Managudi
-
ఉభయ రాష్ట్రాల్లో ఘనంగా ‘మనగుడి’
- 1,250 మండలాల్లో ఘనంగా గోపూజ, ఉట్లోత్సవం - టీటీడీ జేఈవో పోల భాస్కర్ తిరుపతి అర్బన్: టీటీడీ ధార్మిక సంస్థ ప్రతి ఏడాది హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మనగుడి’ కార్యక్రమం ఈసారీ వైభ వంగా జరిగినట్లు తిరుపతి జేఈవో పోల భాస్కర్ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 14 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన మనగుడి కార్యక్రమాల వివరాలను సోమవారం ఆయన విలేకరులకు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 294 పట్టణాల్లోని గుర్తించిన 300 ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. అందులో భాగంగా తొలిరోజు 12వ తేదీన 1,250 మండలాల్లో ఆలయ శోభ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛం దంగా పాల్గొని వారి ఆలయాలను శుభ్రం చేసుకుని అలంకరణ పనులు నిర్వహించుకున్నారని తెలిపారు. రెండోరోజు 13వ తేదీన 1,250 మండలాల్లోని ఆలయాల్లో నగర సంకీర్తనలు వైభవంగా చేపట్టార న్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలను అత్య«ధిక సంఖ్యలో భాగ స్వాములు చేసేందుకు ఆయా జిల్లా ల్లోని ధర్మ ప్రచార మండళ్లు, భజన మండళ్ల సభ్యుల సహకారం తీసుకు న్నామని చెప్పారు. చివరిరోజైన సోమవారం అన్ని ఆలయాల వద్ద గోపూజలు, యువకులతో ఉట్లోత్స వం నిర్వహించినట్లు పేర్కొన్నారు. -
‘మనగుడి’తో సామాజిక చైతన్యం
- డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి – 600 ఆలయాల్లో మనగుడి కార్యక్రమాలు కర్నూలు(న్యూసిటీ) : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమాలు సామాజిక చైతన్యానికి ఉపకరిస్తున్నాయని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలు సప్తగిరి నగర్‌లోని శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం మనగుడి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యాథితిగా హాజరయ్యారు. జిల్లాలో 600 శివాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయనను హిందూ ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య సన్మానించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శ్రీమణికంఠ అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఈ మల్లికార్జునరెడ్డి, సమరత సామాజిక సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆలయ ప్రముఖ్ పరంథామరెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆరు వందల శివాలయాల్లో మనగుడి
- నేటి ఉదయం 9 గంటలకు పూజలు ప్రారంభం - విలేకరుల సమావేశంలో పత్తి ఓబులయ్య వెల్లడి కర్నూలు (న్యూసిటీ): తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లావ్యాప్తంగా 600 శివాలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు, కార్యనిర్వాహకుడు పత్తి ఓబులయ్య, డాక్టర్ మల్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సీ క్యాంపులోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు సప్తగిరి నగర్‌లోని మణికంఠ అయ్యప్ప దేవాలయం, కల్లూరు ఈశ్వరవీరభద్ర స్వామి, సంకల్బాగ్ వెంకటేశ్వరస్వామి, ఆరోరా నగర్ శివాలయంతోపాటు ఇతర అన్ని ఆలయాల్లో ఉదయం 9 గంటలకు మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్తీక మాసం శుక్ల పౌర్ణమి పురస్కరించుకుని ఈశ్వరునికి బిల్వార్చన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి పాద పద్మాల దగ్గర పూజలు చేయించిన కంకణాలు, పసుపు, కుంకుమను భక్తులకు అందజేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో హిందూ ధర్మ ప్రచార మండలి కార్యదర్శి సూర్య నారాయణ, సభ్యులుపాల్గొన్నారు. -
12,500 ఆలయాల్లో ‘మనగుడి’
► టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి ► తెలుగు రాష్ట్రాల్లో 14న ప్రారంభం తిరుపతి అర్బన్: టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమాన్ని ఈనెల 14వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని 12,500 ఆలయాల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ఆలయాలకు పంపిణీ చేయాల్సిన పసుపు, కుంకుమ, అక్షింతలు ప్యాకింగ్ కార్యక్రమాన్ని తిరుపతి శ్వేత భవనంలో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈవో మాట్లాడుతూ మనగుడి కార్యక్రమాన్ని హిందూ ధర్మప్రచార పరిషత్, దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లో నిర్వహిస్తామన్నారు. అందుకోసం 11వ తేదీన అన్ని ఆలయాల్లో కైశిక ద్వాదశి నిర్వహించనున్నట్లు తెలిపారు. మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించే ఆలయాలకు అక్షింతలు, పసుపు కుంకుమ, కంకణాలతో పాటు రూ.5 వేల నగదు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని భజన బృందాలు, దాతలు, అర్చకులు, శ్రీవారి సేవకులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జేఈవో పోల భాస్కర్ మాట్లాడుతూ మనగుడి కార్యక్రమం ద్వారా దేవాలయాల శోభను పెంచే రీతిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార, ఇతర వెనుకబడి ప్రాంతాల్లో చైతన్యం తీసుకు రావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగా భక్తి పుస్తకాలు భక్తులకు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆల్ప్రాజెక్ట్స్ స్పెషల్ ఆఫీసర్ ముక్తేశ్వర్ రావు, టీటీడీ ఎపిక్ స్టడీస్ స్పెషల్ ఆఫీసర్ దామోదరం నాయుడు, టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. -
11 నుంచి 'మనగుడి'
కర్నూలు(కల్చరల్) : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 11 నుంచి 14 వరకు జిల్లాలో ఎంపిక చేసిన ఆలయాల్లో మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాలు జరగనున్నాయని ధర్మప్రచార మండలి జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 11న జిల్లాలో ఎంపిక చేసిన దళిత వాడల్లోని పది ఆలయాల్లో మంగళకైశికి పూజలు, 12న ఆలయ శోభ, 13న సంకీర్తనలు, భజనలు, 14న జిల్లా వ్యాప్తంగా ప్రతీ మండలంలోని పది శివాలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. శివాలయాల్లో శ్రీవారి పాదముల వద్ద ఉంచిన కంకణధారణ, అక్షింతలు, కలకండ భక్తులకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 530 శివాలయాల్లో 14న మనగుడి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. అదే రోజున జిల్లాలో ఎంపిక చేసిన ఒక శివాలయంలో బిల్వార్చన నిర్వహించనున్నామన్నారు. శ్రీవారి సేవకులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. 31న ధర్మప్రచార మండలి సమావేశం.. మన గుడి ప్రత్యేక ఆరాధనోత్సవాల నిర్వహణ గురించి చర్చించేందుకు సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక సి.క్యాంప్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ధర్మప్రచార మండలి సభ్యుల సమావేశం జరగనున్నదని సభ్యులందరూ ఈ సభలో పాల్గొనాలని ఆ సంస్థ జిల్లా అధ్యక్షులు పత్తి ఓబులయ్య విజ్ఞప్తి చేశారు. -
మూడో విడత 'మనగుడి'ని ప్రారంభించిన టీటీడీ ఈవో
మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఎంజీ గోపాల్ బుధవారం తిరమలలో ప్రారంభించారు. ఈ రోజు శ్రావణ మాసంలోని శ్రవణా నక్షత్రంలో వివిధ ప్రాంతాల్లోని సుమారు 20వేల ఆలయాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని ఆలయాలకు శ్రీవారి సారె మనగుడిలో పాల్గొనే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేందుకు టీటీడీ సారెను ఇప్పటికే సిద్ధం చేసింది. 250 గ్రాముల పసుపు, 250 గ్రాముల కుంకుమ, 100 గ్రాముల అక్షింతలు , కిలో కలకండ, 1000 కంకణాలతో కూడిన అట్టపెట్టలతో కూడిన సారెను ఆలయాలకు తరలించింది. అంతకుముందు టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు ఈ సారెను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక దాతల సహకారంతో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు రక్షాబంధన్ కావటంతో అవసరమైన కంకణాలను కూడా ముందే వివిధ ప్రాంతాల్లోని ఆలయాలకు చేరవేశారు. నేడు శ్రావణ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి తిరుమలలో పున్నమి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. ప్రతి పౌర్ణమి రోజున గరుడ సేవ నిర్వహించటం ఆనవాయితీ. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య ఈ వాహన సేవను వైభవంగా నిర్వహించనున్నారు. నవతరానికి ఆలయాలు, సంస్కృతి మూలాలు, సంప్రదాయాల విశిష్టత తెలపటంతోపాటు ఆదరణకు నోచుకోని ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ‘మనగుడి’ కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టింది. జాతికి ఆధారంగా నిలిచే గుడి సంస్కృతిని భావితరాలకు అందించే లక్ష్యంగా ‘మనగుడి’ని టీటీడీ ప్రారంభించింది. 2012 ఆగస్టు 2వ తేదీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రంలో 13,212 ఆలయా ల్లో ఈ మనగుడి మహోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారు. 2012 నవంబరు 28వ తేదీ కార్తీక మాసంలో మొత్తం 17,536 ఆలయాల్లో రెండో విడత నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘మనగుడి’ పోస్టర్ ఆవిష్కరణ
‘ భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈనెల 21న నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆలయ ఏఈఓ ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనగుడి పేరిట అనేక ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని, ఈనెల 11 నుంచి వరుసగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని తెలిపారు. ఈనెల 16న స్థానిక బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద నున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న భక్తులకు టీటీడీ నుంచి కంకణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, భద్రాచలం ధార్మిక మండలి సభ్యులు శీలం పుల్లారెడ్డి, గంజి పురుషోత్తం పాల్గొన్నారు.