Supply of goods
-
భారత్ లాజిస్టిక్స్ దూకుడు
న్యూఢిల్లీ: భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. 2014తో ఈ ర్యాంక్ 54. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. ఆయా అంశాల్లో ప్రపంచ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ సర్వే, తత్సంబంధ అంశాలను పరిశీలిస్తే.. ► భారత్ మౌలిక రంగం అటు భౌతికంగా (హార్డ్), ఇటు సాంకేతికంగా (సాఫ్ట్) ఎంతో మెరుగుపడింది. రెండు విభాగాల్లోనూ గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి. ► ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024–25 నాటికి లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. మల్టీమోడల్ కనెక్టివిటీ కోసం నేషనల్ మాస్టర్ ప్లాన్– పీఎం గతి శక్తి పేరుతో కీలక చొరవలకు అక్టోబర్ 2021 శ్రీకారం చుట్టింది. ► త్వరితగతిన డెలివరీకి, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడానికి, తయారీ రంగం సమయం, డబ్బును ఆదా చేయడానికి, లాజిస్టిక్స్ రంగంలో కావలసిన వేగాన్ని తీసుకురావడానికి 2022లో ప్రధాన మంత్రి నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ఎల్పీ)ని ప్రారంభించారు. ► ఈ విధాన చర్యలు ఫలవంతమవుతున్నాయి. ఇది ఇప్పుడు ఎల్పీఐ మెరుగుదలకు దోహదపడుతోంది. ► భారత్ ర్యాంక్ మౌలిక సదుపాయాలకు సంబంధించి 2018లో 52వ స్థానం వద్ద ఉంటే, 2023లో 47వ స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో అంతర్జాతీయ సరకు ఎగుమతులకు సంబంధించి ర్యాంక్ 44 నుంచి 22కు ఎగసింది. లాజిస్టిక్స్ సామర్థ్యం, సమానత్వంలో విషయంలో నాలుగు స్థానాలు ఎగబాకి 48వ స్థానానికి చేరుకుంది. ట్రాకింగ్, ట్రేసింగ్ విషయాల్లో ర్యాంక్ 3 స్థానాలు జంప్ చేసి 38కి ఎగసింది. ► భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు లాజిస్టిక్స్ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించడానికి ఆధునికీకరణ, డిజిటలైజేషన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ► 2015 నుండి భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధిత సాంకేతికతను గణనీయంగా మెరుగుపరిచింది. అలాగే భౌతికంగా సైతం మౌలిక రంగంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. లాజిస్టిక్స్ పురోగతిలో సాంకేతికత కీలకమైన అంశంగా ఉంది. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో సప్లయ్ చైన్ విజిబిలిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహణ వల్ల లాజిస్టిక్స్ విభాగంలో ఆలస్యాలు గణనీయంగా తగ్గాయి. ► 2022 మే – అక్టోబర్ మధ్య కంటైనర్ నిరీక్షణ (పోర్ట్ లేదా టెర్మినల్స్‌లో) సమయం భారతదేశం, సింగపూర్లలో మూడు రోజులుగా ఉంది. ఇది కొన్ని పారిశ్రామిక దేశాల కంటే మెరుగ్గా ఉంది. అమెరికాలో ఈ సమయం ఏడు రోజులు ఉంటే, జర్మనీలో 10 రోజులుగా ఉంది. విశాఖపట్నం పోర్ట్ విషయంలో 2015లో ఈ సమయంలో 32.4 రోజులు ఉంటే, 2019లో 5.3 రోజులకు తగ్గింది. 50వేల కిలోమీటర్ల అదనపు జాతీయ రహదారులు దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం పెద్ద ఎత్తున నడుస్తోంది. మోదీ సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనా కాలంలో 50,000 కిలోమీటర్ల మేర అదనంగా జాతీయ రహదారుల నిడివి పెరిగింది. 2014–15 నాటికి జాతీయ రహదారుల విస్తీర్ణం 97,800 కిలోమీటర్లుగా ఉంటే.. 2023 మార్చి నాటికి 1,45,155 కిలోమీటర్లకు పెరిగినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2014–15లో సగటున ఒక్క రోజు 12.1 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించగా, 2021–22లో ఇది 28.6 కిలోమీటర్లకు పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రహదారుల వసతులు ముఖ్య పాత్ర పోషించడం తెలిసిందే. ఆర్థికాభివృద్ధితోపాటు సామా జికాభివృద్ధి కూడా రహదారుల విస్తరణతో సా ధ్యపడుతుంది. ఏటా మన దేశంలో వస్తు రవాణాలో 70 శాతం, ప్రయాణికుల రవాణాలో 85 శాతాన్ని రహదారులే తీరుస్తున్నాయి. 63.73 ల క్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారత్ ప్రపంచంలో విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. -
పరమేశ్వరా... ఫలసరుకుల్లేవు
కోట్లలో ఆదాయుం.. అయినా సరుకుల కొరత సరఫరా నిలిపేసిన టెండరుదారులు ఏరోజుకారోజు సరుకుల కొనుగోలు అదనంగా నెలకు రూ.30 లక్షల భారం వాయులింగేశ్వరాలయంలో ఫలసరుకుల కొరతఏర్పడింది. కాంట్రాక్టర్లకు బకాయిపడడంతో సరుకుల సరఫరా నిలిపేశారు. ప్రసాదాల తయారీ, అన్నదానం నామమాత్రంగా సాగుతోంది. కోట్లలో ఆదాయం ఉన్న ఆలయంలో ఇలాంటి దుస్థితి దాపురించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. శ్రీకాళహస్తి: రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఏటా రూ.100 కోట్లకుపైగా ఆదాయుం వస్తోంది. ఆలయూనికి అవసరమైన సువూరు 140 రకాల సరుకులు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వారికి నెలకు రూ.80 లక్షల వరకు దేవస్థానం చెల్లిస్తోంది. అరుుతే జనవరిలో జరిగిన టెండర్లు గందరగోళంగా ఉన్నాయని పలువురు కోర్టుకెక్కారు. దీంతో పాత కాంట్రాక్టరు నాలుగు నెలలుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అరుుతే వారు కూడా తవుకు రూ.80 లక్షల బిల్లులు చెల్లించలేదంటూ పది రోజుల క్రితం సరఫరా నిలిపేశారు. దీంతో అవసరమైన సరుకుల కొరత ఏర్పడింది. అధికారులు శ్రీకాళహస్తి పట్టణంలోనే కొన్ని సరుకులు ఏరోజుకారోజు కొనుగోలు చేస్తున్నారు. అరుుతే కాంట్రాక్టరు ఇచ్చే సరుకుల ధరలకన్నా 30 శాతం అదనంగా చెల్లించి సరుకులు కొంటున్నారు. స్థానికంగా కొనుగోలు చేస్తే నెలకు రూ.1.10 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇవే సరుకులు కాంట్రాక్టరు రూ.80 లక్షలతోనే సరఫరా చేసేవారు. రేపోవూపో గడిస్తే శనగపప్పు, మిరియూలు, బెల్లం, కందిపప్పు, పెసలపప్పు, జీడిపప్పు, వుంచినూనె, శనగనూనె, రాహుకేతు పూజలకు అవసరమైన ఉద్దులు, ఉలవలతోపాటు చక్కెర, మిరపకాయులు, వివిధ రకాల నూనేలు, రుద్రాభిషేకానికి అవసరమైన వస్తువులు ఒకటి కాదు రెండు కాదు 140 రకాల వస్తువుల వరకు కొరత ఏర్పడే ప్రవూదం ఉంది. వురోవైపు అన్నదానంకు రోజు 8వేల వుంది భక్తులకు భోజనం కోసం సరుకుల కొరత తప్పేలాలేదు. వారం రోజుల్లో సవుస్య పరిష్కరిస్తాం దేవస్థానంలో ఫలసరుకుల కొరత వాస్తవమే. అరుుతే వారం రోజుల్లో ఈ సవుస్యను పరిష్కరిస్తాం. టెండర్ల విషయుం కోర్టులో నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఈవో భ్రవురాంబ కూడా ఈ విషయుంపై హైకోర్టుకు వెళ్లింది.పాత టెండర్‌దారులు తవుకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఇస్తేనే సరుకులు పంపుతానంటున్నారు. వారం రోజులుగా సరుకుల కొరత ఏర్పడడంతో స్థానికంగా కొనుగోలు చేస్తున్నాం. అరుుతే పాత టెండర్‌దారులు ఇస్తున్న ధరలకే కొంటున్నాం. అదనంగా భారం పడడంలేదు. -పోతుగుంట గురవయ్యునాయుుడు, ఆలయు చైర్మన్ సరుకుల కొరత బాధాకరం శ్రీకాళహస్తి దేవస్థానంలో ఫలసరుకుల కొరత బా ధాకరం. టెండర్ల విషయుంలో అధికారపక్ష నేతల జోక్యంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించింది. కోట్ల రూపాయలు ఆదాయుం వస్తున్న ఆలయుం లో ఏరోజుకు ఆరోజు అవసరమైన సరుకులు కొనుగోలు చేయూల్సిన దుస్థితిని టీడీపీ నేతలే తీసుకువచ్చారు. వారం రోజుల క్రితం క్యూలైన్లు వూర్పు చేశారు. క్యూలైన్ల కుదింపుతో కేవలం వెయ్యి వుంది భక్తులు వూత్రమే లోపల ఉంటున్నారు. దీంతో ఆలయుం బయుట క్యూలైన్ పట్టణంలోని బజారువీధి వరకు వస్తోంది. వుంత్రి చేతిలో ఆలయు చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు కీలుబొవ్ము కావడంతోనే ఈ దుస్థితి. ఆలయు చైర్మన్ తీరు వూర్చుకోకపోతే గాలిగోపురం వద్ద భక్తుల పక్షాన పోరాటం చేస్తాం. -బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవున్వయుకర్త, శ్రీకాళహస్తి -
రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ
► నాలుగురోజుల్లోనే జిల్లాలో 50.25 శాతం సరఫరా ► తెనాలి డివిజన్లో 49.88 శాతం తెనాలి : రేషన్ దుకాణాల్లో సరఫరా చేస్తున్న నిత్యావసర సరకుల పంపిణీ వేగవంతం చేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో కచ్చితంగా దుకాణాలు తెరచి ఉంచడం, కార్డుదారులకు సరఫరా చేయడంతో డీలర్లను పరుగులు తీయిస్తున్నారు. మార్చి నెల నుంచి పదో తేదీలోగా పంపిణీ పూర్తిచేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా 5వ తేదీతో ముగించేయాలని నిర్ణయం తీసుకున్నా, కార్డుదారులు మిగిలిపోవడంతో పొడిగించారు. ఏప్రిల్‌లో మళ్లీ అదే స్పీడుతో పనిచేయిస్తున్నారు. ఫలితంగా 4వ రోజయిన సోమవారం సాయంత్రానికి జిల్లాలో 50.25 శాతం సరకుల పంపిణీని పూర్తిచేయగలిగారు. తెనాలి డివిజన్లోని 18 మండలాల్లో 49.99 శాతం పంపిణి చేసినట్టు ఆర్డీవో జి.నర్సింహులు తెలియజేశారు. డివిజన్లో 842 చౌకధరల దుకాణాలు ఉండగా, 4,10,923 కార్డుదారులు ఉన్నారు. ఇందులో 2,04,988 మంది కార్డుదారులు తమ సరకులు తీసుకున్నారు. వాస్తవంగా పంపిణీ గడువు పూర్తయ్యేసరికి 80-85 శాతం సరకులనే పంపిణీ చేయగలుగుతున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చౌకదుకాణం వరకు వెళ్లి వేలిముద్రలు వేయడం తప్పనిసరి కావడంతో అది ఇష్టం లేని కొందరు సరకులు తీసుకోవడం లేదు. బియ్యం, పంచదార అవసరం లేని కార్డుదారులు ఇదే తరహాలో పట్టించుకోకపోవడం ఇందుకు కారణం. 85 శాతానికి మించని పంపిణీలో ఇప్పటికే 50 పూర్తయిందంటే చాలావరకు సరఫరా చేసినట్టని చెప్పొచ్చు. డివిజన్లో ఇతర మండలాలకన్నా నగరం మండలం 64.19 శాతం సరకుల పంపిణీతో ప్రథమస్థానంలో ఉంది. ఇక్కడ 17,410 కార్డుదారులకు 11,176 మంది కార్డుదారులు సరకులు తీసుకున్నారు. ద్వితీయస్థానంలో నిజాంపట్నం మండలం (56.35 శాతం), తర్వాతి స్థానంలో కాకుమాను మండలం (56.33 శాతం) ఉన్నాయి. అన్నిటికన్నా తక్కువగా 38,91 శాతం పంపిణీతో దుగ్గిరాల మండలం చివరిస్థానంలో ఉంది. చివరి నుంచి రెండోస్థానంలో తెనాలి నిలిచింది. ఇక్కడ 42.5 శాతం పంపిణీ చేయగలిగారు. -
ఇదేం యాపారం!
కరవమంటే కప్పకు..విడవమంటే పాముకు.. అన్నట్లు తయారైంది డీసీఎంఎస్ (జిల్లా మార్కెటింగ్ సొసైటీ)అధికారుల పరిస్థితి. అసలే డీసీఎంఎస్ సంక్షోభంలో ఉంది. ఆదాయం సమకూరే కార్యకలాపాలు, ఆర్థిక సామర్థ్యం లేకపోవడం వల్ల పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి డీసీఎంఎస్ది. ఈ నేపథ్యంలో దాన్ని ఎలాగైనా బతికించాలని వివిధ ప్రభుత్వ సంస్థలకు సరుకులు సరఫరా చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా ప్రభుత్వాలు అప్పగిస్తూ వస్తున్నాయి. అయితే, ఆ స్థాయి పెట్టుబడి లేకపోవడంతో డీసీఎంఎస్ తిరిగి సబ్ కాంట్రాక్ట్ ఇస్తోంది. దీని ముసుగులో అధికారంలో ఉన్న నేతలు ప్రవేశిస్తున్నారు. తమ అనుకూల వ్యక్తుల్ని సబ్ కాంట్రాక్టర్లుగా వేయిస్తున్నారు. అదే పనిగా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సరుకుల సరఫరా బాధ్యత పంపకాలు చేయలేక అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సరుకుల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. డీసీఎంఎస్‌కు మేలు చేద్దామని టెండర్ల ద్వారా అప్పగిస్తున్నా అదికాస్త ప్రైవేటు వ్యక్తులకు మేలు చేకూరుస్తోంది. డీసీఎంఎస్‌కు వచ్చే ప్రయోజనం కన్నా దళారి వ్యాపారులకొచ్చే లాభం ఎక్కువైపోతోంది. అదే ఆశతో మరికొందరు వ్యాపారులు ఎగబడడంతో డీసీఎంఎస్ అధికారులు నలిగిపోతున్నారు. కమీషన్ల కోసం అధికార పార్టీ నాయకులు, లాభాల కోసం దళారీ వ్యాపారులు పైన పడడంతో డీసీఎంఎస్‌కు అసలుకే ఎసరొచ్చే పరిస్థితి ఏర్పడింది. డీసీఎంఎస్ ద్వారా ఏటా ఐసీడీఎస్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు సరుకులను సరఫరా చేస్తున్నారు. టెండర్ల ద్వారా సరుకుల సరఫరా కాంట్రాక్ట్ దక్కినా ఆ సరఫరా బాధ్యతను డీసీఎంఎస్ మరో ప్రైవేటు ట్రేడర్స్‌కు అప్పగిస్తోంది.అయితే, ప్రైవేటు ట్రేడర్స్ ఎంపిక అధికారుల ప్రమేయం లేకుండా నేతల సిఫారసుల మేరకు జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చెప్పిన వారికి, ప్రస్తుతం టీడీపీ నేతలు సూచించిన వారికి కట్టబెడుతున్న పరిస్థితి దాపురించింది. టీడీపీ అధికారంలోకి రాక ముందు వరకు ఐసీడీఎస్ సరుకుల సరఫరా సబ్ కాంట్రాక్ట్ బాధ్యతలను విశాఖపట్నానికి చెందిన సుబ్రహ్మణ్యం ట్రేడర్స్ నిర్వహిస్తూ వచ్చింది. ఈ ఏడాది జూన్‌తో వారి కాంట్రాక్ట్ ముగిసింది. ఇదే సమయంలో టీడీపీ నేతలు రంగ ప్రవేశం చేశారు. ఐసీడీఎస్ సబ్ కాంట్రాక్ట్‌తో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు,రెసిడెన్షియల్ స్కూల్స్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సరుకులు సరఫరా చేసే సబ్ కాంట్రాక్ట్పైనా కన్నేశారు. ఇప్పటికే హాస్టల్స్‌కు సంబంధించి కనకమహలక్ష్మీ గ్రౌండ్నట్ అండ్ ఆయిల్ మిల్లు, శివ పద్మావతి ట్రేడర్స్ సబ్ కాంట్రాక్ట్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల సిఫారసు మేరకు హరిపద్మ ట్రేడర్స్ రంగంలోకి దిగింది. దీంతో డీసీఎంఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. పాత వారిని రద్దు చేస్తే న్యాయపరమైన చిక్కులొస్తాయని, వారితో మాట్లాడుకుని సర్దుకుపోవాలని సూచించడంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఐసీడీఎస్ సబ్ కాంట్రాక్ట్‌ను కనకమహలక్ష్మీ గ్రౌండ్ నట్ అండ్ అయిల్ కంపెనీకి, కే.ఎల్.ఎన్.ట్రేడర్స్కిచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే వివిధ శాఖల హాస్టల్స్, విద్యాలయాలు, రెసిడెన్సియల్ స్కూల్స్‌కు సరఫరా చేసే సబ్ కాంట్రాక్ట్ బాధ్యతలను కనకమహలక్ష్మీ గ్రౌండ్నట్ అండ్ ఆయిల్ కంపెనీ, శివ పద్మావతి ట్రేడర్స్‌తో పాటు హరిపద్మ ట్రేడర్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఐసీడీఎస్ సరుకుల సరఫరాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో డీసీఎంఎస్ సరుకుల సరఫరా కాంట్రాక్ట్‌ను రద్దు చేసి టెండర్లు పిలవాలని కలెక్టర్ నిర్ణయించారు. ఆమేరకు డీసీఎంఎస్ కూడా తమ సబ్ కాంట్రాక్ట్‌గా ఉన్న కనకమహలక్ష్మీ గ్రౌండ్నట్ అండ్ ఆయిల్ కంపెనీ, కేఎల్ఎన్ ట్రేడర్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. మార్చి వరకు ఒప్పందం ఉండి మధ్యలో రద్దు చేయడమేంటని సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తర్వు లొచ్చాయి. పై రెండు సంస్థలకు సరుకులు సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ విధంగా కొనసాగుతున్న సబ్ కాంట్రాక్ట్‌లపై టీడీపీ నేతలకు సన్నిహితంగా ఉన్న మరికొన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఒక్కొక్కరు ఎగబడడంతో డీసీఎంఎస్ అధికారుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇటువంటి ఇబ్బందులేవీ ఎదురు కాకుండా ఉండాలంటే డీసీఎంఎస్సే తమకొచ్చిన కాంట్రాక్ట్ మేరకు నేరుగా సరుకుల సరఫరా చేసే బాధ్యతను చేపట్టాలి. అందుకు తగ్గ పెట్టుబడిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆ కాస్తా.. ఆధార్‌మూ కట్!
►ఆధార్‌తో అనుసంధానం కాని కార్డులకు రేషన్ నిలిపివేత ►ఆగస్టు కోటా నుంచే అమలుకు అధికారులు సిద్ధం ►జిల్లాలో ఇంకా పూర్తి కాని ఆధార్ నమోదు ప్రక్రియ ►6.36 లక్షల యూనిట్లకు నిలిచిపోనున్న సరుకుల సరఫరా ►ప్రభుత్వ నిర్ణయంతో పేదవర్గాలకు శరాఘాతం శ్రీకాకుళం పాత బస్టాండ్: మంత్రి కాదంటారు.. అధికారులు తప్పదంటారు!.. అనడమే కాదు.. మంత్రి సూచనలను బేఖాతరు చేస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు. ఫలితంగా ఆగస్టు నెల నుంచి లక్షలాది మందికి రేషన్ సరఫరా నిలిచిపోనుంది. ఇదంతా ఆధార్ కార్డుల పితలాటకం. పేదలకు నెలనెలా ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులు ఎంతోకొంత ఆదరువుగా ఉంటున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం, అనుసంధానం చేసుకోని కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్ కోటా నిలిపివేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయించడంతో పేదలు ఆ చిన్న ఆధారం కూడా కోల్పోయినట్లే. దీని వల్ల జిల్లాలో 6,36,828 మంది ప్రజలకు రేషన్ నిలిచిపోనుంది. ఆధార్ ప్రక్రియ మూడేళ్ల క్రితం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వం మాత్రం అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తోంది. అందులో భాగంగానే రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. జూలై 31తో దీని గడువు ముగుస్తుంది. అప్పటికీ అనుసంధానం చేసుకోని వారికి ఆగస్టు నెల రేషన్ కట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్ లేని రేషన్ యూనిట్లను గుర్తించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఆధార్‌తో పని లేకుండా కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వాలని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత ఒకపక్క సూచిస్తున్నా.. అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. పది నెలలుగా కేంద్రాల మూత ఆధార్ నమోదు ప్రక్రియ పెద్దగా ముందుకు సాగడం లేదు. గత పది నెలలుగా నమోదు కేంద్రాలను మూసివేశారు. మండల, డివిజన్ స్థాయిలో నిరంతరం పని చేసేలా ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా, అధికారులు మాత్రం ఆ పనిని మీ సేవ కేంద్రాలకు అప్పజెప్పారు, అయితే అక్కడ నివాస ధ్రువపత్రాలు, నెట్వర్క్, ఇతర సమస్యల కారణంగా ఆధార్ నమోదు ప్రక్రియ అంతగా జరగడం లేదు. మరోవైపు పేరు నమోదు చేయించుకున్నా ఇప్పటికి వేల సంఖ్యలో ప్రజలకు ఆధార్ నెంబర్లు గానీ, కార్డులు గానీ అందలేదు. ఈ కారణాల వల్ల జిల్లాలోని రేషన్ కార్డుదారుల్లో ఇప్పటివరకు 76.15 శాతం మందే ఆధార్ నెంబర్ పొందారు. వీరంతా రేషన్ కార్డులతో అనుసంధానం చేయించుకున్నా మిగిలిన 23.85 శాతం మంది పరిస్థితి అగ మ్యగోచరంగా మారింది. వీరితోపాటు వికలాంగులు, పిల్లలు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వేలుముద్రలు, ఐరిష్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా పేద వర్గాలకు చెందిన వారే కావడం.. ఆధార్ లేకపోవడం వల్ల బియ్యం, ఇతర రేషన్ సరుకులు అందకుండాపోయే ప్రమాదం ఉంది. 6,360 క్వింటాళ్ల కోటా బియ్యం కట్ జిల్లాలో 7,98,415 కుటుంబాలకు రేషను కార్డులు ఉన్నాయి. వీటిలో 26,70,083 మంది పేర్లు(యూనిట్లు) నమోదై ఉన్నాయి. రేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యుడిని ఒక్కో యూనిట్‌గా పరిగణించి నాలుగు కేజీలు చొప్పున బియ్యం అందజేస్తారు. అయితే వీరిలో ఇంతవరకు 18,09,976 (76,15 శాతం) మందే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన 6,36,828 మంది (23,85శాతం) అనుసంధానం కాలేదు, ఈ లెక్కన ఆగస్టు నుంచి జిల్లాలో సుమారు 6,360 క్వింటాళ్ల బియ్యం కోటా రద్దుకానుంది. ఈ మేరకు రాయితీ భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. ఈ భారం సాధ్యమైనంత వరకు తగ్గించుకునేందుకే బోగస్ కార్డులు, ఆధార్ అనుసంధానం పేరుతో కోటా కట్ చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.