సాక్షి, విశాఖపట్నం : కోస్తా ప్రజలకు ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా భయపెడుతున్న వాయుగుండం ముప్పు తప్పింది. అయితే అల్పపీడనం గంటకు 30కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. పారాదీప్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఈ అర్థరాత్రి పారాదీప్ సమీపంలో ఉత్తర ఈశాన్య దిశగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో చదురుమదురు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment