న్యూఢిల్లీ: భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్‌పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే..
► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి.
► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది.
► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్‌ఎల్‌పీ)ని ప్రారంభించారు.
► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్‌పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది.
► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది.
► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి.
► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్‌లో) సమయం భారతదేశం, సింగపూర్‌లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది.
50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది.
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
Published Mon, Apr 24 2023 12:17 AM | Last Updated on Mon, Apr 24 2023 12:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment