mobility
-
ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానాఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది. -
World EV Day 2024: దేశంలో రయ్ మంటున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫోటోలు)
-
కాలం చెల్లిన బాబు నమూనా
ఫ్రెంచ్ వనిత డా‘‘ డెలాల్ బెన్బాబాలి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సోషల్ జాగ్రఫీ – ఆంత్రో పాలజీ స్కాలర్. ఆమె – ‘క్యాస్ట్ డామినెన్స్ అండ్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా: అండర్స్టాండింగ్ కమ్మాస్ సోషియో –స్పేషియల్ మొబిలిటీ’ అంశంపై పరిశోధన చేశారు. ఆమె తన పరిశోధనలో ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం ఆసక్తికరమైనది. ఒక భూభాగంపై ఆధిపత్యం చలాయించే విషయంలో జనాధిక్యత ఉండే కులాలకూ, ఆధిపత్య కులాలకూ మధ్యఉండే వ్యత్యాసాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారామె. ‘హైదరాబాద్ నగరంలో ఆంధ్ర కల్చర్ విస్తరించడంలో కొత్తగా వలస వచ్చినవారి పాత్ర,’ ‘సామాజిక ఊర్ధ్వ చలనానికి దోహదం చేస్తున్న వలసలు’ వంటి మరో రెండు పరిశోధనా పత్రా లను కూడా గమనిస్తే వాటిల్లో ‘కామన్’గా కనిపి స్తున్న అంశాలు మూడు ఉన్నాయి. అవి – భూమి, వలసలు, ఆధిపత్యం. ఈ అంశాలను, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అన్వయించడం జరిగింది. ఆమె విదేశీ స్కాలర్ కనుక ఆమెకు ఇక్కడి రాజకీయాలు, కులాల విషయంలో ఇష్టాయిష్టాలకు ఆస్కారం లేదు. పైగా ఆమె పరిశోధనా వ్యాసాలు 2010కి ముందు కాలం నాటివి. కనుక ఆమె సూత్రీక రణలలోని నిజాయతీని అనుమానించడానికి ఆస్కారం కనిపించదు. అయితే, ఆమె తన మొత్తం పరిశోధనను – ‘ఆధిపత్యం’ వద్దకు తెచ్చి ఒక ముగింపు ఇవ్వడం, అందుకు ఆమె తీసుకున్న ఉదాహరణను ముందుగా మనం గుర్తించాలి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలసవచ్చిన చంద్రబాబు కులస్థులు హైదరాబాద్ నగరానికి పశ్చిమాన జూబ్లీ హిల్స్–కూకట్ పల్లికి మధ్య ఉన్న భూములను ఆవాసాలుగా చేసుకుని స్థిరపడ్డారు. దాంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆప్రాంతంలో ‘రియల్ ఎస్టేట్’ వ్యాపారాన్ని ప్రోత్స హించి, దాన్ని ‘సైబరాబాద్’ అంటూ వారు ప్రయోజనం పొందే వ్యూహాన్ని అమలు చేశారు. అతని వ్యూహం మేరకు అది విజయవంతం అయినప్పటికీ, హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా స్థానికులు వీరి ‘ఆధిప త్యాన్ని’ ప్రశ్నించడంతో రాష్ట్ర విభజన జరిగింది. దాంతో ఏపీ సీఎంగా చంద్రబాబు మళ్ళీ అదే పాత ‘సైబరాబాద్’ వ్యూహాన్ని ఈసారి – ‘రాజధాని అమరావతి’ పేరుతో ఇక్కడ అమలుకు తెర తీశారు. బాబు దాని కోసం, భారత ప్రభుత్వం నియమించిన ‘శివరామ కృష్ణన్ కమిటీ’ నివేదికను సైతం పక్కనపెట్టి, అందుకు ‘ఎన్డీయే’లో టీడీపీ భాగస్వామ్యాన్ని అడ్డంగా వాడుకున్నారు. అమరావతి భూమి పూజకు 2016లో వచ్చిననరేంద్రమోదీ ఆ తర్వాత, బాబు ఏపీ తన సొంత జాగీరు అన్నట్టుగా, విదేశీ కంపెనీలతో నిర్మాణ ఒప్పందాలు, ‘అమరావతి’ భూముల్లో వాటాలు ఇచ్చినా, ఏనాడూ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? అని అడిగింది లేదు. బాబు నిజంగా ‘విజనరీ’ అయితే, కొత్త రాష్ట్రం అభివృద్ధి కోసం మొదటి ఐదేళ్లలో పూర్తి చేయగలిగిన ‘ప్లాన్’ మాత్రమే అమలు చేయాలి. అదే జగన్ మోహన్ రెడ్డి విషయంలో చూడండి. అన్ని ఆర్థిక స్థాయుల్లోని వర్గాలకు ‘సంక్షేమం’అందిస్తూనే, రెండున్నర ఏళ్ళ ‘కరోనా’ కాలాన్ని దాటి, తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి 16 వేల కోట్ల రూపాయలతో 4 పోర్టులు, రూ. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ లేండ్సెంటర్లు నిర్మిస్తున్నారు. అలా శ్రీకాకుళం నుంచి చిత్తూరు సరిహద్దు వరకు సముద్ర తీరం వెంట సహజ ప్రకృతి వనరుల అభివృద్ధికి పెట్టుబడుల్ని వికేంద్రీకరించడం వల్ల; భవిష్యత్తులో ‘భూమి’ దాని సొంతదారు ‘ఆధిపత్యం’ వంటివి ఇకముందు లేకపోగా, ‘వలసలు’ కూడా ఇకముందు తగ్గుతాయి. డా‘‘ డెలాల్ బెన్బాబాలి తన పరిశోధనా వ్యాసాల్లో ప్రస్తావించిన – భూమి, వలసలు, ఆధిపత్యం అంశాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తన తొలి టర్మ్‌లోనే ‘అడ్రెస్’ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆమె పరిశోధనా వ్యాసాలు– కమ్మ కులం కేంద్రంగా ఉన్నప్పటికీ, రెడ్ల ప్రస్తావనను ఆమె వదిలి పెట్టలేదు. అయినా ఇక్కడ కులాలు ఏవి అనే ఆరా కంటే, ‘ఎప్పుడు’, ‘ఎవరు’ అనే దృష్టి మనకు ముఖ్యం. దేశం స్వతంత్రమై వందేళ్లకు చేరువ అవుతున్నప్పుడు, వనరుల పంపిణీ అన్ని ప్రాంతాలకూ, అన్ని సామాజిక వర్గాలకూ వారి వారి దామాషా మేరకు చేరే ప్రయత్నం మొద లయిందా లేదా అనేది ఇక్కడ కీలకం. తన మొదటి ఐదేళ్ల టర్మ్ లోనే 13 జిల్లాలను 26గా చేసి ప్రభుత్వాన్ని సూక్ష్మ స్థాయికి తీసుకువెళ్లడంలో జగన్ ప్రభుత్వం విజయవంతం అయింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఇప్పుడు జరుగుతున్న వనరుల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. అనుమానం లేదు, అందువల్ల పేద వర్గాల జీవన ప్రమాణాలు మునుపటి కంటే చాలా బాగా మెరుగవుతాయి. - వ్యాసకర్త మాజీ శాసన సభ్యులుమొబైల్: 98481 28844 - అడుసుమిల్లి జయప్రకాష్ -
ఆర్పీజీ గ్రూప్ నుంచి తాబి మొబిలిటీ సర్వీసులు
ముంబై: ఆర్పీజీ గ్రూప్ తాజాగా లాజిస్టిక్స్, సప్లై చెయిన్ సంస్థలకు సాఫ్ట్వేర్ సేవలందించే (సాస్) దిశగా తాబి మొబిలిటీ వెంచర్‌ను ఆవిష్కరించింది. ఆయా సంస్థలు తమ వాహనాలను, లాజిస్టిక్స్ కార్యకలాపాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించుకునేందుకు, లోపాలను సవరించుకునేందుకు తాబి సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఇంధన వ్యయాల ను తగ్గించుకునేందుకు, వాహనాల వినియోగాన్ని మరింత సమర్ధమంతంగా పెంచుకునేందుకు ఇది సహాయపడగలదని సంస్థ సీఈవో పాలి త్రిపాఠి తెలిపారు. తాబి సొల్యూషన్స్ ఇప్పటికే 100 రోజు ల్లో 100 క్లయింట్ల వ్యాపారవృద్ధికి దోహదపడిందని వివరించారు. 45,000 పైచిలుకు లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాహనాల అప్‌టైమ్‌ను 60,000 కిలోమీటర్ల మేర మెరుగుపర్చిందని త్రిపాఠి తెలిపారు. -
ఆటో, ఐటీకి కేరాఫ్‌గా తెలంగాణ
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): దేశంలో ఆటో, ఐటీకి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని.. రాష్ట్రంలో ఆటోమోటివ్, మొబిలిటీ పరిశ్రమను మరింత బలోపేతం చేస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ఉత్తమ మానవ వనరులు, నైపుణ్యానికి హైదరాబాద్ నగరం ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో పలు సంస్థల కార్యాలయా లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ప్రపంచంలోని ప్రముఖ ఆటోమేకర్లలో ఒకటిగా, మొబిలిటీ ప్రొవైడర్‌గా గుర్తింపు పొందిన స్టెల్లాంటిస్ డిజిటల్ హబ్ కార్యాలయాన్ని హైదరా బాద్‌లో ప్రారంభించడం ఒక మైలురాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. సుస్థిర మొబిలి టీకి మాత్రమే భవిష్యత్తు ఉందని చెప్పారు. మొబిలిటీలో తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇక్కడే.. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీ–హబ్ ప్రాంగణంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, హ్యుందాయ్ మొబిన్ ఇన్, బిట్స్ హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొబిలిటీ రంగంలో దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని చెప్పారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోర్సుల రూపకల్పన, పరిశోధన, అభివృద్ధి, విద్యార్థులకు శిక్షణలో ఈ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ నానక్‌రాంగూడలో రైట్ సాఫ్ట్వేర్ సంస్థ కొత్త డెవలప్మెంట్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని.. రిసోర్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మారిందని చెప్పారు. 2014లో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు 9.05 లక్షల మందికి చేరారని, ఐటీ ఎగుమతులు రూ.2.41 లక్షలకు పెరిగాయని వివరించారు. -
గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియా ఇక ముందు ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ వాహనాల రంగంలో కూడా ముందుకు సాగే అవసరంతోపాటు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెట్రోలు, డీసెల్ బదులు విద్యుత్ బ్యాటరీలతో నడిచే వాహనాల వినియోగాన్ని నేటి ప్రపంచంలో ‘గ్రీన్ మొబిలిటీ’ అని పిలుస్తున్నారు. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ సైతం ప్రగతి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ప్రపంచంలో ఆటోమొబైల్ రంగంలో చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది మూడో ర్యాంకర్ జపాన్ను ఆటో అమ్మకాల్లో ఇండియా అధిగమించింది. కిందటేడాది జపాన్ 42 లక్షల ఆటోమొబైల్ వాహనాలను అమ్మగా, ఇండియాలో 42 లక్షల 50 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలో ఎలెక్ట్రిక్ కార్లు, ఇతర రకాల వాహనాల ఉత్పత్తి పెరిగితే ఆటో రంగంలో చైనా, అమెరికాలను ఇండియా దాటిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేస్తోంది. అమెరికాలోని అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని పెద్ద రాష్ట్రం జార్జియా గ్రీన్ మొబిలిటీలో అగ్రభాగాన నిలిచే దిశగా ముందుకు సాగుతోంది. ఈ రాష్ట్రాన్ని అమెరికాకు ‘ఎలెక్ట్రిక్ మొబిలిటీ రాజధాని’గా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఆటోమొబైల్ రంగంలో అమెరికాలో మొదటి స్థానంలో ఉన్న మిషిగన్ రాష్ట్రాన్ని మించిపోతుందని అంచనా. గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలెక్ట్రిక్ (గ్రీన్) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం-అయాన్ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ను ఎలెక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్ మీటింగ్ విజయవంతంగా జరిగింది. విద్యుత్ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.50వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులతో రాష్ట్రంలో నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పారు. హైదరాబాద్ ఈ–మొబిలిటీ వీక్‌లో భాగంగా తెలంగాణ మొబిలిటీ ఫోకస్డ్ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీలను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారమిక్కడ ప్రకటించారు. టీఎంవీ.. ఉత్తమ మౌలిక సదుపాయాలను కలి్పంచడంతోపాటు, దేశంలో తయారీని ప్రోత్సహిస్తుందన్నారు. అలాగే, ఆర్ అండ్ డీలో తెలంగాణను అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘టీఎంవీలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల నాలుగు మెగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం. వీటిలో జహీరాబాద్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, సీతారాంపూర్‌లో ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ క్లస్టర్, యెంకతల వద్ద ఇన్నొవేషన్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం’అని కేటీఆర్ తెలిపారు. త్వరలో రూ.3వేల కోట్ల పెట్టుబడులపై ప్రకటన రాష్ట్రానికి త్వరలో రూ.3 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, రెండు వారాల్లో వివరాలు ప్రకటిస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ పెట్టుబడులు తెలంగాణలో ఎలక్ట్రిక్ 2–వీలర్, 3–వీలర్, చార్జింగ్ పరికరాల తయారీ ఎకో సిస్టమ్స్‌ను మరింత బలోపేతం చేస్తాయన్నారు. ‘అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, ఆటో ఇంజనీరింగ్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఆయా కంపెనీల కార్యకలాపాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పనిచేస్తుంది’అని తెలిపారు. ఈ రంగంలోని నిపుణులు, గ్లోబల్ ఆటోమోటివ్ ఎకోసిస్టమ్ భాగస్వాములను ఒకచోట చేర్చేందుకు హైదరాబాద్ ఈ–మొబిలిటీవీక్ను క్రమం తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటిలో తెలంగాణ ప్రభుత్వంతో ఏటీఎస్–టీయూవీ రైన్‌ల్యాండ్, బిట్స్ హైదరాబాద్‌తో బోష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్, షెల్‌తో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్్క)లు కుదుర్చుకున్న ఒప్పందాలున్నాయి. అపోలో టైర్స్ లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ హిజ్మీ హాసెన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రాధాన్యతనిస్తూ ఈ–మొబిలిటీ వీక్ నిర్వహించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వోక్స్వ్యాగన్ గ్రూప్ ఇండియా, సేల్స్, మార్కెటింగ్ అండ్ డిజిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ వాన్ సీలెన్, వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కమల్ బాలి, ఉబర్ ఇండియా, సౌత్ ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టాస్క్ తెలంగాణ సీఈఓ శ్రీకాంత్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. బిట్స్పిలానీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ ఒప్పందం చేసుకుంది. నూతన మొబిలిటీలో అభివద్ధి చెందుతున్న ఆవిష్కరణలను అన్వేషించడంలో ముందుండాలనే ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పాటునందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆ సంస్థ తెలిపింది. నూతన మొబిలిటీ కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను బిట్స్‌పిలానీ, హైదరాబాద్ క్యాంపస్‌లో ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొంది. నూతన మొబిలిటీ కోసం భారత తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటుకావడం సంతోషంగా ఉందని కేటీఆర్ చెప్పారు. -
మంచి మాట: ఉన్నంతవరకూ ఉన్నతంగానే...
కష్టానికి కష్టం వస్తేనూ, నష్టం నష్టపోతేనూ బావుణ్ణు; మనిషి కష్టం లేకుండానూ, నష్టపోకుండానూ బావుంటాడు’ ఇలా అనుకోవడం బావుంటుంది. కానీ వాస్తవంలో ప్రతిమనిషికీ జీవితంలో, జీవనంలో కష్టాలు, నష్టాలు కలుగుతూనే ఉన్నాయి, కలుగుతూనే ఉంటాయి. మనిషినే కాదు ప్రపంచాన్ని కూడా కష్టాలు, నష్టాలు కుదిపేస్తూనే ఉన్నాయి, కుదిపేస్తూనే ఉంటాయి. జీవనంలో కలుగుతూ ఉండే కష్టాలు, నష్టాలవల్ల నిస్తేజమూ, కలవరమూ, గందరగోళమూ ఎవరికైనా తప్పవు. జీవితం అన్నాక కష్టం, నష్టం ఒకటి తరువాత ఒకటిగా, ఒకదానిపై ఒకటిగా వస్తూనే ఉంటాయి. వచ్చిన కష్టం ఏదైనప్పటికీ, కలిగిన నష్టం ఎంతదైనప్పటికీ మనిషి వాటిని తట్టుకోగలగాలి. కష్టాలకు, నష్టాలకు లొంగిపోకూడదు, కుంగిపోకూడదు. మనిషి లొంగిపోయాడు, కుంగిపోయాడు కదా అని కష్టాలు,నష్టాలు మనిషిని వదిలెయ్యవు. లొంగిపోయిన, కుంగిపోయిన మనిషి కష్టాలు, నష్టాలు ఉద్ధృతం అవుతాయి. మనిషి తన మనసుతో, మెదడుతో కష్టాలను, నష్టాలను నిలువరించి అధిగమించాలి. చచ్చినట్టు బతకడం నుంచి నచ్చినట్టు బతకడంలోకి వెళ్లేందుకు మనిషి ప్రయత్నించాలి. అందువల్ల కష్టాలు, నష్టాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మనిషి తనను తాను తయారుచేసుకోగలుగుతాడు. తాను చచ్చేలోపు ఉచ్ఛ స్థితికి చేరుకోవాలన్న ఆలోచన చెయ్యాలి. ఆ స్థితిని సుసాధ్యం చేసుకోవడం మనిషి నేర్చుకోవాలి. అందువల్ల కష్టాలు, నష్టాలు తనను నిస్తేజంలోకి నెట్టెయ్యకుండా మనిషి నిలదొక్కుకోగలడు. మనుషులమై పుట్టామని గుర్తుంచుకుందాం; ఏ కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా చేవను ఊతంగా చేసుకుందాం. జరిగిపోయిన వాటి గురించీ, కలిగిన కష్టాలు, నష్టాల గురించీ చింతిస్తూ ఉండిపోవడం పిరికితనం. మనం పిరికితనానికి బలి కాకూడదు. పిరికితనం నుంచి మనం ధైర్యంతో బయటపడాలి. కష్టం, నష్టం నుంచి విముక్తం అవడానికి మనకు ధైర్యం కావాలి. మనం ధైర్యంతో కదలాలి. ‘ఉన్నంతవరకూ ఉన్నతంగానే ఉందాం, అనే చింతన వస్తే ఏ కష్టం లోనైనా, ఎంత నష్టంలోనైనా మనకు చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే కష్టాలు, నష్టాల నుంచి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టం కలిగినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ మనిషికి నిస్పృహ వచ్చేస్తుంది. ఇక్కడే మనిషి జాగ్రత్తగా ఉండాలి. నిస్పృహ అనే మత్తుకు మనిషి అలవాటు పడకూడదు. ఆవరించిన నిరాశను అంతం చేసుకోవాలి. అటుపైన మతిలో సదాశ పుట్టాలి. మనిషి ఆశపడాలి. కష్టాలు, నష్టాలు కలిగాక వాటికి అతీతం అవ్వాలనే ఆశ కావాలి. సుఖపడాలని మనిషి ఆశపడాలి. బాగా బతకడానికి అవకాశాలు ఎప్పటికీ బతికే ఉంటాయి. ఆ విషయాన్ని మనం సరిగ్గా పసికట్టాలి. దెబ్బతిన్న తరువాత బాగు పడాలనుకోవడం దోషం కాదు. దెబ్బతిన్న తరువాతైనా, దెబ్బ తిన్నందుకైనా మనిషి బాగుపడి తీరాలి. మళ్లీ పుడతామో లేదో మనకు తెలియదు; మరణించాక మనకు పని ఉండదు; బాగా బతకాలని గట్టిపట్టుపడదాం. కష్టం, నష్టంవల్ల మనల్ని మనం కోల్పోకూడదు. జీవనం జారిపోతే జీవితం పండదు. మనిషికి ఆశ కావాలి. మనిషి తన బతుకును తాను ఆస్వాదించడం నేర్చుకోవాలి. బతుకును ఆస్వాదించడం తెలిస్తే కష్టాలనూ, నష్టాలనూ ఓడించడం తెలుస్తుంది. కష్టనష్టాలపై గెలుపు మనిషికి పొలుపు. మనకు గతాన్నీ, వర్తమానాన్నీ ఇచ్చిన కాలం భవిష్యత్తునూ ఇస్తుంది. కష్టానికీ, నష్టానికీ మనం పతనం అయిపోవడం కాదు, కలిగిన కష్టాన్నీ, నష్టాన్నీ పతనం చెయ్యడానికి మనం ఉపక్రమించాలి. ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఊపిరిలోకి తీసుకుని ఉద్యుక్తులమై మనం ఉన్నతమైన ప్రగతిని సాధించాలి. ఏ చీకటైనా తొలగిపోవాల్సిందే. ఎంతటి తుఫానైనా ఆగిపోవాల్సిందే. చీకటి మూగినప్పుడు సంయమనంతో ఉంటే ఉదయాన్ని చూడగలం. తుఫాను ముంచుకొచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటే ప్రశాంత వాతావరణంలోకి వెళ్లగలం. భూకంపం వచ్చాక కూడా అభివృద్ధి జరుగుతుందని, జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు దెబ్బలలా, దెబ్బలమీద దెబ్బలలా తగులుతున్నప్పుడు జీవితం పగిలిపోలేదని గ్రహించాలి. మనం ఉన్నందుకు, మనకు ఉనికి ఉన్నందుకు మనకు పటుత్వం ఉండాలి. కష్టాలు, నష్టాలు కలిగినా నేడు అనే వేదికపైన మనం నిలదొక్కుకుని ఉండగలిగితే రేపు వస్తుంది. ఆ రేపు మనల్ని కష్టాలు, నష్టాలు వీడిపోయిన ఎల్లుండిలోకి తీసుకెళుతుంది. – రోచిష్మాన్ -
హిందుజా టెక్ చేతికి డ్రైవ్ సిస్టమ్
చెన్నై: ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ డ్రైవ్ సిస్టమ్ డిజైన్‌ను కొనుగోలు చేసినట్లు హిందుజా టెక్ తాజాగా పేర్కొంది. తద్వారా అభివృద్ధి నుంచి ఉత్పత్తివరకూ ఈమొబిలిటీ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం హిందుజా గ్రూప్‌నకు చెందిన కంపెనీ డీల్ విలువను వెల్లడించలేదు. డ్రైవ్ సిస్టమ్ అంతర్జాతీయస్థాయిలో విశ్వాసపాత్ర ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నట్లు తెలియజేసింది. ఎలక్ట్రిఫైడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌కు కొత్తతరహా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించింది. యూకే, యూఎస్, ఆసియాలలో ఆటోమోటివ్, వాణిజ్య వాహనాలు, ఆఫ్‌హైవే, వైమానిక పరిశ్రమలకు అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్ సేవలందిస్తున్నట్లు పేర్కొంది. -
పోర్టర్‌కు 5,000 ఈ–కార్గో వాహనాలు
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒమెగా సీకి మొబిలిటీ భారీ ఆర్డర్‌ను అందుకుంది. ఇందులో భాగంగా సరుకు రవాణా రంగంలో ఉన్న పోర్టర్‌కు 5,000 ఎలక్ట్రిక్ కార్గో త్రిచక్ర వాహనాలను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది చివరినాటికి ఈ వెహికిల్స్‌ను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోర్టర్ వద్ద 1,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్లు ఉన్నాయి. ఈ–కామర్స్ కంపెనీల నుంచే కాకుండా ఎఫ్ఎంసీజీ, డెయిరీ, నిర్మాణ, వాహన విడిభాగాల వంటి రంగాల నుండి కూడా డిమాండ్ రావడంతో ట్రక్కుల అవసరం పెరిగిందని ఒమెగా సీకి మొబిలిటీ ఫౌండర్, చైర్మన్ ఉదయ్ నారంగ్ తెలిపారు. ‘2023లో ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 200 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. పోర్టర్‌తో భాగస్వామ్యం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఇటువంటి డీల్స్ మరిన్ని కుదుర్చుకోనున్నాం. వచ్చే 2–3 ఏళ్లలో డీల్స్‌లో భాగంగా భాగస్వామ్య కంపెనీలకు 50,000 వెహికిల్స్ సరఫరా చేసే అవకాశం ఉంది’ అని వివరించారు. ఈ–కామర్స్ కంపెనీలు పండగల నెలలో రూ.96,170 కోట్ల విలువైన వ్యాపారం నమోదు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. -
సీఎన్జీ ధరలు తగ్గించాలి, కేంద్రానికి సియామ్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: సీఎన్జీ ధరలను తగ్గించాలని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పర్యావరణ సుస్థిర లక్ష్యాల సాధనకు ఇది అవసరమని పేర్కొంది. గడిచిన కొన్ని నెలల్లో సీఎన్జీ ధరలు అసాధారణంగా పెరిగినట్టు గుర్తు చేసింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అనుకూల లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం నుంచి సరైన మద్దతును, సరైన సమయంలో కోరుకుంటున్నట్టు సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. జాతి లక్ష్యాలైన చమురు దిగుమతులను తగ్గించుకోవడం, స్వచ్ఛమైన పర్యావరణం సాకారానికి.. పరిశ్రమ, ప్రభుత్వం మధ్య సహకార ధోరణి ఉండడం అభినందనీయమన్నారు. ‘‘సీఎన్జీని ప్రోత్సహించడం, నెట్వర్క్ విస్తరణ విషయంలో ప్రభుత్వ కృషికి మద్దతుగా.. సీఎన్జీ వాహన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు ఆటోమొబైల్ పరిశ్రమ కట్టుబడి ఉంది’’అని రాజేష్ మీనన్ ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం కేంద్ర పెట్రోలియం,సహజవాయువుల మంత్రి హర్దీప్సింగ్ పూరి 166 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,332 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కావడం గమనార్హం. -
మారుతీ మొబిలిటీ చాలెంజ్: పది లక్షలు మీ సొంతం..!
న్యూఢిల్లీ: రవాణా, వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కొత్తగా మొబిలిటీ చాలెంజ్ పోటీలను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు చెందిన టీ–హబ్‌తో కలిసి దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవిదేశాలకు చెందిన సిరీస్ ఎ స్థాయిలోని స్టార్టప్‌లు మొదలుకుని యూనికార్న్‌ల స్థాయి సంస్థలు ఇందులో పాల్గొనవచ్చని వివరించింది. మారుతీ ఇప్పటికే మెయిల్ (మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్) పేరిట స్టార్టప్‌ల కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన మొబిలిటీ చాలెంజ్ .. ప్రత్యేకంగా ప్రారంభ దశలోని, పూర్తి స్థాయిలో విస్తరించిన స్టార్టప్‌ల కోసం ఉద్దేశించినది. ఎంపికైన స్టార్టప్‌లకు మారుతీ, టీ–హబ్ నుంచి తోడ్పాటు లభిస్తుంది. గెలుపొందిన రెండు సంస్థలకు చెరి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుంది. చదవండి: మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు -
ఎలక్ట్రిక్ సైకిల్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. మైలేజ్
మన దేశంలో క్రమ క్రమంగా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అధరణ పెరుగుతుంది. తాజాగా మార్కెట్లోకి నెక్స్‌జు మొబిలిటీ కంపెనీ తన సరికొత్త ఈ సైకిల్ ను విడుదల చేసింది. ఇంట్లో పనుల కోసం స్వల్ప దూరానికి ఈ సైకిల్ భాగ ఉపయోగపడనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఈ-సైకిల్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనుంది. తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం, నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి ఉండే స్టీల్ ప్రేమ్ చాలా గట్టిగా ఉంటుందనీ సరుకులు, సామాన్లు కూడా మోసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పింది. దీనికి డిస్క్ బ్రేకులు ఉన్నాయని తెలిపింది. ఈ సైకిల్ మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుతూ కూడా అనుకున్న గమ్యానికి వెళ్ళవచ్చు. ఇందులో త్రొట్టిల్ మోడ్ సైకిల్ 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ సైకిళ్లు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. కాబట్టి వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఈ సైకిల్ మార్కెట్ ధర రూ.42,000 ఉంది. మోడల్ బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. మీరు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే కంపెనీ అధికారిక వెబ్సైట్ (https://nexzu.in)లోకి వెళ్లి కొనుక్కోవచ్చు. నెక్స్‌జు కంపెనీ సీఈఓ రాహుల్ షోనాక్ తాము ఈ కొత్త సైకిళ్లను లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. చదవండి: సైకిల్ అమ్మకాల స్పీడ్ -
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్ఐఎల్కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్ఐఎల్కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు. -
మొబైల్ యూజర్లు@ 142 కోట్లు!
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్‌లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ‘2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం 2022 నాటికి గానీ గణనీయ స్థాయికి చేరుకోకపోవచ్చు. 2024 నాటికి 3.8 కోట్ల 5జీ సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు. అప్పటి మొత్తం మొబైల్ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఈ వాటా సుమారు 2.7 శాతంగా ఉంటుంది‘ అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. మొబైల్ ఫోన్లలో 1 జీబీపీఎస్ (గిగాబిట్ పర్ సెకన్) వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుకోవడానికి 5జీ కనెక్షన్లు తోడ్పడతాయని చెప్పారాయన. ప్రస్తుతం 56 కోట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ సబ్స్క్రిప్షన్స్ సంఖ్య మరో ఆరేళ్లలో 100 కోట్లకు చేరగలదని, అలాగే డేటా నెలవారీ వినియోగం 6.8 జీబీ స్థాయి నుంచి 15 జీబీకి పెరగవచ్చని పేర్కొన్నారు. 150 కోట్ల మంది 5జీ యూజర్లు.. 2024 ఆఖరు నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 150 కోట్ల స్థాయిలో 5జీ యూజర్లు ఉంటారని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. 5జీ వినియోగంలో ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది. భారత్‌లో మరికొన్నాళ్ల పాటు 4జీనే ప్రధాన టెల్కో టెక్నాలజీగా కొనసాగవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 12 కోట్ల మేర పెరగ్గా.. ఇందులో భారత్ వాటా 3.1 కోట్లుగా ఉందని సెర్వాల్ తెలిపారు. కొత్త సబ్‌స్క్రయిబర్స్ విషయంలో ఎరిక్సన్ నివేదిక ప్రకారం 3.7 కోట్ల మంది కొత్త యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. -
చైతన్యం..వినియోగదారుని ఆయుధం
– ప్రతి కొనుగోలుకు విధిగా బిల్లు తీసుకోవాలి –ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలి – జాతీయ వినియోగదారుల దినోత్సవంలో జేసీ హరికిరణ్ కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు ఎన్నో హక్కులు ఉన్నాయని.. చైతన్యమనే ఆయుధంతో వాటిని సాధించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని శనివారం.. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి మొదలు సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని.. వీరికి అనేక హక్కులు ఉన్నాయన్నారు. హక్కులపై సమగ్రమైన అవగాహన కల్పించడమే జాతీయ వినియోగదారుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. బిల్లు ఉంటే తీసుకున్న సరుకులు నకిలీవైనా.. తగిన నాణ్యతతో లేకపోయినా వినియోగదారుల ఫోరం కేసువేసి తగిన పరిహారం పొందవచ్చని తెలిపారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ప్రశ్నించేతత్వాన్ని ప్రతి వినియోగదారుడూ అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజిరున్నీసా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శశీదేవీ, జిల్లా వినియోగదారుల సేవ కేంద్రం ఇన్చార్జి నదీమ్ హుసేన్ మాట్లాడారు. కర్నూలులో ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్ విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో అవగాహన కల్పించారు. ఆకట్టుకున్న నాటికలు వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో.. కేవీఆర్ కాలేజి, శ్రీలక్ష్మీ స్కూల్ విద్యార్థులు నాటికల రూపంలో చూపించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను జేసీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మదన్మోహన్శెట్టి, లీగల్ అడ్వైజర్ శివసుదర్శనం, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
‘మనగుడి’తో సామాజిక చైతన్యం
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి – 600 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు కర్నూలు(న్యూసిటీ) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాలు సామాజిక చైతన్యానికి ఉపకరిస్తున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు సప్తగిరి నగర్‌లోని శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం మనగుడి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యాథితిగా హాజరయ్యారు. జిల్లాలో 600 శివాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయనను హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సన్మానించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఈ మల్లికార్జునరెడ్డి, సమరత సామాజిక సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆలయ ప్రముఖ్ పరంథామరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అనూహ్యం
పోటెత్తిన ఢిల్లీ ఓటరు చైతన్యం అనూహ్యం - అమేయం - అజేయం గుండెల్లో గూడుకట్టుకున్న ఓటరు నిట్టూర్పు అంచనాలకు అందని ఈ సంచలనాత్మక తీర్పు అధికార లాలస అగ్రనేతల ఆశలకు అశనిపాతం నూటపాతికేళ్ల కాంగీ నేతల బాధ కడు శోచనీయం కేజ్రీవాలా పట్ల ఢిల్లీ ఓటర్లకెంతో క్రేజు నేతల అవినీతి ఊడ్చేస్తాడన్న మోజు అందుకే ఢిల్లీ పీఠానికి చేరారు రాజు హ్యాట్సాఫ్ టు ప్రలోభాలకు లొంగని ఓటరుకు! ఇదే ప్రజాస్వామ్యానికి ఉన్న పవర్ కంగ్రాట్స్ టు సి.ఎం. కేజ్రీవాల్ లీడర్ - డా. పి.వి. సుబ్బారావు , చిలకలూరిపేట, గుంటూరు జిల్లా -
ఇస్తినమ్మ పుస్తకం తెచ్చుకుంటినమ్మ పుస్తకం
మంచి పుస్తకం దొరకగానే పీఠిక నుంచి సమాప్తం వరకూ చదివేస్తాం. ఆపై బుక్ షెల్ఫ్‌లో పదిలంగా దాచేస్తాం. అపురూప సాహిత్యాన్ని చెదలు చదివేస్తున్నా పట్టించుకోం. చదివిందే కదా అని లైట్‌గా తీసుకునే వారు కొందరు. ఇంట్లో చెత్త తయారవుతోందని అమ్మేసి వదిలించుకునే వారు ఇంకొందరు. అయితే.. తమకు అందిన జ్ఞానం పరులకూ అందాలని భావించేవారు ఎక్కడా తారసపడరు. ఫలానా పుస్తకం బాగుందని చెప్పేవారే తప్ప.. దాన్ని ఓసారి చదివిస్తానంటే మాత్రం ఇవ్వడానికి చేతులు రావు. ఇలాంటి వారిలో చైతన్యం కల్పిస్తూ హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ‘స్వాప్ యువర్ బుక్’ పేరుతో వినూత్న ప్రయోగానికి తెరతీసింది. ..:: దార్ల వెంకటేశ్వర రావు టెక్నాలజీతో పరుగులు తీస్తున్న నగరవాసులకు పుస్తకాలు చదివే ఓపిక ఎక్కడుంది? కాసింత టైమ్ దొరికితే సెల్ఫోన్లో కబుర్లు.. సోషల్ మీడియాలో చాటింగ్‌లతో సరిపెడుతున్నారు. వీటన్నింటికన్నా పుస్తకాలే ప్రియ నేస్తాలన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. వీరి సంగతి అటుంచితే.. ఇక పుస్తకాలు చదవడం హాబీగా ఉన్న వారికి మరో చిక్కుంది. అనుకున్న పుస్తకం దొరక్క నెలల తరబడి వెతుకుతుంటారు. అదే పుస్తకాన్ని పదిసార్లు చదివేసి అటకెక్కించే వారు కొందరుంటారు. వీరిద్దరినీ కలిపితే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అవుతుందని భావించారు హైదరాబాద్ లిటరరీ ట్రస్టు నిర్వాహకులు. స్వాప్ యువర్ బుక్ (పుస్తకాల మార్పిడి) పేరుతో ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం సికింద్రాబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. విజ్ఞాన మార్పిడి.. ఈ తరం పిల్లలకు పుస్తకాలను చదివే అలవాటు చేయడానికి, రీడింగ్ హాబీ ఉన్నవారికి కొత్త, పాత పుస్తకాలను పరిచయం చేయడానికి ఈ స్వాప్ యువర్ బుక్ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. చదివిన పుస్తకాన్ని ఇచ్చేసి.. వారికి నచ్చిన పుస్తకాన్ని తీసుకెళ్లొచ్చు. స్వాప్ యువర్ బుక్ కార్యక్రమానికి పుస్తక ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాము చదివిన పుస్తకాలు మరింత మంది చదవాలనే ఉద్దేశంతో ఎందరో పాత పుస్తకాలను ఇక్కడకు తీసుకొచ్చారు. తాము చదవాలనుకుంటున్న పుస్తకాలను వెతికి మరీ తీసుకెళ్లారు. కొత్తగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తర చూ నిర్వహిస్తాం అంటోంది హైదరాబాద్ లిటరరీ ట్రస్ట్. పుస్తకాల మార్పిడితో విజ్ఞానం, సాహిత్యం పంచుకునే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు అక్కడికి వచ్చిన పుస్తక ప్రియులు. మంచి ఆలోచన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుని వాలంటీర్‌గా పని చేసేందుకు వచ్చా. కొత్త ఆలోచనతో చేపట్టిన కార్యక్రమం చాలా బాగుంది. కొత్త పుస్తకాలు కొనాలంటే చాలా ధరలున్నాయి. మన దగ్గరున్న పుస్తకం అమ్మేస్తే అందులో పావలా వంతు కూడా రాదు. అందుకే స్వాప్ యువర్ బుక్స్ ద్వారా ఒకరికొకరు పుస్తకాలు మార్పిడి చేసుకోవడం స్వాగతించదగ్గ విషయం. - కృష్ణ, వాలంటీర్ -
శాస్త్రీయ దృక్పథంతోనే మానసిక చైతన్యం
అనంతపురం టవర్‌క్లాక్ : శాస్త్రీయ దృక్పథంతోనే ప్రజలు మానసికంగా చైతన్య వంతులు కాగలరని ఎమ్మెల్సీ డాక్టర్‌గేయానంద్ ఆన్నారు. శుక్రవారం నగర శివారులో శ్రీశ్రీ నగర్లో ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని మేయర్ స్వరూప ప్రారంభించారు. కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ హాజరయ్యారు. అనంతరం గేయానంద్ మాట్లాడుతూ ప్రజల్లో మానసిక రుగ్మతలపై చైతన్యం పెరగాల్సి ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశానికి లోనై జీవితాలనే బలిచేసుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరూ మానసిక వికాసంతో శాస్త్ర్రీయ దృక్పథం అలవరుచుకోవాలని తెలిపారు. మేయర్ స్వరూప మాట్లాడుతూ ప్రజల కోసం వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మానసిక సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు. మానసిక జబ్బులకు నేడు అధునిక వైద్యం అందుబాటులో ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమీషనర్ సత్యప్రకాష్ మాట్లాడుతూ దేశంలో నేటికి మానసిక రుగ్మతలతో ఎంతో మంది తనువు చాలిస్తున్నారని తెలిపారు. వైద్యం శిబిరం నిర్వహించిన సీపీఎం శాఖ, ట్రినిటీ రిహబిలిటేషన్స్ ట్రస్టు వారిని ఆయన అభినందించారు. మానసిక, స్త్రీ వ్యాదులు, పిల్లల జబ్బులు గురించి అవగాహన కల్పించారు. ప్రజల్లో మానసిక జబ్బులపై అవగాహన కల్పించుటకు ప్రభుత్వం ముందుకు రావాలని మానసిక వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో కార్పొరేటర్ భూలక్ష్మి, సాహితి సంస్థ కన్వీనర్ వేణుగోపాల్, సీపీఎం నాయకులు ప్రకాష్‌రెడ్డి, గిరి, కుమార్, విజయ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
జన్మభూమితో ప్రజల్లో చైతన్యం
qస్వచ్చ భారత్ కార్యక్రమంలో అందరూ భాగ స్వామ్యం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చూచించారు. గ్రామాల్లో మురుగులేకుండా సైడుకాలువలు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామం చివరన చెత్త డంప్పింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కు ప్రభుత్వం పెంచిందని అవి అర్హులైన వారికి అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పశువైద్యశిరాన్ని తనిఖీ చేసి పశువులకు టీకాలు వేశారు. జన్మభూమికి నిధులు ఇవ్వండి: కాకాణి జన్మభూమి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాకుటూరు సభలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాల్లో చేపట్టే పనులకు నిర్మాణంతోపాటు నిర్వహణ అవసరమని, నిధులు కేటాయించాలని తెలిపారు. మొక్కుబడిగా కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని, పింఛన్ల విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. ప్రజలు రూ.200 నుంచిరూ. 1000 వస్తుందని ఆనందంగా ఉన్నారని ఏదోఒక కారణంపెట్టి తొలగించకుండా ్లకలెక్టర్ , ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సర్వేపల్లి నియోజక వర్గ ప్రజలు తమ విజయానికి సహకరించారని వారి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, అందుబాటులో వారికి తోడుగా ఉంటానని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటాలు చేైసైనా మంచి పాలన అందజేస్తానని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి, ప్రత్యేకాధికారి చంద్రమౌళి, తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ సుగుణమ్మ పాల్గొన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో 18 వేల ఉద్యోగాల కోత!
న్యూయార్క్: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 39 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఉద్యోగాల కోతకు తెరతీసింది. వచ్చే ఏడాది వ్యవధిలో 18 వేల మేర సిబ్బందిని తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ, భారత్‌కు చెందిన సత్య నాదెళ్ల గురువారం ప్రకటించారు. ఈ చర్యలు కఠినమైనవే అయినా... కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన నోకియా మొబైల్ డివైస్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌తో అనుసంధానించేందుకు ఇవి తప్పనిసరి అని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో ఆయన పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా రానున్న 12 నెలల్లో పన్ను ముందస్తు చార్జీల రూపంలో 1.6 బిలియన్ డాలర్లను(సుమారు రూ.9,600 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. సత్య నాదెళ్ల ఐదు నెలల క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సిబ్బంది ఉధ్వాసన ప్రకటన కావడం గమనార్హం. అయితే, భారత్ చాలా కీలకమైన మార్కెట్‌గా నిలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యోగాల కోతలు పెద్దగా ఉండకపోవచ్చ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు. తమకు భారత్‌లో నోకియా డివెజైస్‌తోసహా 6,500 మంది ఉద్యోగులు ఉన్నారని.. మైక్రోసాఫ్ట్ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ ప్రభావం చాలా చాలా స్పల్పంగానే ఉంటుందని చెప్పారు. కాగా, ఈ 18,000 కోతల్లో సుమారు 12,500 వరకూ నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ బిజినెస్‌కు చెందిన నిపుణలు, ఫ్యాక్టరీ సిబ్బందివే ఉంటాయని సమాచారం. ప్రధానంగా మైక్రోసాఫ్ట్, నోకియా డివెజైస్‌ల మధ్య సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. తొలి విడతలో భాగంలో 13,000 సిబ్బందిని తగ్గించుకునే చర్యలను ప్రారంభించామని... వచ్చే ఆరు నెలల్లో ఎవరిని తొలగించబోతున్నామనేది ప్రకటిస్తామని నాదెళ్ల వెల్లడించారు. మొత్తానికి 2015 జూన్ నాటికి ఈ మొత్తం సిబ్బంది కోత ప్రక్రియ పూర్తవుతుందన్నారు. గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 99,000 పూర్తిస్థాయి(ఫుల్‌టైమ్) సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 58,000 మంది అమెరికాలో, మిగతా 41,000 మంది ప్రపంచవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నోకియా డీల్ తర్వాత కంపెనీలోకి కొత్తగా వచ్చిచేరిన ఉద్యోగులు ఇందులో లేరు. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా మైబైల్ హ్యాండ్సెట్ల తయారీ విభాగాన్ని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రధానంగా 2009లో మైక్రోసాఫ్ట్ సుమారు 5,800 మంది ఉద్యోగులను తొలిగించిన తర్వాత మళ్లీ ఇంత భారీ స్థాయిలో కోతలను ప్రకటించడం ఇదే తొలిసారి. -
కాళిదాసు ఏ దేశం వాడు?
గ్రంథపు చెక్క కాళిదా సేదేశం వాడు? ఏ జాతివాడు? అంటే, అతని మాతృభాష యేమిటి? అతని వంశవృత్తాంతం యెలాంటిది? అతనేం చదివాడు? ఆ చదివింది యెవరి దగ్గర చదివాడు? అతను తన గ్రంథాలు, ఏయే తేదీల్లో ప్రారంభించి ఏయే తేదీల్లో పూర్తి చేశాడు? ఇవేమీ అక్కర్లేదు లోకానికి. రసికుల కసలే అక్కర్లేదు. అతనేమేమి రచించాడన్నదే వారి ఆకాంక్ష. అతని రచన లెలాంటి వన్నదే వారి జిజ్ఞాస. అవి తమ కానందం కలిగిస్తున్నాయా లేదా- ఇదే వారి క్కావలసింది. పాశ్చాత్యులు మాత్రం ఆ వివరాలకున్నూ ప్రాముఖ్యం యిచ్చారు. మనవారి కాదృష్టే లేకపోయింది. అయితే, యెవరి దృక్పథం మంచిదీ? ఈ చర్చ యిక్కడ కాదు. పోతే, కవి రచన వొక్కొక్కచోట ఆహా అనిపిస్తుంది రసికులకు. ఒక్కొక్క చోట ఆనందముగ్ధులను చేస్తుంది, వారిని. ఒక్కొక్కచోట మార్గదర్శి అవుతుంది, వారికి. ఉత్తమ కావ్యాల వల్ల కలగవలిసిన ప్రయోజనా లివే, యెవరికయినా. కవి జీవిత వివరాలంత అగత్యాలు కావు. అంచాతే కాళిదాను సంగతి మన కక్కరలే దనడం. అతని రచనే కావాలి మనకి. కనకనే అతనూ చెప్పుకోలే దిది. అంచేతనే కవికుల గురువైనా డతను. కనుకనే అతనే మిగిలాడు లోకంలో. శతాబ్దులు గడిచాయి, అయినా అత నున్నాడు. యుగాలు గడిచిపోతాయి, అప్పుడూ వుంటాడతను. ఏమంటే? అతని వాక్కు అజరామరం అయిపోయింది. అది రసమయం కావడం దాని క్కారణం. అతని శరీరం పంచభూతాల్లోనూ కలిసిపోతే, అతని చైతన్యం అతని రచనల్లో మిళితం అయిపోయింది. కనుకనే వాటికా జీవకళ. కవి అయినవాడు సాధించుకోవలసిన ప్రాప్యం యిదీ. కాళిదాసు కిది బాగా తెలుసు. -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘అనుభవాలూ-జ్ఞాపకాలూను’ నుంచి. -
పెద్ద ఆశయం.. చిరు ప్రయత్నం..
వ్యవస్థను తిడుతూ కూర్చొనే కన్నా దాన్ని మార్చడానికి ఏం చేయాలన్నది ఆలోచించడమే ఎవరైనా చేయాల్సిన పని. ఓటర్లలో ఆ చైతన్యం కలిగించడా నికి ఓ కాలేజీ కుర్రాడు ‘నేను సైతం...’ అంటూ ప్రయత్నించాడు. బి.టెక్ రెండో సంవత్సరం విద్యార్థి శ్రీపాద్ సాయినందన్ తాజా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ‘మీ ఓటు ఎవరికి?’ అంటూ ఓ లఘుచిత్రం రూపొందించాడు. ‘‘మా స్నేహితులు సిద్ధార్థ, విక్రమ్‌లతో కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను. ఒక్కరోజులో షూటింగ్ పూర్తిచేశాను’’ అని చెప్పాడీ కుర్రాడు. హైదరాబాద్‌లో ముఫఖంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న శ్రీపాద్‌కు ఇంటి చుట్టుపక్కల ఉన్న మురికివాడలలో నివసించే వారిని చూశాక, ఈ చిత్రం తీయాలనిపించిందట. గతంలో ఒక లఘుచిత్రం తీసి, అనేక లఘుచిత్రాలలో నటించిన అనుభవం అందుకు పనికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ తరఫున అండర్ 19కి క్రికెట్ ఆడే శ్రీపాద్ తీసిన ఈ తాజా లఘుచిత్రంలోని పాత్రధారులంతా అతని స్నేహితులు, బంధువులే. ‘‘మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. అయితే సాయంత్రానికల్లా పూర్తిచేసుకోమనీ, రాత్రుళ్లు బయటకెళ్లవద్దనీ సూచించారు’’ అని నవ్వుతూ చెప్పాడీ యువకుడు. ‘‘ఓటు హక్కును వినియోగించుకొమ్మంటూ యువతను మేల్కొల్పడమే ఈ చిత్ర రూపకల్పన ఉద్దేశం’’ అన్నాడు. వయసు చిన్నదైనా సమాజం కోసం తన వంతుగా ఈ యువకుడు చేసిన ప్రయత్నం ప్రశంసనీయమే. - డా.వైజయంతి