swamy narayan
-
PM Narendra Modi: సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు
అహ్మదాబాద్: భారత సమాజాన్ని విభజించి ముక్కలుచెక్కలు చేయడానికి జాతివ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కులగణన పేరిట దేశంలోని భిన్న కులస్తుల మధ్య విపక్షాల ‘ఇండియా’ కూటమి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ విమర్శల వేళ మోదీ పరోక్షంగా ఆ అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. సోమవారం గుజరా త్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీ స్వామి నారా యణ్ ఆలయం 200వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖేడా జిల్లాలోని వడ్తాల్లో జరిగిన కార్యక్రమంలో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. అభివృద్ధిభారత్కు ఐక్యతే పునాది‘‘ఐక్యమత్యంతో పనిచేసే పౌరులు, దేశ సమగ్ర తతోనే భారత్ 2047 సంవత్సరంలో అభివృద్ధి చెందిన ఆధునిక భారత్‌గా అవతరించగలదు. దురదృష్టవశాత్తు కొందరు సమాజా న్ని కులం, మతం, ప్రాంతం,జాతి, లింగం, స్వస్థలం పేరిట విభజి స్తున్నారు. సంకుచిత మనస్తత్వంతో కొన్ని విభజన శక్తులు చేస్తున్న జాతవ్యతిరేక కుట్ర లివి. ఈ జాతివ్యతిరేక శక్తుల ఉద్దేశాలు ఎంత ప్రమాద కరమో మనం గమనించాలి. కుట్రల పర్యావసానాలను ఊహించాలి. ఈ దుష్టశక్తుల ఆటకట్టించేందుకు మనందరం ఐక్యంగా నిలబడదాం. పోరాడి వాటిని ఓడిద్దాం’’ అని అన్నారు. ఆత్మనిర్భరత మంత్రంతో ముందుకుసాగి అభివృద్ధిభారత్ను సాక్షాత్కారం చేసుకుందాం’’ అని పిలుపునిచ్చారు.ఆలయంతో ఆత్మీయ అనుబంధం‘‘నాటి దుర్భర పరిస్థితులకు ప్రజలు తమను తామే నిందించుకుంటూ కడుపేదరికంలో, బానిసత్వంలో బతు కీడుస్తున్న కాలంలో స్వామినారాయణ అవతరించారు. ఆపత్కాలంలో స్వామినారాయణ, సాధువులు భారతీయు లకు తమ కర్తవ్యబోధ చేసి ఆత్మగౌరవం గొప్పతనాన్ని తెలియజెప్పారు. దీంతో నూతన ఆధ్యాత్మిక శక్తితో ప్రజలు తమ అసలైన గుర్తింపును తెల్సుకోగలిగారు. వడ్తాల్ స్వామి నారాయణ్ ఆలయంతో నాకు దశాబ్దాల అనుబంధం ఉంది. ముఖ్యమంత్రిని అయ్యాక బంధం బలపడింది. 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్రప్రభుత్వం సైతం స్మారక నాణెంను ఆవిష్కరించింది’’ అని గుర్తుచేశారు. -
తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాను
ప్రముఖ్ స్వామి భౌతిక కాయానికి ప్రధాని మోదీ నివాళులు సారంగ్పూర్: స్వామి నారాయణ్ ఆధ్యాత్మిక విభాగాధిపతి ప్రముఖ్ స్వామికి ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఎర్రకోట నుంచి పంద్రాగస్టలు ప్రసం గం అనంతరం గుజరాత్ చేరుకున్న మోదీ.. సారంగ్‌పూర్‌లో ప్రముఖ్ స్వామి (95) పార్థివ దేహాన్ని సందర్శించి, భావోద్వేగానికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో స్వామీజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చాలామంది గురువును కోల్పోయి ఉండవచ్చేమో కానీ తాను మాత్రం తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయామని, స్వామీజీ బోధనలు చిరకాలం నిలిచిపోతాయని కొనియాడారు. -
అమెరికా విమాన టికెట్.. లక్షకు పైమాటే!!
అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? అయితే కొన్నాళ్లు ఆగండి. ఎందుకంటే, ఇప్పుడు అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలన్నీ మండిపోతున్నాయి. మామూలుగా అయితే ఎకానమీ క్లాస్ టికెట్ల ధర సుమారుగా 48 వేల రూపాయలు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 97 వేల వరకు ఉంది. న్యూయార్క్, చికాగో లాంటి నగరాలకు భారతదేశం నుంచి టికెట్లు రూ. 90 వేల నుంచి రూ. 1.20 లక్షల వరకు పలుకుతోంది. న్యూజెర్సీలో స్వామి నారాయణ్ మహోత్సవం జరుగుతోందని, దానికితోడు అక్కడ సెలవులు కూడా ఉన్నాయని, అలాగే అక్కడ కొత్త సెమిస్టర్లు మొదలవుతాయని, అందుకే ఇంత ఎక్కువ ధరలు పలుకుతున్నాయని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. స్వామి నారాయణ్ భక్తులు వేలాది సంఖ్యలో న్యూజెర్సీకి వెళ్లి, అక్కడ నిర్మిస్తున్న అతిపెద్ద అక్షర్ధామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. దాంతో ఒక్కసారిగా అన్ని విమానయాన సంస్థల ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలు రూ. 80 వేల నుంచి లక్ష వరకు పలుకుతున్నాయి.