సోయాబీన్‌లో సస్య రక్షణ చర్యలు | Soybean Plant protection measures | Sakshi
Sakshi News home page

సోయాబీన్‌లో సస్య రక్షణ చర్యలు

Published Mon, Aug 8 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

సోయాబీన్‌లో సస్య రక్షణ చర్యలు

సోయాబీన్‌లో సస్య రక్షణ చర్యలు

  • :ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి
  • :తెగులుతో పంటకు నష్టం
  • :ఏడీఏ వినోద్‌కుమార్‌
  • జహీరాబాద్‌ టౌన్‌:వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పత్తి, పెసర, కంది. మినుముతో అధిక విస్తీర్ణంలో సోయాబిన్‌ పంటను సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వేలాది ఎకరాల్లో పంట సాగవుతోంది.  వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో  పంటలు ఆశాజనకంగా  ఉంటే మరి కొన్ని ప్రాంతాల్లో దెబ్బతింది. ఉన్న పంటకు తెగులు ఆశిస్తున్నాయి. పలు రకాల తెగులు కారణంగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. పంటకు ఆశిస్తున్న తెగులు నివారణ గురించి వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్‌కుమార్‌(7288894426) ఇలా వివరించారు.

    • సోయాబిన్‌ పంటకు ప్రస్తుతం పల్లాకు తెగులు కనిపిస్తున్నాయి.
    • తెల్లదొమ వల్ల పల్లాకు తెగులు వ్యాపిస్తుంది.
    • ఈ తెగులు వల్ల ఆకులు రంగుమారిట్లుగా ఉంటాయి.
    • మొక్కల పెరుగుదల లోపించి, గిడసబారి దిగుబడులు తగ్గుతాయి.
    • వైరస్‌వల్ల కలిగే పల్లాకు తెగులను అరికట్టాలి
    • నివారణకుగాను 2 మి.లీ ట్రైజోఫాస్‌ మందును లీటరు నీటి చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.
    • ఎకరాకు గ్రీసు పూసిన పుసుపు రంగు అట్టలను వేలాడదీయాలి.దీంతో తెల్ల దొమ అట్టలకు అంటుక పోతాయి.


    కాండంతొలిచే పురుగు కనిపిస్తే మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
    ఆకుమచ్చ తెగులు ఆశిస్తే  గ్రాము కార్ఫండిజం లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేయాలి.
     బ్యాక్టీరియా ఆకు మచ్చతెగులు ఉన్నట్లయితే 1.5 గ్రాముల పోషామైసిన్, 15గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ను 10 లీటర్ల నీటకి కలిపి 2-3 సార్లు పిచికారి చేయాలి.

    కాండం తొలుచు పురుగు ఉధత్తం కనిపిస్తుంది.

    •  ఆకుల అడుగు భాగంలో కాండంతొలుచు పురుగు గుడ్లను పెడుతుంది.
    • ఈ గుడ్ల నుంచి వెలుబడిన పిల్ల పురుగులు కాండానికి గాటు పెట్టి లోపలికి ప్రవేశించి మెత్తటి పదార్థాన్ని తింటాయి.
    •  కాండం లోపలి నుంచి కింది వరకుగల మెత్తటి పదర్థాన్ని తినటం వల్ల కాండం బలహీనమై మొక్క పడిపోతుంది.
    • కాండం తొలచు పురుగు ఆశిస్తే 2 మి.లీ టైజోఫాస్‌ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
    •  పచ్చపురుగు, మొజాయిక్‌ తెగులు, పేనుబంక తెగులు కూడా పంటకు ఆశిస్తాయి.

    పచ్చపురుగ నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్‌ 50 శాతం 2.5 మి.లీ. లీటరు నీటి చొప్పున కలిపి పంటపై పిచికారి చేయాలి.మొజాయిక్, పేనుబంక తెగులు ఆశిస్తే డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదాఎసీఫేట్‌ 1.5 గ్రాములు లీటరు నీటకి కలిపి పిచికారి చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement