కోట్లలో ఆదాయుం.. అయినా సరుకుల కొరత
సరఫరా నిలిపేసిన టెండరుదారులు
ఏరోజుకారోజు సరుకుల కొనుగోలు
అదనంగా నెలకు రూ.30 లక్షల భారం
వాయులింగేశ్వరాలయంలో ఫలసరుకుల కొరతఏర్పడింది. కాంట్రాక్టర్లకు బకాయిపడడంతో సరుకుల సరఫరా నిలిపేశారు. ప్రసాదాల తయారీ, అన్నదానం నామమాత్రంగా సాగుతోంది. కోట్లలో ఆదాయం ఉన్న ఆలయంలో ఇలాంటి దుస్థితి దాపురించడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి.
శ్రీకాళహస్తి: రాహుకేతు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఏటా రూ.100 కోట్లకుపైగా ఆదాయుం వస్తోంది. ఆలయూనికి అవసరమైన సువూరు 140 రకాల సరుకులు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. వారికి నెలకు రూ.80 లక్షల వరకు దేవస్థానం చెల్లిస్తోంది. అరుుతే జనవరిలో జరిగిన టెండర్లు గందరగోళంగా ఉన్నాయని పలువురు కోర్టుకెక్కారు. దీంతో పాత కాంట్రాక్టరు నాలుగు నెలలుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అరుుతే వారు కూడా తవుకు రూ.80 లక్షల బిల్లులు చెల్లించలేదంటూ పది రోజుల క్రితం సరఫరా నిలిపేశారు. దీంతో అవసరమైన సరుకుల కొరత ఏర్పడింది. అధికారులు శ్రీకాళహస్తి పట్టణంలోనే కొన్ని సరుకులు ఏరోజుకారోజు కొనుగోలు చేస్తున్నారు. అరుుతే కాంట్రాక్టరు ఇచ్చే సరుకుల ధరలకన్నా 30 శాతం అదనంగా చెల్లించి సరుకులు కొంటున్నారు. స్థానికంగా కొనుగోలు చేస్తే నెలకు రూ.1.10 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఇవే సరుకులు కాంట్రాక్టరు రూ.80 లక్షలతోనే సరఫరా చేసేవారు. రేపోవూపో గడిస్తే శనగపప్పు, మిరియూలు, బెల్లం, కందిపప్పు, పెసలపప్పు, జీడిపప్పు, వుంచినూనె, శనగనూనె, రాహుకేతు పూజలకు అవసరమైన ఉద్దులు, ఉలవలతోపాటు చక్కెర, మిరపకాయులు, వివిధ రకాల నూనేలు, రుద్రాభిషేకానికి అవసరమైన వస్తువులు ఒకటి కాదు రెండు కాదు 140 రకాల వస్తువుల వరకు కొరత ఏర్పడే ప్రవూదం ఉంది. వురోవైపు అన్నదానంకు రోజు 8వేల వుంది భక్తులకు భోజనం కోసం సరుకుల కొరత తప్పేలాలేదు.
వారం రోజుల్లో సవుస్య పరిష్కరిస్తాం
దేవస్థానంలో ఫలసరుకుల కొరత వాస్తవమే. అరుుతే వారం రోజుల్లో ఈ సవుస్యను పరిష్కరిస్తాం. టెండర్ల విషయుం కోర్టులో నడుస్తోంది. రెండు రోజుల క్రితం ఈవో భ్రవురాంబ కూడా ఈ విషయుంపై హైకోర్టుకు వెళ్లింది.పాత టెండర్‌దారులు తవుకు రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఇస్తేనే సరుకులు పంపుతానంటున్నారు. వారం రోజులుగా సరుకుల కొరత ఏర్పడడంతో స్థానికంగా కొనుగోలు చేస్తున్నాం. అరుుతే పాత టెండర్‌దారులు ఇస్తున్న ధరలకే కొంటున్నాం. అదనంగా భారం పడడంలేదు. -పోతుగుంట గురవయ్యునాయుుడు, ఆలయు చైర్మన్
సరుకుల కొరత బాధాకరం
శ్రీకాళహస్తి దేవస్థానంలో ఫలసరుకుల కొరత బా ధాకరం. టెండర్ల విషయుంలో అధికారపక్ష నేతల జోక్యంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించింది. కోట్ల రూపాయలు ఆదాయుం వస్తున్న ఆలయుం లో ఏరోజుకు ఆరోజు అవసరమైన సరుకులు కొనుగోలు చేయూల్సిన దుస్థితిని టీడీపీ నేతలే తీసుకువచ్చారు. వారం రోజుల క్రితం క్యూలైన్‌లు వూర్పు చేశారు. క్యూలైన్‌ల కుదింపుతో కేవలం వెయ్యి వుంది భక్తులు వూత్రమే లోపల ఉంటున్నారు. దీంతో ఆలయుం బయుట క్యూలైన్ పట్టణంలోని బజారువీధి వరకు వస్తోంది. వుంత్రి చేతిలో ఆలయు చైర్మన్ పోతుగుంట గురవయ్యునాయుుడు కీలుబొవ్ము కావడంతోనే ఈ దుస్థితి. ఆలయు చైర్మన్ తీరు వూర్చుకోకపోతే గాలిగోపురం వద్ద భక్తుల పక్షాన పోరాటం చేస్తాం. -బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సవున్వయుకర్త, శ్రీకాళహస్తి