ముంబై: ఆర్‌పీజీ గ్రూప్ తాజాగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ సంస్థలకు సాఫ్ట్‌వేర్ సేవలందించే (సాస్) దిశగా తాబి మొబిలిటీ వెంచర్‌ను ఆవిష్కరించింది. ఆయా సంస్థలు తమ వాహనాలను, లాజిస్టిక్స్ కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించుకునేందుకు, లోపాలను సవరించుకునేందుకు తాబి సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుంది.
ఇంధన వ్యయాల ను తగ్గించుకునేందుకు, వాహనాల వినియోగాన్ని మరింత సమర్ధమంతంగా పెంచుకునేందుకు ఇది సహాయపడగలదని సంస్థ సీఈవో పాలి త్రిపాఠి తెలిపారు. తాబి సొల్యూషన్స్ ఇప్పటికే 100 రోజు ల్లో 100 క్లయింట్ల వ్యాపారవృద్ధికి దోహదపడిందని వివరించారు. 45,000 పైచిలుకు లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాహనాల అప్‌టైమ్‌ను 60,000 కిలోమీటర్ల మేర మెరుగుపర్చిందని త్రిపాఠి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment