![TDP Leaders Violate Election Code in Anantapur - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/24/tdp-cycly.jpg.webp?itok=OiuhYQBo)
సాక్షి, అనంతపురం : జిల్లాలో అధికార టీడీపీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సైకిళ్ల పంచేందుకు టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బీహార్ నుంచి తీసుకొచ్చిన కార్మికుల చేత సైకిళ్లను బిగిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన సైకిళ్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లాలోని పరిగి మండలం సేవమందిరంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న 580 సైకిళ్లను వారు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment