మన దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా అధరణ భారీగా పెరుగుతుంది. దీంతో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. నెక్స్‌జు మొబిలిటీ అనే కంపెనీ తన సరికొత్త ఈ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంట్లో పనుల కోసం స్వల్ప దూరానికి ఈ సైకిల్ భాగ ఉపయోగపడనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఈ-సైకిల్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనుంది. దీనిని తొక్కాల్సిన అవసరం కూడా లేదు అని తెలిపింది. ప్రస్తుతం, నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ సైకిల్ 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్‌జు మొబిలిటీ రోడ్ లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ 5.2ఎహెచ్, డిటాచబుల్ 8.7ఎహెచ్ తో రెండు బ్యాటరీలను కలిగి ఉంది. ఇది 250డబ్ల్యు బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో రెండు ఎబిఎస్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. దీని ధర రూ.44,000గా ఉంది. ఈ రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్‌ని ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. అలాగే, రోడ్‌లార్క్ కార్గో వేరియెంట్ అందుబాటులో ఉంది. దీనికి ఉండే స్టీల్ ప్రేమ్ చాలా గట్టిగా ఉంటుందనీ సరుకులు, సామాన్లు కూడా మోసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పింది.
(చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..!)
ఈ సైకిల్ మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుతూ కూడా అనుకున్న గమ్యానికి వెళ్ళవచ్చు. వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. మోడల్ బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. మీరు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (https://nexzu.in)లోకి వెళ్లి కొనుక్కోవచ్చు. నెక్స్‌జు మొబిలిటీ చెన్నైలోని మదురై, హర్యానాలోని గురుగ్రామ్, కర్ణాటకలోని విజయపుర, గుజరాత్ లోని అహ్మదాబాద్, హర్యానాలోని బల్లాబ్ ఘర్, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్ గిరి, ఛత్తీస్ గఢ్ వంటి నగరాల్లో దేశవ్యాప్తంగా తమ డీలర్ షిప్ నెట్ వర్క్ విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment