విశాఖపట్నం : కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూరీకి 50 కీ.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశాలున్నాయన్నారు. ఆ సమయంలో 50 కీ.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.