మన దేశంలో క్రమ క్రమంగా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అధరణ పెరుగుతుంది. తాజాగా మార్కెట్లోకి నెక్స్‌జు మొబిలిటీ కంపెనీ తన సరికొత్త ఈ సైకిల్ ను విడుదల చేసింది. ఇంట్లో పనుల కోసం స్వల్ప దూరానికి ఈ సైకిల్ భాగ ఉపయోగపడనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఈ-సైకిల్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనుంది. తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం, నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
దీనికి ఉండే స్టీల్ ప్రేమ్ చాలా గట్టిగా ఉంటుందనీ సరుకులు, సామాన్లు కూడా మోసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పింది. దీనికి డిస్క్ బ్రేకులు ఉన్నాయని తెలిపింది. ఈ సైకిల్ మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుతూ కూడా అనుకున్న గమ్యానికి వెళ్ళవచ్చు. ఇందులో త్రొట్టిల్ మోడ్ సైకిల్ 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ సైకిళ్లు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. కాబట్టి వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఈ సైకిల్ మార్కెట్ ధర రూ.42,000 ఉంది. మోడల్ బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. మీరు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (https://nexzu.in)లోకి వెళ్లి కొనుక్కోవచ్చు. నెక్స్‌జు కంపెనీ సీఈఓ రాహుల్ షోనాక్ తాము ఈ కొత్త సైకిళ్లను లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.
చదవండి: సైకిల్ అమ్మకాల స్పీడ్
Comments
Please login to add a commentAdd a comment