ఉభయ రాష్ట్రాల్లో ఘనంగా ‘మనగుడి’
- 1,250 మండలాల్లో ఘనంగా గోపూజ, ఉట్లోత్సవం
- టీటీడీ జేఈవో పోల భాస్కర్
తిరుపతి అర్బన్: టీటీడీ ధార్మిక సంస్థ ప్రతి ఏడాది హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మనగుడి’ కార్యక్రమం ఈసారీ వైభ వంగా జరిగినట్లు తిరుపతి జేఈవో పోల భాస్కర్ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 14 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన మనగుడి కార్యక్రమాల వివరాలను సోమవారం ఆయన విలేకరులకు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 294 పట్టణాల్లోని గుర్తించిన 300 ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామన్నారు. అందులో భాగంగా తొలిరోజు 12వ తేదీన 1,250 మండలాల్లో ఆలయ శోభ కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛం దంగా పాల్గొని వారి ఆలయాలను శుభ్రం చేసుకుని అలంకరణ పనులు నిర్వహించుకున్నారని తెలిపారు.
రెండోరోజు 13వ తేదీన 1,250 మండలాల్లోని ఆలయాల్లో నగర సంకీర్తనలు వైభవంగా చేపట్టార న్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రజలను అత్య«ధిక సంఖ్యలో భాగ స్వాములు చేసేందుకు ఆయా జిల్లా ల్లోని ధర్మ ప్రచార మండళ్లు, భజన మండళ్ల సభ్యుల సహకారం తీసుకు న్నామని చెప్పారు. చివరిరోజైన సోమవారం అన్ని ఆలయాల వద్ద గోపూజలు, యువకులతో ఉట్లోత్స వం నిర్వహించినట్లు పేర్కొన్నారు.