తన డ్రీమ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ | 'Invaluable Gift To India,' Says PM Modi On Ro-Ro Ferry Service | Sakshi
Sakshi News home page

తన డ్రీమ్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మోదీ

Published Sun, Oct 22 2017 5:44 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

'Invaluable Gift To India,' Says PM Modi On Ro-Ro Ferry Service - Sakshi

గాంధీనగర్‌ ‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డ్రీమ్‌ ప్రాజెక్టు రో-రో ఫెర్రీ సర్వీసును ఆదివారం గుజరాత్‌లోని ఘోఘా ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో పాటు రూ.650 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనుండటంతో అక్టోబర్‌లో ప్రధాని గుజరాత్‌లో పర్యటించడం ఇది మూడోసారి.

రో-రో ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ.. ఈ ప్రాజెక్టు భారత్‌కు అమూల్యమైన బహుమతి అని అన్నారు. అనంతరం రోరో పడవలోనే ద హేజ్‌ను చేరుకున్నారు. పడవలో ప్రయాణిస్తూ విద్యార్థులతో ముచ్చటించారు. రో-రో అంటే రోల్‌ ఆన్‌, రోల్‌ ఆఫ్‌. నదీ మార్గం ద్వారా ప్రయాణికులను అటూ ఇటూ చేరేవేసే ప్రాజెక్టు.

సౌరాష్ట్రలోని ఘోఘా ప్రాంతం నుంచి దక్షిణ గుజరాత్‌లోని దహేజ్‌ను చేరుకోవడానికి ఎనిమిది గంటల ప్రయాణం చేయాల్సివుంటుంది. రో-రో ఫెర్రీ సర్వీసు ద్వారా కేవలం ఒక గంట సమయంలోనే ప్రయాణాన్ని ముగించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement