
న్యూఢిల్లీ: నైజీరియా తీరంలో హాంకాంగ్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై మంగళవారం సముద్ర దొంగలు దాడి చేశారని ఏఆర్‌ఎక్స్ మారిటైమ్ అనే సంస్థ తెలిపింది. నౌకలోని 19 మంది సిబ్బందిని బందీలుగా తీసుకెళ్లారని, వారిలో 18 మంది భారతీయులని తెలిపింది. సమాచారం తెలియగానే నైజీరియాలోని భారతీయ దౌత్యాధికారులు నైజీరియా ప్రభుత్వాన్ని సంప్రదించి, భారతీయులు విడుదలయ్యేందుకు సహకరించాలని కోరారు.