దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.
చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.
ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానా
ఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment