అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు.
అభివృద్ధిభారత్‌కు ఐక్యతే పునాది
‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్‌గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్‌ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.
ఆలయంతో ఆత్మీయ అనుబంధం
‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment