
సాక్షి, కర్నూలు: తెలుగుతేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. నిబంధనలంటే తమకు లెక్కలేదన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. బుధవారం ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండలో టీడీపీ నాయకులు పాఠశాల విద్యార్థినులకు సైకిళ్ల పంపిణి కోసం జెడ్పీహైస్కూల్‌కు లారీలో సైకిళ్లను తీసుకు వచ్చారు.
దీన్ని గమనించిన గ్రామస్తులు లారీ డ్రైవర్‌ను నియదీయగా తనకు ఏమీ తెలియదని కమిషన్‌ర్ ఆదేశాల మేరకు తీసుకు వచ్చామని చెప్పాడు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు పట్టించుకొవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.