cycles
-
సైకిళ్లపై పోలీసుల పెట్రోలింగ్..
-
Khushi Pandey: ఖుషీతో దిల్ ఖుష్
చిన్నతనంలో తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదని వారికి నొప్పి తెలియకుండా ఎంతో కష్టపడి పెంచుతారు తల్లిదండ్రులు. అయితే లక్నోకు చెందిన ఖుషీ అందుకు భిన్నం. తన తండ్రిలా మరెవరూ కష్టపడకూడదని తానే ఓ సామాజిక కార్యకర్తగా మారి సాటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఖుషీ పాండే. లక్నోకు చెందిన 23 ఏళ్ల ఖుషీ పాండే బాల్యం ఉన్నావ్ అనే ఊళ్లో గడిచింది. తన తండ్రి నుంచి చిన్ననాటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంది. ఖుషీ తండ్రికి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ పెన్సిల్ కొనే స్థోమత కూడా లేదప్పుడు. ఈ విషయం తెలుసుకుని,∙నాన్నలా మరెవరూ చదువుకోసం ఇబ్బంది పడకూడదు అనుకుంది. నిరుపేదలకు సాయం చేయాలని చిన్నప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. ఖుషీ పెద్దయ్యేసరికి నాన్న వాళ్ల లక్నోకి మకాం మార్చారు. అక్కడ ఓ షాపులో పనిచేస్తూ తరువాత కాంట్రాక్టర్‌గా మారారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా రావడంతో ఖుషీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీంతో ఖుషీ ‘లా’ పూర్తయ్యాక, సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. చదువు పూర్తయ్యాక వెంటనే నిరుపేదలకు చదువు చెప్పడం ప్రారంభించింది. మురికివాడల్లోని పిల్లలను ఒక చెట్టుకింద కూర్చోబెట్టి సాయంత్రం రెండుమూడు గంటలు చదువు చెప్పేది. రోజుకి యాభై మంది వరకు ఖుషీ క్లాసులకు హాజరయ్యేవారు. తన దగ్గరకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు, వారి తల్లిదండ్రులకు చదువు ప్రాముఖ్యతను వివరిస్తోంది. తాతయ్య మరణంతో... అది 2020 ... ఒకరోజు రాత్రి ఖుషీ వాళ్ల తాతయ్య షాపు నుంచి తిరిగి వస్తున్నారు. చీకట్లో సరిగా కనిపించక ఎదురుగా వచ్చే కారు తాతయ్య సైకిల్ని ఢీ కొట్టడంతో ఖుషీ తాతగారు అక్కడికక్కడే చనిపోయారు. తాతయ్యను ఎంతో ఇష్టపడే ఖుషీ ఈ చేదు సంఘటనను తట్టుకోలేకపోయింది. సైకిల్‌కు లైట్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు అనుకుని ప్రతి సైకిల్‌కు లైటు ఉండాలాని భావించింది. రోజూ కూలి పనిచేసుకునేవారు తమ సైకిళ్లకు లైట్లు పెట్టుకోవడానికి తగ్గ స్థోమత ఉండేది కాదు. దాంతో వాళ్లకు ఒక్కొక్కరికి 350 రూపాయల ఖరీదు చేసే లైట్లను ఉచితంగా పంచింది. ఇలా ఇప్పటిదాకా 1500 మంది వాహనాలకు బ్యాటరీతో నడిచే లైట్లను అమర్చింది. లైట్లు అమర్చడానికి ‘ఇన్స్టాల్ లైట్స్ ఆన్ బైస్కిల్’ అని రాసిన ఉన్న ప్లకార్డు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఎంతోమందికి అవగాహన కల్పించింది. అప్పట్లో ఖుషీ చేసిన ఈ పనిని ఓ ఐఏఎస్ అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన ఎనభైమంది యువకులు ఖుషీతో కలిసి సైకిళ్లు, ట్రక్కులకు, ఇతర వాహనాలకు లైట్లు అమర్చడంలో ఖుషీకి సాయంగా నిలిచారు. పాఠాలతో పైసలు సంపాదించి... ఖుషీ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు నిధులు చాలా కావాలి. ఇందుకు తన తండ్రి, బంధువులు సమకూర్చిన మొత్తం ఏమాత్రం సరిపోలేదు. దాంతో యూట్యూబ్‌లో ‘లా’ తరగతులు చెప్పడంతోపాటు, ఇతర పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ్త నెలకు అరవై నుంచి డెబ్భై వేల వరకు సంపాదించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మహిళలకు అండగా... బాలికలకు శానిటరీ ప్యాడ్ ల గురించి అవగాహన కల్పించడం, విద్యుత్ సదుపాయం లేని వారికి సోలర్ ల్యాంప్స్ అందించడం, ‘జీవిక సాథీ’ ప్రాజెక్టు పేరుతో దివ్యాంగ మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు కుట్టుమిషన్, జ్యూవెలరీ తయారీలో శిక్షణ ఇప్పించి వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. -
వృద్ధుడని కనికరం లేకుండా రెచ్చిపోయిన మహిళా పోలీసులు
వృద్ధుడని కనికరం లేకుడా లాఠీలతో రెచ్చిపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు. ఈ ఘటన పాట్నాకి 200 కి.మీ దూరంలో ఉన్న కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. 70 ఏళ్ల నోవల్ కిషోర్ పాండే అనే వృద్ధ టీచర్ కైమూర్ జిల్లాలోని భుభువా అనే రద్దీగా ఉండే రహదారిపై వెళ్తున్నాడు. అనుకోకుండా సైకిల్ పైనుంచి పడిపోతాడు. సరిగ్గా రోడ్డు మధ్యలో సైకిల్‌తో సహా పడిపోయాడు. ఐతే వృద్ధాప్యం కారణంగా సైకిల్ని పైకెత్తలేక ఇబ్బందిపడుతున్నాడు. దీంతో ఆ ప్రదేశంలో ఒక్కసారిగా ట్రాఫిక్ ఏర్పడింది. అంతే ఇంతలో ఇద్దరూ మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆ వృద్ధుడిపై అరుస్తూ త్వరగా తప్పుకోమంటూ లాఠీలతో కొట్టడం ప్రారభించారు. త్వరితగతిన సైకిల్ తీయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడిపై లాఠీలతో వీరంగం సృష్టించారు ఆ మహిళా పోలీసులు. పాపం ఆ వృద్ధుడు కొట్టొద్దని వేడుకుంటున్న కనికరం లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. పోని ఆ సైకిల్ని పైకెత్తి, ఆ వృద్ధడిని పక్కకు తీసుకు రావడం వంటివి చేయడం మాని లాఠీలతో చితకబాదడం వంటివి చేశారు. వాస్తవానికి పండిట్ 40 ఏళ్లుగా టీచర్‌గా పనిచేస్తున్నాడని, పిల్లలకు పాఠాలు బోధించేందుకు అతను ప్రతి రోజు ఇదే ప్రాంతం గుండా వెళ్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఆ వృద్ధుడు ఆ రోజు ప్రైవేటు స్కూల్లోని పిల్లలకు పాఠాలు చెప్పి తిరిగి ఇంటికి పయనమవుతుండగా ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో సదరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు బిహార్ పోలీసులు ట్విట్టర్లో తెలిపారు. (చదవండి: కుక్కను 'కుక్క' అన్నందుకు గొడవ.. చివరికి మనిషి ప్రాణం తీసింది) -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వెళ్లనున్న సైకిల్.. ధర ఎంతో తెలుసా?
మన దేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ సైకిళ్లకు కూడా అధరణ భారీగా పెరుగుతుంది. దీంతో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. నెక్స్‌జు మొబిలిటీ అనే కంపెనీ తన సరికొత్త ఈ సైకిళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంట్లో పనుల కోసం స్వల్ప దూరానికి ఈ సైకిల్ భాగ ఉపయోగపడనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఈ-సైకిల్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనుంది. దీనిని తొక్కాల్సిన అవసరం కూడా లేదు అని తెలిపింది. ప్రస్తుతం, నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సైకిల్ 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్‌జు మొబిలిటీ రోడ్ లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ 5.2ఎహెచ్, డిటాచబుల్ 8.7ఎహెచ్ తో రెండు బ్యాటరీలను కలిగి ఉంది. ఇది 250డబ్ల్యు బిఎల్డిసి ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. దీనిలో రెండు ఎబిఎస్ డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి. దీని ధర రూ.44,000గా ఉంది. ఈ రోడ్‌లార్క్ ఎలక్ట్రిక్ సైకిల్ని ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. అలాగే, రోడ్‌లార్క్ కార్గో వేరియెంట్ అందుబాటులో ఉంది. దీనికి ఉండే స్టీల్ ప్రేమ్ చాలా గట్టిగా ఉంటుందనీ సరుకులు, సామాన్లు కూడా మోసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పింది. (చదవండి: ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీల కూడా భారతీయులే సీఈఓలు..!) ఈ సైకిల్ మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుతూ కూడా అనుకున్న గమ్యానికి వెళ్ళవచ్చు. వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. మోడల్ బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. మీరు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే కంపెనీ అధికారిక వెబ్సైట్ (https://nexzu.in)లోకి వెళ్లి కొనుక్కోవచ్చు. నెక్స్‌జు మొబిలిటీ చెన్నైలోని మదురై, హర్యానాలోని గురుగ్రామ్, కర్ణాటకలోని విజయపుర, గుజరాత్ లోని అహ్మదాబాద్, హర్యానాలోని బల్లాబ్ ఘర్, తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్ గిరి, ఛత్తీస్ గఢ్ వంటి నగరాల్లో దేశవ్యాప్తంగా తమ డీలర్ షిప్ నెట్ వర్క్ విస్తరించింది. -
పుణే: మెట్రో రైళ్లలో సైకిళ్లు తీసుకెళ్లొచ్చు
పింప్రి(మహారాష్ట్ర): పుణే మెట్రోలో ప్రయాణించేవారు ఇకపై తమ వెంట సైకిళ్లను కూడా తీసుకువెళ్లవచ్చని మెట్రో ఎండీ బ్రిజేష్ దీక్షిత్ వెల్లడించారు. దీంతో మెట్రో రైలులో ప్రయాణించిన తరువాత ఆటోలు, బస్సుల కోసం వేచిచూడాల్సిన అవసరముండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ఎంతోమందికి మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు. సైకిళ్ల కారణంగా పర్యావరణానికి హాని జరగకపోవడమే గాక రోడ్లపై ట్రాఫిక్ కూడా తగ్గుందని వివరించారు. (చదవండి: ప్యాసింజర్ రైళ్ల వల్లే నష్టాలు.. ఇదేం చోద్యం?) సాధారణంగా ప్రజలు మెట్రో స్టేషన్‌కు రావాలన్నా, ఇక్కడి నుంచి వేరేచోటికి వెళ్లాలన్నా ఆటోలు, బస్సులను ఆశ్రయిస్తారు. దీని కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పెరగడంతో పాటు ఎక్కువ ఖర్చు అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. అలాంటి వారు తమ వెంట సైకిల్ తెచ్చుకుంటే మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలన్నా, రైలు దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లాలన్నా సైకిళ్లు ఎంతో దోహద పడతాయని బ్రిజేష్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. -
ఎలక్ట్రిక్ సైకిల్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ. మైలేజ్
మన దేశంలో క్రమ క్రమంగా ఎలక్ట్రిక్ సైకిళ్లకు అధరణ పెరుగుతుంది. తాజాగా మార్కెట్లోకి నెక్స్‌జు మొబిలిటీ కంపెనీ తన సరికొత్త ఈ సైకిల్ ను విడుదల చేసింది. ఇంట్లో పనుల కోసం స్వల్ప దూరానికి ఈ సైకిల్ భాగ ఉపయోగపడనున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కొత్త ఈ-సైకిల్ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లనుంది. తొక్కాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం, నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి ఉండే స్టీల్ ప్రేమ్ చాలా గట్టిగా ఉంటుందనీ సరుకులు, సామాన్లు కూడా మోసుకెళ్లవచ్చని కంపెనీ చెప్పింది. దీనికి డిస్క్ బ్రేకులు ఉన్నాయని తెలిపింది. ఈ సైకిల్ మరో ప్రత్యేకత ఏంటంటే ఛార్జింగ్ అయిపోతే పెడల్స్ తొక్కుతూ కూడా అనుకున్న గమ్యానికి వెళ్ళవచ్చు. ఇందులో త్రొట్టిల్ మోడ్ సైకిల్ 75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ సైకిళ్లు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. కాబట్టి వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. ఈ సైకిల్ మార్కెట్ ధర రూ.42,000 ఉంది. మోడల్ బట్టి వేర్వేరు ధరలు ఉన్నాయి. మీరు దీన్ని కొనుక్కోవాలి అనుకుంటే కంపెనీ అధికారిక వెబ్సైట్ (https://nexzu.in)లోకి వెళ్లి కొనుక్కోవచ్చు. నెక్స్‌జు కంపెనీ సీఈఓ రాహుల్ షోనాక్ తాము ఈ కొత్త సైకిళ్లను లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. చదవండి: సైకిల్ అమ్మకాల స్పీడ్ -
దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!
ముంబై, సాక్షి: దేశీ మార్కెట్లో యూరోపియన్ తయారీ ప్రీమియం సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు స్టార్టప్ అల్ఫావెక్టర్ తాజాగా వెల్లడించింది. ఇందుకు వీలుగా యూరోపియన్ దిగ్గజం కేటీఎంతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తద్వారా దేశీయంగా ఖరీదైన యూరోపియన్ సైకిళ్లను అందించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా వీటికి ప్రత్యేక పంపిణీదారుగా నిలవనున్నట్లు వివరించింది. కేటీఎం తయారీ ప్రీమియం సైకిళ్లు రూ. 30,000 ప్రారంభ ధర నుంచి లభించనున్నట్లు తెలియజేసింది. దేశీ మార్కెట్లో రూ. 10 లక్షల వరకూ గరిష్ట విలువగల పలు మోడళ్ల సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. చదవండి: (హెల్మెట్ వాయిస్ కమాండ్స్‌తో ఇక బైకులు!) మెరాకీసహా.. అల్ఫావెక్టర్ ఇటీవల మెరాకీ పేరుతో ఈబైసికిల్ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఇప్పటికే చౌక- ప్రీమియం విభాగాల్లో మౌంటెయిన్, ఆల్‌టెరైన్, హైబ్రిడ్, ఫ్యాట్ టైర్ బైకులను ప్రవేశపెట్టింది. దేశీయంగా సైక్లింగ్‌కు ఆదరణ పెరుగుతున్నట్లు ఈ సందర్భంగా అల్ఫావెక్టర్ సీఈవో సచిన్ చోప్రా పేర్కొన్నారు. ప్రధానంగా ప్రీమియం విభాగంలో అధిక వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాలలో ప్రజలు సైక్లింగ్ తదితర ఆరోగ్యకర జీవన విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ప్రీమియం సైక్లింగ్ విభాగంలో భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. భారత్ మార్కెట్లో కేటీఎం బైసికిల్స్ను ప్రవేశపెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. 2015లో.. డిమాండుకు అనుగుణంగా అత్యంత నాణ్యమైన, పటిష్ట పనితీరును చూపగల సైకిళ్లను అందించనున్నట్లు చోప్రా తెలియజేశారు. మిలీనియల్స్, జెన్-జెడ్ విభాగాలపై ప్రత్యేక దృష్టితో సైకిళ్లను అందించనున్నట్లు వివరించారు. ఐదు దశాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన కంపెనీగా గరిష్ట ప్రమాణాలతో సైకిళ్లను తయారు చేస్తున్నట్లు అల్ఫావెక్టర్తో ఒప్పందం సందర్భంగా కేటీఎం బైక్ ఇండస్ట్రీస్ ఎండీలు జోహనా ఉర్కాఫ్, స్టెఫాన్ లింబ్రన్నర్ పేర్కొన్నారు. తమ సైకిళ్లకు ప్రధానంగా మెట్రో నగరాల నుంచి అధిక డిమాండ్ కనిపించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. 2015లో ప్రారంభమైన అల్ఫావెక్టర్లో ఇప్పటికే ఫైర్‌సైడ్ వెంచర్స్, అవానా క్యాపిటల్, టైటన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేశాయి. -
ప్రముఖ వ్యాపారి భార్య అనుమానాస్పద మృతి కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సైకిల్ తయారీదారు అట్లాస్ సైకిల్స్ అధినేత సంజయ్ కపూర్ భార్య నటాష్ కపూర్ (57) అనుమానాస్పద మరణం కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. జీవితం మీద విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం కూడా ఆత్మహత్యకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ ఔరంగజేబు మార్గంలోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయినట్టుగా బుదవారం తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం నటాషా మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. లోధి రోడ్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మధ్యాహ్న భోజనానికి డైనింగ్ హాల్‌కు తల్లి రాకపోవడంతో నటాషా కుమారుడు సిద్ధాంత్ కపూర్ ఆమెకు ఫోన్ చేశారు. తల్లి నుంచి ఎలాంటి స్పందనరాకవడంతో ఆమె గదికివెళ్లి చూశాడు. అక్కడ ఆమె సీలింగ్ ఫ్యాన్‌ను వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైన అతను కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మరోవైపు ఈ సమయంలో కొడుకు, కుమార్తె ఇంట్లోనే వుండగా, భర్త సంజయ్ కపూర్ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన.. భారీగా సైకిళ్ల స్వాధీనం!
సాక్షి, అనంతపురం : జిల్లాలో అధికార టీడీపీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంచేందుకు టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బీహార్ నుంచి తీసుకొచ్చిన కార్మికుల చేత సైకిళ్లను బిగిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన సైకిళ్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లాలోని పరిగి మండలం సేవమందిరంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న 580 సైకిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు. -
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
సాక్షి, కర్నూలు: తెలుగుతేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. నిబంధనలంటే తమకు లెక్కలేదన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బుధవారం ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో టీడీపీ నాయకులు పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణి కోసం జెడ్పీహైస్కూల్‌కు లారీలో సైకిళ్లను తీసుకు వచ్చారు. దీన్ని గమనించిన గ్రామస్తులు లారీ డ్రైవర్‌ను నియదీయగా తనకు ఏమీ తెలియదని కమిషన్ర్ ఆదేశాల మేరకు తీసుకు వచ్చామని చెప్పాడు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకొవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
నడిచే బడికెళ్తా!
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదివే బాలికలకు ‘బడికెళ్తా’ పేరుతో ప్రభుత్వం గత ఏడాది ఆర్భాటంగా సైకిళ్లు పంపిణీ చేసి.. ఈ ఏడాది మాత్రం మొండి చేయి చూపింది. బాలికల డ్రాప్ అవుట్స్ శాతాన్ని తగ్గించాలని, ముఖ్యంగా తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం గత ఏడాది బడికెళ్తా పథకంలో సైకిళ్లు పంపిణీ చేసింది. గత ఏడాది తమ సీనియర్ల్కు ఇచ్చినట్లుగా తమకు సైకిళ్లు ఇస్తారని ఈ ఏడాది తొమ్మిదో తరగతికి వచ్చిన బాలికలు ఎంతగానో ఎదురు చూశారు. పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటినా సైకిళ్ల పంపిణీ టెండర్ల గడప కూడా దాటలేదు. టెండర్లు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు సైకిళ్లను సిద్ధం చేస్తారో, వాటిని బాలికలకు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో బాలికలకు కాలినడనే పాఠశాలలకు వెళుతున్నారు. ప్రచార ఆర్భాటమే.. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటానికే కేరాఫ్‌గా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న బాలికలు మధ్యలో పాఠశాల మానివేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బడికొస్తా కార్యక్రమానికి గత ఏడాది శ్రీకారం చుట్టింది. జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న 10,941మంది బాలికలకు ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేసంఇ. ఈ ఏడాది 11,230 మంది బాలికలు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో బాలికలు సైకిళ్లపై ఆశలు వదులుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లాల వారీగా తొమ్మిదో తరగతిలో ప్రవేశించే బాలికలు ఎంతమంది ఉన్నారన్న లెక్క అన్ని జిల్లాల్లోని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల వద్ద ఉన్నాయి. ఆ డేటాను ఆధారం చేసుకొని మొదటి విడతలో బడికెళ్తాపథకం కింద సైకిళ్లు సిద్ధం చేయవచ్చు. కానీ, ప్రభుత్వానికి ముందు చూపు కొరవడింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, సైకిళ్లు.. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేదు. యూనిఫాం కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ అనేక పాఠశాలల్లోని విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ జాబితాలోకి తాజాగా సైకిళ్లు వచ్చి చేరాయి. పాఠశాలలు పునః ప్రారంభానికి ముందు ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో బడికెళ్తా కార్యక్రమం గురించి ఉపాధ్యాయులతో విస్తృతంగా ప్రచారం చేయించింది. బాలికలు తాము నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో సైకిళ్లు అందించాలని నిర్ణయించింది. పథకానికి రూపకల్పన చేసినప్పటికీ ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. -
మెట్రో స్టేషన్ల వద్ద మొబిసీ సైకిల్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2018 కొత్త సంవత్సరం నుంచి ఓలా, ఉబెర్ తరహాలోనే సైకిళ్లనూ అద్దెకు తీసుకోవచ్చు. సైకిలే కదా అని తేలిగ్గా తీసేయలేం. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా వస్తున్న డాక్లెస్ సైకిల్ షేరింగ్ యాప్ ఇదే. సాధారణంగా సైకిల్ అద్దెలు ఎలా ఉంటాయంటే.. నిర్దేశించిన ప్రాంతం నుంచే సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలి. అలాగే కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయాలి. కానీ, మొబిసీలో అలా కాదు.. సైకిల్‌ను ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. వినియోగించాక ఎక్కడైనా పార్కింగ్ చేసేయొచ్చు. ఇదే దీని ప్రత్యేకత. జనవరి చివరికల్లా హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, ఐఐటీ హైదరాబాద్, పలు ఐటీ కంపెనీల్లో మొబిసీ సైకిల్స్ అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని వివరాలను సంస్థ ఫౌండర్ ఆకాష్ గుప్తా ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఎలా వినియోగించాలంటే? ముందుగా మొబిసీ యాప్‌లో లాగిన్ కావాలి. పేరు, ఫోన్ నంబరుతో పాటు ఆధార్ నంబరును నమోదు చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్‌ను జమ చేశాక... ఫోన్ స్క్రీన్ మీద దగ్గర్లో ఉన్న సైకిల్స్ కనిపిస్తుంటాయి. సైకిల్‌ను ఎంపిక చేసి సైకిల్ మీదున్న క్యూఆర్ కోడ్‌ను యాప్‌తో స్కాన్ చేయగానే సైకిల్‌కు ఉన్న తాళం తెరుచుకుంటుంది. రైడ్ పూర్తయ్యాక ముందుగా చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్లో నుంచి చార్జీని మినహాయించి మిగిలిన మొత్తం కస్టమర్ పేటీఎం వ్యాలెట్‌లో జమ అవుతుంది. వెంటనే కస్టమర్ మొబైల్‌కు ఎంత దూరం ప్రయాణించాం? ఎంత సమయం పట్టింది? ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి? ఎంత కార్బన్‌ను ఆదా చేశాం? వంటి సమాచారమంతా వస్తుంది. సైకిల్‌ను ఎక్కడ పార్కింగ్ చేయాలి? మొబిసీ పార్కింగ్ రెండు రకాలుగా ఉంటుంది. స్థానికంగా ప్రభుత్వం కేటాయించిన నిర్దేశిత ప్రాంతాల్లోనే పార్కింగ్ చేయవచ్చు. లేదా కంపెనీ నిర్ణయించిన ప్రాంతాల్లో అంటే కళాశాలలు, మెట్రో స్టేషన్లు, ప్రధాన మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ఆఫీసులు, జిమ్, పార్క్‌ల వంటి జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మొబిసీ సైకిళ్లను అద్దెకు తీసుకోవచ్చు. పార్కింగ్ చేయనూ వచ్చు. చార్జీ ఎంత?: ప్రతి రైడ్‌కు అరగంటకు రూ.10 చార్జీ ఉంటుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్కైతే రూ.99. రోజుకు 2 రైడ్లు చేసుకోవచ్చు. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.999 చెల్లించాలి. రైడ్ పూర్తయ్యాక రిఫండ్ చేస్తారు. విద్యార్థులకైతే రూ.499 డిపాజిట్. ప్రస్తుతం మొబిసీకి 10 వేల మంది యూజర్లున్నారు. రోజుకు 1,000 రైడ్స్ జరుగుతున్నాయి. జనవరి నుంచి హైదరాబాద్‌లో.. ‘‘ప్రస్తుతం గుర్గావ్, నోయిడా, ఫరీదాబాద్ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో 500 సైకిళ్లున్నాయి. మరో 10 రోజుల్లో చండీగఢ్, కోల్‌కతా, పుణేల్లో ఒక్కో నగరంలో 150 సైకిళ్లతో సేవలను ప్రారంభిస్తున్నాం. జనవరి చివరికల్లా హైదరాబాద్‌లో మొబిసీ సైకిళ్లను అందుబాటులోకి తెస్తాం. తొలిదశలో 300 సైకిళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఐఐటీ–హైదరాబాద్, ఎస్టీపీఐ, మెట్రో రైల్ సంస్థలతో చర్చలు జరిపాం. మొత్తంగా మార్చి నాటికి 5 వేల సైకిళ్లకు చేరాలని లకి‡్ష్యంచాం. 6 నెలల్లో రూ.65 కోట్ల సమీకరణ.. గుర్గావ్లో కంపెనీ ప్రారంభించే సమయంలో రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఈక్విటీ ఇన్వెస్టర్ రూ.3.25 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో 6 నెలల్లో రూ.65 కోట్ల నిధులను సమీకరించనున్నాం. ఒకరిద్దరు ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మా సంస్థలో 25 మంది ఉద్యోగులున్నారు. హైదరాబాద్‌లో సేవలకు కొత్తగా మరో 8 మందిని తీసుకుంటున్నాం’’ అని గుప్తా వివరించారు. -
బ్యాటరీ సైకిల్‌పై సవారీ
35 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ఆకట్టుకుంటున్న ఈ-పేంథర్, ఈ-డ్రాగన్ సైకిళ్లు రూపొందించిన గైట్ విద్యార్థులు రాజానగరం : ఆలోచనలకు పదును పెడితే అనేక అద్భుతాలను ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు స్థానిక గైట్ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేస్తున్న థర్డియర్, ఫైనల్ ఇయర్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ఈ సైకిళ్లకు ‘ఈ–పేంథర్, ఈ–డ్రాగాన్’ అని నామకరణం చేశారు. వీటికి సంబంధించిన వివరాలను హెచ్ఓడీ సుబ్రహ్మణ్యం శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ–పేంథర్ ఆటోమెబైల్ ఇంజినీరింగ్ చదువుతున్న బీటెక్ థర్డియర్ విద్యార్థులు హర్షవర్థన్‌రెడ్డి, కుమార్ వెంకటేష్, చంద్రశేఖర్ తాతాజీ పాత సైకిళ్లను తీసుకుని మెరుగులు దిద్దారు. బ్యాటరీ, మోటారును అమర్చిన సైకిల్‌కు ‘ఈ–పేంథర్’ అని పేరుపెట్టారు. దీని తయారీకి రూ.17 వేలు ఖర్చయింది. ఈ–డ్రాగాన్ బీటెక్ ఫైనలియర్‌కు చెందిన రాఘవ, మంజూష, మోహన్, సందీప్‌లు ఇదే తరహాలో బ్యాటరీతో నడిచే సైకిళ్లను రూపొందించారు. ‘ఈ–డ్రాగాన్’ పేరు పెట్టిన వీటి తయారీకి రూ.16 వేల వరకు ఖర్చు చేశారు. ప్రొఫెసర్ సందీ రాజశేఖర్ పర్యవేక్షణలో వీటిని తయారు చేశారు. బాలల నుంచి వృద్ధుల వరకూ ఈ వాహనాలను నడిపే వీలుంది. 35 కి.మీ. వేగంతో నడిచే ఈ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీకి ఒకసారి చార్జింగ్ పెడితే 30 కి.మీ. వరకూ నడుస్తుంది. ఈ సైకిళ్లకు ఒక్కోదానికి 250 వాట్స్ మోటారు, కంప్యూటర్ యూపీఎస్‌లో వాడే బ్యాటరీలు నాలుగు (ఒక్కొక్కటి 12 వాట్స్) ఉపయోగించారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా వీటిని తయారు చేశారని హెచ్ఓడీ తెలిపారు. -
సైకిళ్లపై 258 మంది పెళ్లి కొడుకుల సవారీ
సూరత్: దేశ రాజధాని ఢిల్లీ, సూరత్ సహా దేశంలోని పలు ఉత్తర, మధ్య భారత నగరాలను తీవ్ర వాయు కాలుష్యం కమ్ముకున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికిగాను సూరత్‌లో సోమవారం 258 మంది పెళ్లి కొడుకులు బంధు, మిత్రుల సపరివారం తోడురాగా సైకిళ్లు తొక్కుకుంటూ పెళ్లి మంటపానికి చేరుకున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకులు గుర్రాలపై, కార్లలో ఓ బరాత్లాగా పెళ్లి మంటపానికి చేరుకుంటారు. అందుకు భిన్నంగా ఈకో ఫ్రెండ్లీగా సైకిళ్లపై స్వారీ చేస్తూ వచ్చారు. ఇంతమంది పెళ్లి కుమారులు ఒకరోజు ఒకేచోట కలవడానికి కారణం ‘సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్’ సామూహిక వివాహాలను ఏర్పాటు చేయడమే. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో సౌరాష్ట్ర భవన్ నుంచి ప్రారంభమైన పెళ్లి కుమారుల సైకిళ్ల యాత్ర లోక్సమర్పన్ రక్తదాన్ కేంద్ర వద్ద ముగిసింది. దేశంలోని అన్ని స్మార్ట్ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగానే తమ సంస్థ ఈ యాత్రను ఏర్పాటు చేసిందని సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అధ్యక్షులు కంజి బలాల మీడియాతో వ్యాఖ్యానించారు. -
తార్రోడ్డు కాదు... స్టార్రోడ్డు!
‘నువ్వొస్తానంటే... నక్షత్రాలను నీ పాదాల కింద పరిచేస్తా’ అంటాడో ప్రేమికుడు. అలా వీలవుతుందో కాదో తెలియదుగానీ... ఈ రోడ్డును చూస్తే మాత్రం.. వావ్ అనిపిస్తుంది. యూరప్‌లోని ఓ చిన్న దేశం పోలెండ్‌లో ఏర్పాటైన ఈ రోడ్డు రాత్రిపూట నక్షత్రాల మాదిరిగా మిలమిలా మెరిసిపోతూంటుంది. ప్రుజ్స్కోలోని ఓ సాంకేతిక పరిజ్ఞాన సంస్థ డిజైన్ చేసిన ఈ రహదారిలోని ప్రత్యేక పదార్థం పగలంతా సూర్యుడి వెలుగును పీల్చుకుని రాత్రిపూట దాదాపు పదిగంటల పాటు కాంతులీనుతూ ఉంటుంది. ఇంతకీ ఈ మెరిసే రోడ్డును కట్టింది ఎందుకో తెలుసా? రాత్రిళ్లు సైకిళ్లపై వెళ్లేవారి భద్రత కోసమట! దారి కనిపించక ఎక్కడ పడిపోతారో అని దీన్ని ఏర్పాటు చేశారు. ఫొటోలో ఉన్నది నీలం రంగులో మెరుస్తోందిగానీ.. రంగులు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది దీంట్లో. అయితే ఇలాంటి రోడ్డు ఇదే తొలిసారేమీ కాదు. ప్రఖ్యాత చిత్రకారుడు విన్సెంట్ వాన్గో స్వస్థలమైన నెయెనెన్ (నెదర్లాండ్స్)లో డాన్ రూస్‌గార్డే అనే ఆర్టిస్ట్ కూడా ఇలాంటి రహదారి ఒకదాన్ని సిద్ధం చేశారు. అది వాన్గో సుప్రసిద్ధ చిత్రం ‘స్టారీ నైట్’ను పోలి ఉంటుంది. పోలెండ్‌లోని నక్షత్ర దారి అందంగా కనిపించడం మాత్రమే కాకుండా... ఎక్కువ కాలం మన్నుతుందని అంటున్నారు దీని డిజైనర్లు. ఇవన్నీ పక్కన పెట్టండి... చుట్టూ చీకట్లు పరచుకున్న వేళ ఈ నక్షత్రాల దారిలో అలా అలా సైకిల్‌పై వెళ్లడం మిగిల్చే అనుభూతి ఎలా ఉంటుందంటారు? నిజంగానే అది వావ్ ఫ్యాక్టర్. -
సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన ఓ బాలుడు... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే విరమించుకున్న ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అయితే చిన్నతనంలో డాక్టర్ అయ్యి.. అందరికీ సేవలు అందించాలనుకున్న తన కోర్కెను.. జీవితానుభవాలకు అనుగుణంగా మార్చుకొన్న ఆ బాలుడు.. ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుగనేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్ తోపాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. కానీ వరుణ్ 2006 సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైపోయింది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే చాలీ చాలకుండా ఉండేంది. దాంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ళకు పదోతరగతి పరీక్షల్లో పట్టణంలోనే రెండో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరిన వరుణ్.. నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులు కట్టేవాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తాను అనుకున్నట్లుగా ఎంబిబిఎస్ చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఎంఐటీ కాలేజ్ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసై... స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగి పూర్తయ్యే లోపే క్యాంపస్ సెలెక్షన్ లో 2012 లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే అనుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్ సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అందుకు పుస్తకాలు కొనడానికి కూడ ఎంతో ఇబ్బందులు పడి, చివరికి ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్ సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వరుణ్.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. -
సైకిల్ తో భారత స్వర్ణ చతుర్భుజిని దాటాడు..!
ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లలో తన సైక్లింగ్ ను పూర్తి చేసిన ఓ యువకుడు... ఇప్పుడు తన భారత ప్రయాణంవైపు దృష్టి సారించాడు. సన్నని దారులు, ఇరుకైన ప్రాంతాల్లోని అడ్డంకులను సైతం తప్పించుకొంటూ ప్రయాణించాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే కివి సైకిల్ తో... రికార్డు సాధనే ధ్యేయంగా దూసుకుపోతున్నాడు. భారత ప్రధాన నగరాల్లో పారిశ్రామిక వ్యవసాయ, సాంస్కృతిక కేంద్రాలుగా పనిచేసే రహదారి నెట్వర్క్ స్వర్ణ చతుర్భుజిని దిగ్విజయంగా దాటేశాడు. రెండేళ్ళ క్రితం 24 ఏళ్ళవయసున్న టిమ్ ఛిట్టాక్ తన ఫాస్టెట్ సైక్లింగ్ తో ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ పర్యటనలు ముగించుకొని తాజాగా భారత్ లో ప్రవేశించాడు. న్యూజిల్యాండ్ వైకటో విశ్వవిద్యాలయంనుంచి లా అండ్ ఎకనామిక్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన ఛిటాక్... ఫిబ్రవరి 27న ఢిల్లీలో న్యూజిల్యాండ్ ఎంబసీనుంచీ సైకిల్ ప్రయాణం ప్రారంభించాడు. సగటున 250 కిలోమీటర్ల చొప్పున మొత్తం 24 రోజుల్లో 6000 కిలోమీటర్ల దూరం సైకిల్ ప్రయాణం చేస్తూ చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, జైపూర్, కాన్పూర్, పూనే, సూరత్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన నగరాలన్నీ చుట్టేశాడు. తాను సవాలుగా స్వీకరించిన ఈ సైక్లింగ్ తనకు గొప్ప అనుభవాన్నిచ్చిందని ఛిటాక్ చెప్తున్నాడు. సైక్లింగ్ చేయడానికి జాతీయ రహదారులు కొంత సహకరించేవిగానే ఉంటాయని, ఇన్నర్, లింక్ రోడ్లలో ప్రయాణమే పెద్ద ఛాలెంజింగ్ గా ఉంటుందని చెప్పాడు. తాను ప్రయాణంలో ఉన్నపుడు కనీసం రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసుకుంటానని చెప్తున్న ఛిటాక్... ఒకసారి ఓ ట్రక్ కింద పడబోయి తృటిలో తప్పించుకున్నట్లు తెలిపాడు. భారత స్వర్ణ చతుర్భుజిపై సైక్లింగ్ చేసి, గిన్నిస్ రికార్డును సాధించే ప్రయత్నంలో ఛిటాక్ రోజుకు 80 కిలోమీటర్ల చొప్పున సైకిల్ తొక్కినట్లు చెప్పున్నాడు. గిన్నిస్ ను సంప్రదించిన అనంతరం ప్రారంభించిన అతడి ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతమౌతుందో తెలియాల్సి ఉంది. -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
-
శ్రీమంతుడు సైకిల్ ఎవరికి?
-
కెమెరా కంటికి చిక్కిన బైకు దొంగలు!!
జంట నగరాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడో కొత్తరకం దొంగతనాలు మొదలయ్యాయి. పార్కింగులో ఉన్న వాహనాలను చాకచక్యంగా లేపేస్తున్నారు. పొరపాటున ఆదమరచి ఉన్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఏమాత్రం వాహనాలకు గ్యారంటీ ఉండట్లేదు. ముఖ్యంగా సైకిళ్లు, బైకులు ఇలాంటి చోరీలకు గురవుతున్నాయి. బైకులు మెరుపు వేగంతో మాయమైపోతున్నాయి. వేలరూపాయలు పోసి సొంత బైకు కొనుక్కున్న ఆనందం ఇంకా తీరకముందే ఆ బైకు ఏ షాపింగ్ కాంప్లెక్సులోనో పార్కింగ్ చేస్తే.. నిమిషాల్లో మాయం అయిపోతోంది. అలాగని బయటే పెట్టక్కర్లేదు. కాస్త రద్దీ ప్రాంతంలో మీ ఇల్లు ఉన్నా కూడా.. ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను కూడా చకచకా తీసుకెళ్లిపోతున్నారు. అసలు ఎవరూ గుర్తించని వాహనాన్ని చూస్తే చాలు.. వాళ్ల చేతులకు దురద మొదలైపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చూడటం, తమను ఎవరూ గమనించకపోతే లైన్ క్లియరైపోయిందని వెంటనే రంగంలోకి దూకుతారు. క్షణాల్లో డ్యూటీకెక్కుతారు. కుదిరితే మారుతాళంతో బైకు తాళం తీస్తారు. వీలైతే తోసుకుంటూ వెళ్లిపోతారు. ఇక సైకిళ్లనయితే, చిన్న పిల్లలు కూడా ఎంచక్కా పార్కింగ్ ప్రదేశాలలోకి వెళ్లి, దొరల్లా తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు. సొంత సైకిల్ కూడా అంత దర్జాగా ఎవరూ తీసుకెళ్లలేరన్నంత ధీమాగా వాళ్లు వెళ్తున్నారు. బైకు లేదా సైకిల్ చోరీ అయ్యిందని యజమాని చూసుకునే వరకూ మూడో కంటికి కూడా విషయం తెలియడు. దొంగల పనితనం అంత అద్భుతంగా ఉంటోంది మరి. ఈ కొత్త తరహా దొంగతనాలు చూసి పోలీసులు తల పట్టుకుంటున్నారు.