ఆరు వందల శివాలయాల్లో మనగుడి
ఆరు వందల శివాలయాల్లో మనగుడి
Published Sun, Nov 13 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM
- నేటి ఉదయం 9 గంటలకు పూజలు ప్రారంభం
- విలేకరుల సమావేశంలో పత్తి ఓబులయ్య వెల్లడి
కర్నూలు (న్యూసిటీ): తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లావ్యాప్తంగా 600 శివాలయాల్లో మన గుడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షుడు, కార్యనిర్వాహకుడు పత్తి ఓబులయ్య, డాక్టర్ మల్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సీ క్యాంపులోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు సప్తగిరి నగర్‌లోని మణికంఠ అయ్యప్ప దేవాలయం, కల్లూరు ఈశ్వరవీరభద్ర స్వామి, సంకల్‌బాగ్ వెంకటేశ్వరస్వామి, ఆరోరా నగర్ శివాలయంతోపాటు ఇతర అన్ని ఆలయాల్లో ఉదయం 9 గంటలకు మనగుడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్తీక మాసం శుక్ల పౌర్ణమి పురస్కరించుకుని ఈశ్వరునికి బిల్వార్చన పూజలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి పాద పద్మాల దగ్గర పూజలు చేయించిన కంకణాలు, పసుపు, కుంకుమను భక్తులకు అందజేస్తామని తెలిపారు. విలేకరుల సమావేశంలో హిందూ ధర్మ ప్రచార మండలి కార్యదర్శి సూర్య నారాయణ, సభ్యులుపాల్గొన్నారు.
Advertisement