పుణెకు చెందిన వైవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) వైవే ఈవాను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. రూ.3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన వైవే ఈవా సోలార్ టెక్నాలజీతో ఈవీ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
వైవే ఈవా పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇది రోజుకు 10 కిలోమీటర్ల పరిధిని పెంచుతుంది. ఈ ఫీచర్ సాంప్రదాయ ఛార్జింగ్ అవసరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ వాహనం ప్రత్యేకమైన బ్యాటరీ రెంటల్ ప్లాన్‌ను అందిస్తుంది. ఇందుకోసం కిలోమీటరుకు రూ.2 సబ్ స్క్రిప్షన్ ఖర్చు అవుతుంది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. నోవా (9 కిలోవాట్ బ్యాటరీ), స్టెల్లా (12 కిలోవాట్ బ్యాటరీ), వెగా (18 కిలోవాట్ బ్యాటరీ) వేరియంట్లు ఉన్నాయి. ఎంచుకున్న బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటాయి. వైవే ఈవా గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: రూ.1,275 లక్షల కోట్లకు ప్రపంచ కుబేరుల సంపద
వైవే ఎవా డెలివరీలు 2026 ద్వితీయార్ధంలో ప్రారంభమవుతాయని వైవ్ మొబిలిటీ ప్రకటించింది. మొదటి 25,000 మంది కస్టమర్లకు పొడిగించిన బ్యాటరీ వారంటీ, మూడు సంవత్సరాల కాంప్లిమెంటరీ వెహికల్ కనెక్టివిటీతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment