
షిప్పింగ్ కంటైనర్స్‌లో మిస్సైల్స్‌ను దాచి.. అన్ని తీర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తోన్న డ్రాగన్
China Hiding Missiles in Shipping Containers Plans to Attack Anywhere in the World: నయానో, భయానో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోన్న చైనా.. అందుకోసం ఎన్నో దుష్టపన్నాగాలను పన్నుతోంది. ఇప్పటికే హంకాంగ్‌ను ఆక్రమించేందుకు హాంకాంగ్ లా పేరిట కొత్త సెక్యూరిటీ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంపై హాంకాంగ్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఈ క్రమంలో తాజాగా చైనా దుష్ట పన్నాగం ఒకటి వెలుగులోకి వచ్చింది.
(చదవండి: ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?)
చైనా షిప్పింగ్ కంటైనర్లలో క్షిపణులని అక్రమంగా తరలిస్తోన్నట్లు సన్ పత్రిక వెల్లడించింది. ఈ మిస్సైల్స్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఓడరేవులకు అక్రమంగా చేరవేస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. వీటిని ప్రయోగించేందుకు చైనా సిద్ధపడుతోన్నట్లు తెలిసింది.
‘ది సన్’ నివేదిక ప్రకారం, ప్రపంచ మహాసముద్రాలలో చైనాకు చెందిన భారీ నౌకలు ఉన్నాయి. కొంతమంది పాశ్చాత్య పరిశీలకులు చైనా ఈ విధంగా క్షిపణులను అక్రమ రవాణా చేయడం.. కొత్త యుద్ధనౌకలను కొనుగోలు చేయడంతో సమానమని భావిస్తున్నారు. ఈ కంటైనర్లు సాధారణ కంటైనర్ల వలె కనిపిస్తాయి, కాబట్టి వాటిని ఇతర కంటైనర్లతో కలిపి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయవచ్చు.
(చదవండి: దుబాయ్‌లో భారీ పేలుడు; 35 కిమీ దూరం వినపడేలా)
అదే సమయంలో, శత్రు దేశ నౌకాశ్రయాలకు ఈ క్షిపణులను చేరవేయడం ద్వారా చైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా.. ఎప్పుడైనా ఆకస్మిక దాడిని ప్రారంభించగలదు. చైనా వద్ద స్టెల్త్ క్షిపణులు ఉండే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ అసెస్‌మెంట్ అండ్ స్ట్రాటజీ సెంటర్ రిక్ ఫిషర్ తెలిపింది. అమెరికా, చైనా ఇరు దేశాలు ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యంగా నిలవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఇక తైవాన్ భవిష్యత్తుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్‌ను ఆక్రమించాలనే ఉద్దేశంతో చైనా పావులు కదుపుతుండగా.. డ్రాగన్ నుంచి తైవాన్‌ను కాపాడతామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఈ క్రమంలో చైనా ఇలా కంటైనర్లలో మిస్సైల్స్‌ని రవాణా చేస్తుందనే వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
(చదవండి: మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!)
ఈ కొత్త క్షిపణుల నమూనా 2016 ఆర్మ్స్ ఫెయిర్‌లో కనిపించింది. అప్పటి నుంచి చైనా వీటిని ఎప్పుడైనా ప్రయోగించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ తన కోరిక మేరకు అరాచకాలను సృష్టించేందుకు కంటైనర్ క్షిపణులను పూర్తిగా ఉపయోగించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.