తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాను
ప్రముఖ్ స్వామి భౌతిక కాయానికి ప్రధాని మోదీ నివాళులు
సారంగ్‌పూర్: స్వామి నారాయణ్ ఆధ్యాత్మిక విభాగాధిపతి ప్రముఖ్ స్వామికి ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఎర్రకోట నుంచి పంద్రాగస్టలు ప్రసం గం అనంతరం గుజరాత్ చేరుకున్న మోదీ.. సారంగ్‌పూర్‌లో ప్రముఖ్ స్వామి (95) పార్థివ దేహాన్ని సందర్శించి, భావోద్వేగానికి గురయ్యారు. చెమర్చిన కళ్లతో స్వామీజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చాలామంది గురువును కోల్పోయి ఉండవచ్చేమో కానీ తాను మాత్రం తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక గొప్ప మార్గదర్శకుడిని కోల్పోయామని, స్వామీజీ బోధనలు చిరకాలం నిలిచిపోతాయని కొనియాడారు.