సాక్షి, అమరావతి : ఏపీ మారిటైం బోర్డును ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ మేజర్ పోర్టుతోపాటు 14 నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. మరిని పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని పోర్టుల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తీరప్రాంత కారిడార్‌లో పరిశ్రమలను పెంచి పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రపంచంలో ఎగుమతులు, దిగుమతుల రంగంలో రాష్ట్రాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. దీనిలో భాగంగానే ఏపీ మారిటైం బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, బోర్డు ద్వారా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment