వేలూరు(చెన్నై): జిల్లాలోని గుడియాత్తం సమీపంలో ఆదివారం రాత్రి ఆకాశం నుంచి ఒక వస్తువు పెద్ద శబ్దంతో కింద పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. గుడియాత్తం తాలూకా నెల్లూరుపేట పంచాయతీ పరిధిలోని లింగుండ్రం గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు పడింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చూశారు.
అక్కడ పారాచూట్ లాంటి వస్తువు, సమీపంలో సిగ్నిల్ ఉన్న చిన్న పెట్టెను కనుగొన్నారు. గుడియాత్తం పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో సిగ్నల్స్ ఉన్న చిన్న పెట్టెలో కేంద్ర ప్రబుత్వ జాతీయ వాతావరణ కేంద్రం, మీనంబాక్కం, చెన్నై అనే చిరునామా, ఫోన్ నంబరు ఉండడంతో చెన్నైలోని వాతావారణ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించారు. దీంతో చెన్నై వాతావరణ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు సిగ్నల్స్ ఉన్న పెట్టె సహకారంతో పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వాటిని సేకరించి పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు.
చదవండి: ఆరో తరగతిలోనే పెళ్లి.. నేనున్నానని తోడు నిలిచిన భార్య.. డాక్టర్ కొలువుకు ‘నీట్’గా
Comments
Please login to add a commentAdd a comment