ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుగంధ నదిలో మూడంతస్తుల నౌక మంటల్లో చిక్కుకుపోయి 40 మంది ప్రయాణికులు మృతి చెందారు. కొందరు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమవ్వగా, కొందరు నదిలో మునిగిపోయారు. మరికొందరి జాడ తెలియడం లేదని పోలీసు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. 800 మంది ప్రయాణికులున్న నౌకకు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
అధికారులు తెలిపన వివరాల ప్రకారం.. ఢాకా నుంచి బయలు దేరిన నౌక జలకఠి జిల్లాలో ఉండగా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న కొంతమంది సజీవ దహనమయ్యారు. మరికొంత మంది పొగకు ఊపిరాడక ప్రాణాలొదిలారు. ఇంకొందరు నదిలోకి దూకినా ఈత రాకపోవడంతో జలసమాధి అయ్యారు. నౌకలో 310 మంది ప్రయాణి కులున్నట్టుగా రికార్డులు చెబుతుండగా... అంతకం టే ఎక్కువమందే ఉండొచ్చని భావిస్తున్నట్లు నౌకాయాన సహాయ మంత్రి ఖలీద్ మహ్మద్ చౌదరి తెలిపారు.
ప్రమాద విచారణకోసం మూడు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. మంటలు వేగంగా వ్యాపించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తాము 70 మందికి చికిత్స అందిస్తున్నామని, ఇతర ఆస్పత్రుల్లో మరో 50 మందికి చికిత్స జరుగుతుందని అధికారులు తెలిపారని షేర్ ఇ బంగ్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.
తీరప్రాంత సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రవాహానికి దిగువన ఉన్న మూడు జిల్లాల్లో ప్రయాణికుల జాడ కోసం వెదుకుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు... వాళ్ల బంధువులతో కిటకిటలాడుతున్నాయి. నౌకలో సామర్థ్యానికి మించిన ప్రయాణికులున్నారని, వారాంతం కావడంతో చాలా మంది తమ ఇళ్లకు బయల్దేరారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
చదవండి: అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడ్డాడు.. రిజక్ట్ చేయడంతో కాల్ గర్ల్ అని..
#Bangladesh : More than 30 bodies have been recovered while 60 admitted to Barguna Medical Hospital aftermath of fire at a ferry on The #Sugandha river, near #Gabkhan in Jhalokati district. pic.twitter.com/y3PyKcocXd
— Breaking Now™® (@Breaking_Now1) December 24, 2021
Comments
Please login to add a commentAdd a comment