Hyundai Motor India
-
ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు
దేశవ్యాప్తంగా వచ్చే ఏడేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి సుమారు 600 పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు హ్యుందాయ్ మోటార్స్ ఇండియా వెల్లడించింది. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 50 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. 2030 నాటికి భారత ఈవీ మార్కెట్ భారీ స్థాయిలో వృద్ధి చెందే అవకాశం ఉందని కంపెనీ ఫంక్షన్ హెడ్ (కార్పొరేట్ ప్లానింగ్ విభాగం) జేవాన్ రియూ తెలిపారు.చార్జింగ్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల కస్టమర్లు జాతీయ రహదారులపై సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి సంకోచిస్తున్నట్లుగా తమ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాలతో పాటు కీలక హైవేలపై కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు రియూ తెలిపారు.ఇదీ చదవండి: యూజర్ మాన్యువల్ మిస్సింగ్.. రూ.5 వేలు జరిమానాఇదిలాఉండగా, ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్కు ప్రత్యామ్నాయంగా బ్యాటరీలను స్వాపింగ్(మార్పిడి) చేసే విధానం మనదేశంలోనూ అందుబాటులోకి రానుంది. ఇకపై బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ అయ్యే వరకు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. చార్జింగ్ పూర్తిగా లేకపోయినా, తక్కువ చార్జింగ్ ఉన్నా.. ఆ బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జింగ్ ఉన్న బ్యాటరీలను చార్జింగ్ స్టేషన్లలో క్షణాల్లో స్వాపింగ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను ఇప్పటికే ప్రకటించింది. -
హ్యుందాయ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) రెండు పునరుత్పాదక విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాహనాల తయారీకై 2025 నాటికి పూర్తిగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించాలన్న లక్ష్యంలో భాగంగా తమిళనాడులోని ప్లాంటులో వీటిని నెలకొల్పనుంది.ఇందుకోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నట్టు హ్యుందాయ్ తెలిపింది. 75 మెగావాట్ల సౌర, 43 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌ను స్థాపిస్తారు. ఈ రెండు కేంద్రాలకు హెచ్ఎంఐఎల్ రూ.38 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీతో కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేశారు.హ్యుండై మోటార్ ఇండియాకు ఈ ఎస్పీవీలో 26 శాతం వాటా ఉంటుంది. ప్రస్తుత విద్యుత్ అవసరాల్లో 63 శాతం పునరుత్పాదక వనరుల నుంచి సమకూరుతోందని కంపెనీ తెలిపింది. హెచ్ఎంఐఎల్ ప్లాంటుకు 25 ఏళ్లపాటు ఏటా 25 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేస్తామని ఫోర్త్ పార్ట్నర్ ఎనర్జీ తెలిపింది. -
కార్లలో ఎయిర్‌బ్యాగ్‌లపై హ్యుందాయ్ ప్రకటన
న్యూఢిల్లీ: ఇకపై తమ అన్ని కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉంటాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ముందుగా 3 మోడల్స్‌తో దీన్ని ప్రారంభించనున్నామని, తర్వాత మిగతా మోడల్స్కూ వర్తింపచేస్తామని సంస్థ ఎండీ ఉన్సూ కిమ్ తెలిపారు. వాహన భద్రతా ప్రమాణాలపరమైన దేశీ క్రాష్ టెస్టులకు సంబంధించి ఇటీవల ప్రవేశపెట్టిన భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రామ్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కూడా నిర్ణయించుకున్నట్లు వివరించారు. టెస్టుల ఆధారంగా వాహనానికి 0–5 వరకు స్టార్ రేటింగ్స్ లభిస్తాయి. కొనుగోలుదారులు ఈ రేటింగ్ ప్రాతిపదికన వివిధ కార్లలో భద్రతా ప్రమాణాలను పోల్చి చూసుకుని తగు నిర్ణయం తీసుకోవచ్చు. తమ మధ్య స్థాయి సెడాన్ కారు వెర్నాకు గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించినట్లు సంస్థ తెలిపింది. -
హ్యుందాయ్ చేతికి జీఎం ప్లాంట్.. కొత్త వ్యూహాలు సిద్ధం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా.. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న జనరల్ మోటార్స్ (జీఎం) ఇండియాకు చెందిన తాలేగావ్ ప్లాంటును కొనుగోలు చేయనుంది. డీల్ పూర్తయితే స్థలం, భవనాలు, యంత్రాలు హ్యుందాయ్ పరం కానున్నాయి. ఇందుకోసం జీఎం ఇండియాతో టెర్మ్ షీట్ ఒప్పందం చేసుకున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సోమవారం ప్రకటించింది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. ప్లాంటు చేతికి వచ్చిన తర్వాత తొలుత వెన్యూ ఎస్‌యూవీని ఈ కేంద్రంలో తయారు చేసి ఎగుమతి చేయాలన్నది హ్యుందాయ్ ఆలోచన. 2028 నాటికి భారత్‌లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే 6 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరు వద్ద ఉన్న హ్యుందాయ్ ప్లాంటు దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తోంది. భారత్‌తోపాటు విదేశాల నుంచి కంపెనీ కార్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అదనపు తయారీ సామర్థ్యం ఇప్పుడు సంస్థకు తప్పనిసరి. -
దీపావళి కళ్లు చెదిరే అఫర్లు.. కారు కొంటే రూ.లక్ష తగ్గింపు!
అక్టోబర్ నెల రావడంతో పండగ కల వచ్చేస్తోంది. ప్రారంభంలో దసరాతో వచ్చి పోతూ పోతూ దీపావళితో ధూం ధాం చేసి వెళ్తుంది. పండుగా వస్తే చాలు.. ప్రజలు సాధారణ రోజుల కంటే ఈ రోజుల్లోనే కాస్త ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లకు హాయ్ చెబుతుంటాయి. ఈ దీపావళి సందర్భంగా మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. పండుగ సీజన్లో పలు కంపెనీలు తమ కార్లపై భారీగా తగ్గింపులు, బెనిఫిట్స్‌ని ప్రకటిస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా మైండ్‌బ్లోయింగ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిండంతో పాటు ఏకంగా రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని ప్రకటించింది. హ్యుందాయ్ కోనా(Hyundai Kona Electric) హ్యుందాయ్ కోనా కారు రూ. 1 లక్ష క్యాష్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV ఇటీవలే రెండు కొత్త కలర్స్‌ని కూడా లాంచ్ చేసింది. కోనా ఎలక్ట్రిక్ ధర రూ. 23.84 లక్షల నుంచి 24.03 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్(Hyundai Grand i10 Nios) కంపెనీ శాంట్రో నిలిపివేయడంతో, ప్రస్తుతం హ్యుందాయ్ ఎంట్రీ-లెవల్ మోడల్‌గా గ్రాండ్ i10 నియోస్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి 8.45 లక్షల వరకు ఉంది. దీనిపై దాదాపు రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 (hyundai i20) హ్యుందాయ్ ఐ20 (hyundai i20) కారుపై రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు ఉన్నాయి. ఈ ఆఫర్లు i20 Magna, Sportz వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ఐ20 ధర రూ.7.07 లక్షల నుంచి రూ.11.62 లక్షల మధ్య ఉంది. ఉంటుంది. ఇక ఈ మోడల్‌పై కార్పొరేట్ డిస్కౌంట్లు లేవని తెలిపింది. హ్యుందాయ్ ఆరా(Hyundai Aura) హ్యుందాయ్ ఆరా మోడల్‌పై కూడా ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ కారుపై రూ. 33 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20 వేలు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వంటివి కూడా కలిసి ఉన్నాయి. ఇతర వేరియంట్లు రూ. 18,000 వరకు గరిష్టంగా ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఆరా ప్రారంభ ధర రూ. 6.09 లక్షల నుంచి గరిష్టంగా 8.87 లక్షలు ఉంది. గమనిక:పైన పేర్కొన్న ఆఫర్లు. నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు, మరిన్ని వివరాల కోసం మీ సమీప డీలర్‌షిప్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇవి పండుగ ఆఫర్లు కాబట్టి అక్టోబర్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదవండి: బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్! -
క్రేజీ లుక్స్‌తో హల్చల్ చేస్తున్న హ్యుందాయ్ క్రెటా నయా ఎడిషన్.! ధర ఎంతంటే...?
దక్షిణ కొరియన్ ఆటో మొబైల్ దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్లలోకి సరికొత్త క్రెటా నైట్(Knight Edition) ఎడిషన్ వేరియంట్న్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ కారుకు సంబంధిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో హ్యుందాయ్ పొందుపర్చింది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం...నైట్ ఎడిషన్ మోడల్ 1.5-లీటర్ MPI, 1.5-లీటర్ CRDi పవర్ట్రెయిన్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ. 13.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభంకానున్నాయి. లుక్స్‌లో బ్లాక్ బీస్ట్..! హ్యుందాయ్ నైట్ ఎడిషన్ కారు పూర్తిగా బ్లాక్ కలర్ బ్లాక్ బీస్ట్‌గా కన్పించనుంది. డార్క్ మెటల్ అల్లాయ్ వీల్స్, రెడ్ ఇన్సర్ట్లతో బ్లాక్ రేడియేటర్ గ్రిల్, బ్లాక్ కలర్ ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రెయిల్లకు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్, సైడ్-వ్యూ మిర్రర్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్ , నైట్ ఎడిషన్ బ్యాడ్జ్‌తో వస్తుంది. నయా క్రెటా నైట్ మొత్తం-బ్లాక్ కలర్ ఇంటీరియర్ స్కీమ్‌ను పొందుతుంది. ఇంజన్ విషయానికి వస్తే...! హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్, డిజీల్ వేరియంట్లలో రానుంది. 1.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 113bhp శక్తిని, 144Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మరో వేరియంట్ 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 113bhp శక్తిని 250Nm టార్క్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ కారు మూడు గేర్‌బాక్స్ ఎంపికల్లో రానుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్-కన్వర్టర్, ఐవీటీ IVT గేర్ బాక్స్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. చదవండి: తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్..రేంజ్లో కూడా అదుర్స్..! ధర ఎంతంటే...? -
హ్యుందాయ్ కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా యూజర్లు
హ్యుందాయ్ మోటార్స్ కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ సపోర్ట్ చేస్తూ పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ దేశంలో కాశ్మీర్ కోసం పోరాడి చనిపోయిన వారిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది కాశ్మీరీ సంఘీభావ దినాన్ని అక్కడ జరుపుకుంటారు. అయితే, ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ పాకిస్తాన్ తన ట్విటర్ హ్యాండిల్స్ ద్వారా చేసిన ఒక పోస్టులో.. "మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను గుర్తుంచుకుందాం. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలబడదాం" అని హ్యుందాయ్ #KashmirSolidarityDay అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి పోస్ట్ చేసింది. అయితే, ఆ పోస్టులు ఇప్పుడు తొలగించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హ్యుందాయ్ పాకిస్తాన్ ట్విటర్ హ్యాండిల్ పోస్టు చేసిన ట్వీట్లను చాలా మందికి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్ వేదికగా యూజర్లు షేర్ చేస్తూ కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ట్విటర్ వినియోగదారులు ఈ పోస్టుపై తన వైఖరిని వివరించాలని కోరుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను కోరుతూ భారీ సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఇంకా, చాలా మంది భారతీయ వినియోగదారులు హ్యుందాయ్ ఇండియా ఉత్పత్తులను బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు. చాలా మంది ఆ కంపెనీకి చెందిన కార్లను అస్సలు కొనవద్దు అని కోరుతున్నారు. Hyundai in Pakistan is asking for freedom of Kashmir. Hyundai Pakistan also posted them same on its Facebook page. Link: https://t.co/ZOBDggsdW0 pic.twitter.com/Kmmk2Rc1wu — Anshul Saxena (@AskAnshul) February 6, 2022 Hello @Hyundai_Global ,How come your official handle in Pak is supporting terror state Pakistan’s propaganda on Kashmir ?@HyundaiIndia If you can’t respect sovereignty of my nation,Pack your bags and leave my country ! Friends,Keep retweeting till @Hyundai_Global apologise ! pic.twitter.com/zbtth6NklS — Major Surendra Poonia (@MajorPoonia) February 6, 2022 Why do brands need to meddle in Politics? pic.twitter.com/j5xPqWvLCN — Gabbbar (@GabbbarSingh) February 6, 2022 @Hyundai @HyundaiIndia time to change your name pic.twitter.com/okSDJSUX24 — Professor Disrespect (@Deludedindian) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 For Hyundai pakistan if it is freedom struggle going on in kashmir, then Indians will hv to rethink about buying @HyundaiIndia cars. Cant leave this behind. pic.twitter.com/1zxgdNPbbi — Pratheesh Viswanath (@pratheesh_Hind) February 6, 2022 వినియోగదారులు ఆ ట్వీట్లను చూడకుండా సంస్థ పరిమితం చేసింది. ఈ సమస్యపై నేరుగా ప్రస్తావించకుండా హెచ్ఎంఐఎల్ తన ప్రకటనలో"హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పుడు 25 సంవత్సరాలకు పైగా భారతీయ మార్కెట్ లో ఉంది. జాతీయవాదాన్ని గౌరవించే మా బలమైన నైతిక తత్వానికి మేము దృఢంగా నిలబడతాము. హ్యుందాయ్ మోటార్ ఇండియాను కలిపే అవాంఛనీయ సోషల్ మీడియా పోస్ట్ ఈ గొప్ప దేశానికి మా అసమాన నిబద్ధత, సేవను దెబ్బతీస్తోంది. హ్యుందాయ్ బ్రాండ్'కు భారతదేశం రెండవ నిలయం, సున్నితమైన విషయాలలో ఎటువంటి ఉపేక్ష వహించేది లేదు. అటువంటి అభిప్రాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతదేశం పట్ల మా నిబద్ధతలో భాగంగా, దేశంతో పాటు దాని పౌరుల మెరుగుదల దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాము" అని ఆ ప్రకటనలో తెలిపింది. -
హ్యుందాయ్‌కు గట్టి షాకిచ్చిన టాటా మోటార్స్..!
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్‌కు భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ గట్టి షాక్‌ను ఇచ్చింది. వాహనాల విక్రయాల్లో టాటా మోటార్స్ దుమ్మురేపింది. రెండో స్థానం టాటా కైవసం..! 2021 డిసెంబర్ నెలలో వాహనాల విక్రయాల్లో హ్యుందాయ్ మోటార్స్‌ను వెనక్కి నెట్టి టాటామోటార్స్ రెండో సానంలో నిలిచింది. టాటా మోటార్స్ డిసెంబర్ 2021లో ఏడాది ప్రాతిపదికన భారత్‌లో అమ్మకాలు 24 శాతం పెరిగాయని నివేదించింది. డిసెంబర్ 2020లో విక్రయించబడిన 53,430 యూనిట్ల కంటే అధికంగా ఈ నెలలో సుమారు 66,307 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. గడిచిన డిసెంబర్ నెలలో వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 31,008 యూనిట్లను సేల్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. గత ఏడాది 2020 డిసెంబర్ నెలతో పోలిస్తే 2021 డిసెంబర్ నెలలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు గణనీయంగా 50 శాతం మేర పెరిగాయి. 2021 డిసెంబర్గాను 35,299 యూనిట్ల అమ్మకాలను టాటామోటార్స్ జరిపింది. నెక్సాన్, టాటా పంచ్ అదుర్స్..! గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించిన టాటా పంచ్‌కు మార్కెట్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఎస్‌యూవీల్లో టాటా పంచ్‌ను కొనేందుకు కొనుగోలుదారులు మొగ్గుచూపారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ గణనీయమైన డిమాండ్‌ను కల్గి ఉంది. దీంతో గత ఏడాది డిసెంబర్ నెలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు. చదవండి: చైనా కంపెనీ కొంపముంచిన ట్రంప్ సంతకం..! -
భారత్‌లోకి మరో హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు..! 18 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఫుల్..!
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లపై భారీ ప్రణాళికలను రచిస్తోంది. వచ్చే ఆరేళ్లలో సుమారు ఆరుకు పైగా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది. 2022లో హ్యుందాయ్ మోటార్స్ ‘కొనా’ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. దీంతో పాటుగా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ కార్లలో Ioniq 5 కారును కూడా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 23 ఎలక్ట్రిక్ కార్లను, ఒక మిలియన్ ఈవీలను విక్రయించాలని హ్యుందాయ్ ప్రణాళికలు రచిస్తోంది. చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు! హ్యుందాయ్ Ioniq 5 రేంజ్ ఎంతంటే..! హ్యుందాయ్ Ioniq 5 SUV ఫ్లాగ్షిప్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 480 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. Ioniq 5 కారు కియాలోని EV6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ Ioniq 5 ఫీచర్స్..! హ్యుందాయ్ Ioniq 5 కారు 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. సింగిల్-మోటార్ లేదా డ్యూయల్-మోటార్ సెటప్‌తో అందుబాటులో ఉంది. టాప్-ఆఫ్-ది-లైన్ డ్యూయల్ మోటార్ సెటప్, ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికతో రానుంది. ఈ కారు 320 హార్స్పవర్ సామర్థ్యంతో, 604 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది సుమారు 0 నుండి 100 kmph వేగాన్ని కేవలం ఐదు సెకండ్లలో అందుకోనుంది. ఈ కారు గరిష్ట వేగం 185 kmph. 350 kW ఛార్జర్ సహాయంతో కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయగలదు. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్ మోటార్ తీపికబురు..! -
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్ మోటార్ తీపికబురు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు హ్యుందాయ్ మోటార్ ఇండియా తీపికబురు అందించింది. వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సిద్ధమైంది. 2028 నాటికి ఆర డజనుకు పైగా ఎలక్ట్రిక్ మోడళ్లను రంగంలోకి దింపనుంది. వీటిలో ఒకటి వచ్చే ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగుతీయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా, అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ-జీఎంపీ ప్లాట్‌ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేయనుంది. 77.4 కిలోవాట్ అవర్ వరకు సామర్థ్యం గల బ్యాటరీ పొందుపరిచే వీలుంది. 2, 4 వీల్ డ్రైవ్‌తోపాటు గంటకు 260 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ వాహనాల అభివృద్ధి, పరిశోధన కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్.ఎస్.కిమ్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చెన్నై ప్లాంటులో చేపడతామని, బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. భారత్‌లో కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్‌ను విక్రయిస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ అమ్మకాల పరంగా అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్, 2030 నాటికి 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. స్థానిక ప్యాసింజర్ వేహికల్ మార్కెట్లో హ్యుందాయ్ 16-17% వాటాను కలిగి ఉంది. (చదవండి: ఇటలీ ఇచ్చిన షాక్‌తో ఉలిక్కిపడ్డ అమెజాన్!) -
కొత్త కారు కొనేవారికి హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్!
మీరు గనుక కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 2021లో ఎంపిక చేసిన మోడల్స్ పై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ శాంట్రో, గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఐ20 కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లను ప్రకటించింది. దీనికి సంబంధించి వివరాలు ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఈ ఆఫర్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే ఉంటుంది. (చదవండి: మహారాష్ట్రలో భారీగా తగ్గనున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర!) హ్యుందాయ్ సాంట్రో మారుతి సుజుకి వ్యాగన్ఆర్, టాటా టియాగో ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ సాంట్రో కారు అసలు ధర రూ.4,76,690 నుంచి రూ.6,44,690(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. అయితే, మీరు ఎంచుకున్న వేరియంట్ కార్లపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మారుతి సుజుకి స్విఫ్ట్ కు ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు అసలు ధర రూ.5,28,590 నుంచి రూ.8,50,050 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా నియోస్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఆరా మారుతి సుజుకి డిజిర్, హోండా అమేజ్ ప్రత్యర్థి అయిన హ్యుందాయ్ ఆరా కారు అసలు ధర రూ.5,99,900 నుంచి రూ.9,36,300(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ ఆధారంగా కాంపాక్ట్ సెడాన్ కార్లపై రూ.50,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.35,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.50,000 వరకు హ్యుందాయ్ ఐ20 మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి వాటి ప్రధాన ప్రత్యర్ధి హ్యుందాయ్ ఐ20 కారు అసలు ధర రూ.6,91,200 వద్ద ప్రారంభమై రూ.11,40,200 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. మీరు ఎంచుకున్న వేరియంట్ బట్టి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.40,000 వరకు డిస్కౌంట్స్ కంపెనీ అందిస్తుంది. డిస్కౌంట్ - రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ - రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ - రూ.5,000 మొత్తం - రూ.40,000 వరకు -
హ్యుందాయ్ కంపెనీలో ముగ్గురికి కరోనా..
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియాలో కరోనా కలకలం రేగింది. రెండు నెలల లాక్డౌన్ అనంతరం కార్యకలాపాలను ప్రారంభించిన నేపథ్యంలో ఇండియన్ ప్లాంట్‌లో పనిచేసే ముగ్గురు కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. కరోనా బారిన పడిన కార్మికులు ప్రస్తుతం సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారని కంపెనీ ప్రతనిధులు తెలిపారు. వారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కోవిడ్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆదేశించిన నియమాలను పాటిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా, మరో పదహారు మంది కార్మికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని.. వారి ఫలితాలు రెండు మూడు రోజులలో రావచ్చని ప్రభుత్వ సీనియర్ ఉన్నతాధికారి ఓ సంస్థకు తెలిపారు. కాగా పరిశ్రమల వృద్ధిని ఆపడం ప్రభుత్వ విధానం కాదని.. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారి పి.పొన్నయ్య తెలిపారు. లాక్డౌన్ వల్ల ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని.. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
హ్యుందాయ్ క్రెటా @ రూ. 9.9 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’ కారులో అధునాతన వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులోకి వచ్చిన ఈ నూతన కారు ధరల శ్రేణి రూ. 9.9 లక్షలు – 17.2 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ ఎస్ ఎస్ కిమ్ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలోని లోపాలను అధిగమించి, అత్యాధునిక వాహనాన్ని మార్కెట్లోకి తీసుకుని రావడం కోసం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. సాధ్యాసాధ్యాలను పరిశీలించి కొత్త మోడల్ అందుబాటులో ఉంచాం. ఇక మల్టీ–సీటర్ హై ఆక్యుపెన్సీ వెహికల్ తయారీలో పట్టు సాధించడంలో భాగంగా త్వరలోనే మల్టీ–పర్పస్ వెహికల్ (ఎంపీవీ)ని తీసుకురావాలని యోచిస్తున్నాం’ అని వెల్లడించారు. -
హ్యుందాయ్ కార్ల ధరలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచుతోంది. అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంతవరకైనా తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ.3.89 లక్షల నుంచి రూ.26.84 లక్షల రేంజ్లో ధరలుండే శాంత్రో హ్యాచ్‌బాక్ నుంచి ఎస్యూవీ ట్యూసన్ వరకూ వివిధ రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. కమోడిటీల ధరలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లలో ఒడిదుడుకుల కారణంగా ఇప్పటికే చాలా కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్, ఫోర్డ్ ఇండియా, నిస్సాన్ ఇండియా, మారుతీ సుజుకీ, టయోటా, బీఎమ్‌డబ్ల్యూ, రెనో, ఇసుజు కంపెనీలు ధరలను పెంచనున్నామని పేర్కొన్నాయి. -
హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ20’లో ఆటోమేటిక్ వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘ఎలైట్ ఐ20’లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. దీని ప్రారంభ ధర రూ.7.04 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. తాజా వేరియంట్ ద్వారా ప్రీమియం కాంపాక్ట్ విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లకు ఉన్న బలమైన డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని కంపెనీ భావిస్తోంది. కాగా 2015లో 4 శాతంగా ఉన్న ప్రీమియం కాంపాక్ట్ విభాగంలోని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ల అమ్మకాలు, 2018 నాటికి 14 శాతానికి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్లలో పెట్రోల్ వేరియంట్లు న్యూఢిల్లీ: జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఇండియా తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీలు డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్‌లో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధర వరుసగా రూ.49.2 లక్షలు, రూ.51.06 లక్షలుగా ఉంది. ఈ రెండు వేరియంట్లలోనూ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఇంజీనియమ్ 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ‘‘రేంజ్ రోవర్ వెలార్‌లో ఇప్పటికే అధిక పనితీరు కనబరిచే ఇంజీనియమ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చాం. ఇప్పుడు ఇదే ఇంజిన్‌ను డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్లలోనూ అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి పేర్కొన్నారు. వీటిల్లో వై–ఫై హాట్‌స్పాట్ (4జీ యాక్సెస్‌తోపాటు 8 వరకు డివైస్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు) సహా పలు ఇతర ఫీచర్లను పొందుపరిచామని తెలిపారు. -
పెరగనున్న హ్యుందాయ్ కార్ల రేట్లు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తమ వాహనాల రేట్లను సుమారు 2 శాతం దాకా పెంచనున్నట్లు తెలిపింది. పెరిగే రేట్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాలను తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హ్యుందాయ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. కమోడిటీల రేట్లు, రవాణా ఖర్చులు, కొన్ని పరికరాలపై కస్టమ్స్ సుంకాలు పెరగడం తదితర ప్రతికూల పరిణామాలన్నింటినీ గత కొన్నాళ్లుగా కంపెనీయే భరిస్తోందని, అయితే ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో ధరల పెరుగుదలను కొంత మేర కస్టమర్లకు బదలాయించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎస్యూవీ క్రెటా ధరల్లో మాత్రం ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. దీని రేటు రూ. 9.44 లక్షల నుంచి రూ. 15,03 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్‌షోరూం రేటు) ఉంది. హ్యుందాయ్ ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ చిన్న కారు ఇయాన్ నుంచి ప్రీమియం ఎస్యూవీ టక్సన్ దాకా వివిధ వాహనాలను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 3.3 లక్షల నుంచి రూ. 25.44 లక్షల దాకా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రేటు) ఉన్నాయి. -
హ్యుందాయ్ క్రెటా.. సరికొత్తగా..
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘క్రెటా’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.9.43 లక్షలు– రూ.15.03 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కొత్త అప్డేటెడ్ క్రెటాలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 6–వే పవర్ డ్రైవర్ సీట్, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జర్ వంటి పలు అదనపు ఫీచర్లను పొందుపరిచామని కంపెనీ తెలిపింది. ‘2015లో తొలిసారి క్రెటాను మార్కెట్లోకి తీసుకువచ్చాం. ఎస్యూవీ విభాగంలో పేరొందిన బ్రాండ్‌గా అవతరించాం. తాజా 2018 క్రెటాతో ఎస్యూవీ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టిస్తాం’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో వై.కె.కో తెలిపారు. క్రెటా పెట్రోల్ వేరియంట్ ధర రూ.9.43 లక్షలు– రూ.13.59 లక్షలు శ్రేణిలో, డీజిల్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు రూ.15.03 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొన్నారు. -
హ్యుందాయ్ యాభై లక్షవ కారు
ముంబై: దేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా యాభై లక్షవ కారును తయారు చేసింది. ఇది కొత్త జనరేషన్ వెర్నా కారు. దేశీ కార్ల విభాగంలో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి అని హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వై.కె.కో తెలిపారు. ‘ఈ రోజు మేం సంతోషంగా ఉన్నాం. యాభై లక్షవ కారు కొత్త జనరేషన్ వెర్నాను తయారు చేశాం. పరిశ్రమలో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి. దీన్ని ఇలాగే కొనసాగిస్తాం’ అన్నారు. -
4–వీల్డ్రైవ్తో హ్యుందాయ్ ‘టక్సన్’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘టక్సన్’లో 4–వీల్డ్రైవ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.25.19 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). టక్సన్ టాప్–ఎండ్ డీజిల్ వేరియంట్లో మాత్రమే ఈ ఫీచర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లకు అందుబాటు ధరల్లో ప్రొడక్టులను అందించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో వై.కె.కో పేర్కొన్నారు. తాజా కొత్త వేరియంట్ బుకింగ్స్‌ను ప్రారంభించామని తెలిపారు. ఇక టక్సన్ ఏజీ జీఎల్ వేరియంట్స్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్ (డీబీసీ), బ్రేక్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లను పొందుపరిచామని వివరించారు. -
హ్యుందాయ్ నుంచి ఆటోమేటిక్ ‘ఎలైట్ ఐ20’
ధర రూ.9.01 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా’ తాజాగా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధరను రూ.9.01 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్లో 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హైట్ అడ్జెస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. -
అగ్రస్థానంపై హ్యుందాయ్ కన్ను..
♦ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లు ♦ హైదరాబాద్ ఆర్ అండ్ డీ కీలకం చెన్నై: హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) కంపెనీ ప్రతి ఏడాది రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేనున్నది. ఈ వ్యూహాంతో మార్కెట్లో అగ్రస్థానం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హెచ్ఎంఐఎల్ ఎండీ, యంగ్ కీ కూ చెప్పారు. శుక్రవారం 20వ ఫౌండేషన్ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతి సెగ్మెంట్లో ఒక మోడల్‌ను అందించనున్నామని, మార్కెట్లో అగ్రస్థానం పొందడం, అత్యంత అభిమానించే,నమ్మే ఆధునిక ప్రీమియమ్ బ్రాండ్‌గా నిలవడం లక్ష్యమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి 13.05 లక్షల వాహనాలను విక్రయించగా, రెండో స్థానంలో ఉన్న తాము 4.83 లక్షల వాహనాలను విక్రయించామని కూ పేర్కొన్నారు. ఎగుమతుల్లో అగ్రస్థానం నమ్మకమైన, సురక్షితమైన కార్లను డిజైన్ చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న తమ భారత ఆర్ అండ్ డీ సెంటర్ కీలకమైన పాత్రను పోషిస్తోందని కూ తెలిపారు. 449 డీలర్లు, 1,150 సర్వీసింగ్ సెం టర్లతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. 1999లో 20 కార్లతో తమ ఎగుమతుల ప్రస్థానం ప్రారంభమైందని, ప్రస్తుతం 92 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నామని, ఈ ఏడాది మార్చి వరకూ 23 లక్షల కార్లను ఎగుమతి చేశామని వివరించారు. -
అత్యంత ప్రభావిత బ్రాండ్ మారుతీ
న్యూఢిల్లీ : భారత్‌లో మారుతీ సుజుకీ అత్యంత ప్రభావిత బ్రాండ్ అని ప్రముఖ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేడీ పవర్ తన నివేదికలో తెలిపింది. దీని తర్వాతి స్థానాల్లో హ్యుండయ్ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఉన్నాయని పేర్కొంది. జేడీ పవర్ ఆసియా పసిఫిక్ 2015 ప్రభావిత బ్రాండ్ సర్వే ప్రకారం.. మారుతీ సుజుకీ 839 పాయింట్లతో (1,000 పాయింట్లకు గానూ) అత్యంత ప్రభావిత బ్రాండ్ విషయంలో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. హ్యుండయ్ 767 పాయింట్లతో రెండో స్థానంలో, టయోటా 744 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాయి. -
హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది. వివరాల్లోకి వెళితే... సంస్థ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ఒక లక్కీ డ్రా నిర్వహించింది. రీజినల్ మేనేజర్ డ్రా విజేతలను ప్రకటించారు. తల్వార్ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన ఏ రాజేష్ డ్రాలో మొదటి బహుమతి 32 అంగుళాల శామ్సంగ్ ఎల్ఈడీ టీవీని గెలుచుకున్నారు. లక్ష్మీ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన షేక్ అహ్మద్ శామ్సంగ్ 7 ట్యాబ్లెట్ బహుమతిగా పొందారు. అన్ని మోడళ్లకు సంబంధించి ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న దాదాపు 1707 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్స్ తదితర బహుమతులు గెలుపొందారు. -
హ్యుందాయ్ కొత్త ఎలంట్రా
పెట్రోల్ కారుః రూ.14.13 లక్షలు-రూ.16.45 లక్షలు డీజిల్ కారుః రూ.14.58 లక్షలు- రూ.17.94 లక్షలు న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ప్రీమియం సెడాన్ ఎలంట్రా మోడల్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమవుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బి.ఎస్. సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.14.13 లక్షల నుంచి రూ.16.45 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.14.58 లక్షల నుంచి రూ.17.94 లక్షల రేంజ్లో ఉన్నాయని (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) వివరించారు. పెట్రోల్ కారు 16.3 కి.మీ. డీజిల్ కారు 22.7 కి.మీ మైలేజీని ఇస్తాయని పేర్కొన్నారు. వినూత్నమైన డ్రైవింగ్, అత్యున్నతమైన సౌకర్యాలతో కూడిన ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన తొలి హ్యుందాయ్ కారు ఇదేనని తెలిపారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా కోటి కార్ల అమ్మకాలు సాధించిన అగ్రశ్రేణి పది మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు. సమీప భవిష్యత్తులో 5 లక్షల వార్షిక అమ్మకాలు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. -
కార్ ఆఫ్ ద ఇయర్‌గా హ్యుందాయ్ ఎలీట్ ఐ20
హైదరాబాద్: ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్(ఐకోటి) 2015 అవార్డు హ్యుందాయ్ ఎలీట్ ఐ20కు లభించింది. మార్కెట్లోకి తెచ్చిన రెండో నెలలోనే అధికంగా అమ్ముడవుతున్న అగ్రశ్రేణి పది కార్లలో ఒకటిగా ఎలీట్ ఐ20 నిలిచిందని హ్యుందాయ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటోమొబైల్ మ్యాగజైన్లు-టాప్‌గేర్, మోటరింగ్ వరల్డ్, కార్ ఇండియా, ఓవర్‌డ్రైవ్, ఆటో బిల్డ్, ఆటో ఎక్స్, హిందూ బిజినెస్ లైన్, ఈవీఓల సీనియర్ ఎడిటర్లతో కూడిన జ్యూరీ ఈ అవార్డుకు ఎలీట్ ఐ20ని ఎంపిక చేసిందని వివరించింది. గత ఏడాది కూడా హ్యుందాయ్ గ్రాండ్ కారుకు ఈ అవార్డును గెల్చుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓ బిఎస్ సియో పేర్కొన్నారు. వరుసగా రెండు ఐకోటి అవార్డులు గెల్చుకున్న ఏకైక కంపెనీ తమదేనని వివరించారు. పదేళ్లలో మూడు ఐకోటీ అవార్డులను సాధించామని తెలిపారు. తమకు భారత్ కీలకమైన మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.