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్నపడవలవాళ్ల సహాయ చర్యలకు దిగారు.
రాజ్బారీలోని దౌలత్దియా నుంచి పాటురియాకు ఆదివారం బయలుదేరిన ఈ పడవ సరిగ్గా బయలు దేరిన ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు వెళ్లగానే అనుకోకుండా మరో కార్గో పడవను ఢీకొని నది మధ్యలో తిరగబడింది. సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదే నెల 13న 200 మందితో బయలుదేరిన బల్లకట్టు ఒకటి బోల్తాపడగా ఆ తర్వాత జరిగిన మరో ప్రమాదం ఇది. అతి పేలవమైన ప్రమాణాలు పాటించడంవల్లే బంగ్లాలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధరణమవుతున్నాయి.
పడవ మునిగి 33 మంది మృతి!
Published Sun, Feb 22 2015 6:35 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement