‘మనగుడి’తో సామాజిక చైతన్యం
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
– 600 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు
కర్నూలు(న్యూసిటీ) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాలు సామాజిక చైతన్యానికి ఉపకరిస్తున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు సప్తగిరి నగర్‌లోని శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం మనగుడి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యాథితిగా హాజరయ్యారు. జిల్లాలో 600 శివాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయనను హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సన్మానించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఈ మల్లికార్జునరెడ్డి, సమరత సామాజిక సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆలయ ప్రముఖ్ పరంథామరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.